తెలంగాణ
Telangana: మాతో పడుకోకుంటే నీ పరువు బజారుకీడిస్తామంటూ.. యువతిపై తెగబడిన నలుగురు కామాంధులు, దారుణం తట్టుకోలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న బాధితురాలు, నిందితులంతా అరెస్ట్
Hazarath Reddyమహబూబాబాద్‌ జిల్లాలో యువతిపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌కేసులో నలుగురు నిందితులను (Four including police constable) పోలీసులు అరెస్ట్‌ చేశారు. యువతిని బెదిరించి నిందితులు లొంగదీసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. నిందితుల్లో టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్‌ కానిస్టేబుల్‌, ఓ ఎంపీటీసీ భర్త, మరో ఇద్దరు ఉన్నారు.
Hamsa Nandini: క్యాన్సర్ పై సగం గెలిచా: హంసా నందిని, మరో పోరాటానికి రెడీ అవుతున్నా, త్వరలోనే సర్జరీలు ఉన్నాయంటూ పోస్ట్, తన ట్రీట్ మెంట్ అప్‌డేట్ ఇచ్చిన నటి
Naresh. VNSక్యాన్సర్ బారిన పడ్డ నటి హంసా నందిని (Hamsa nandini) గుడ్ న్యూస్ చెప్పింది. తాను క్యాన్సర్ (Cancer) మహమ్మారి నుంచి కోలుకున్నట్లు పోస్ట్ చేసింది. ఆమెకు గ్రేడ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ (Breast cancer) వచ్చింది. దాంతో కొంతకాలంగా కీమో థెరపీ ట్రీట్‌ మెంట్ తీసుకుంటోంది. అప్ప‌టి నుంచి ధైర్యంగా ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటూ చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 311 మందికి కరోనా, ఒక్క జీహెచ్ఎంసీలోనే 90 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 35,837 కరోనా పరీక్షలు నిర్వహించగా, 311 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీలోనే 90 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 16, మంచిర్యాల జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి.
Telangana: బైకును ఢీ కొట్టి మంటల్లో కాలిపోయిన బస్సు, బైక్‌పై వెళ్తున్న వ్యక్తి సజీవ దహనం, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో విషాద ఘటన
Hazarath Reddyతెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న బస్సును ఓ బైక్‌ వేగంగా ( Bus catches fire as bike hits it) ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో బైక్‌ను తప్పించే క్రమంలో బస్సు ఆటోపైకి దూసుకెళ్లింది. బస్సు ఇంజిన్‌ కిందిభాగంలో బైక్‌ ఇరుక్కొని మంటలు చెలరేగగా, బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది
Hyderabad: వాహనదారులకు తెలంగాణ పోలీసుల బంపర్ ఆఫర్, పెండింగ్ చలాన్లపై 75 శాతం డిస్కౌంట్, మార్చిలో స్పెషల్ డ్రైవ్, మొండిబకాయిలు వసూలు చేసేందుకు గట్టి ప్లాన్
Naresh. VNSహైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పారు పోలీసులు. పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునేవారికి బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రత్యేకంగా టూవీలర్లపైన భారీ డిస్కౌంట్‌ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ద్విచక్రవాహనదారులకు 75శాతం డిస్కౌంట్‌ కల్పించారు. కార్లకు 50శాతం, ఆర్టీసీబస్సులకు 30శాతం, తోపుడు బండ్లకు 20శాతం ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
Coronavirus in TS: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా, గత 24 గంటల్లో 348 మందికి కరోనా, మరణాలు నిల్
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,580 శాంపిల్స్ పరీక్షించగా, 348 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 93 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 429 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్క మ‌ర‌ణం కూడా న‌మోదు కాలేదు.
Telangana: నది లేని చోట అతి పెద్ద ప్రాజెక్ట్, మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన సీఎం కేసీఆర్, ప్రాజెక్టు ద్వారా పది జిల్లాలకు తాగు, సాగు నీరు
Hazarath Reddyతెలంగాణలో మరో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి కొమురవెల్లి మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana: CM KCR) బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు.
Bayyaram Ukku-Telangana Hakku: బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఒక్క రోజు నిరసన చేపట్టిన టీఆర్ఎస్ నేతలు
Hazarath Reddyబయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీఆర్ఎస్ నేతలు బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు నినాదంతో నిరసన దీక్ష చేపట్టారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిథులు, నాయకులు ఖమ్మంలో ఒక్కరోజు దీక్ష (TRS leaders Protest) చేపట్టారు
Bhadrachalam: భద్రాచలం రాములోరి దర్శనం ఇకపై చాలా ఖరీదు, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు టికెట్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన ఈవో శివాజీ
Hazarath Reddyతెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం (Bhadrachalam) దేవస్థానంలో ఈ ఏడాది నిర్వహించే శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల టికెట్‌ ధరలను (vSri Rama Navami celebrations Tickets Price Hike ) పెంచుతున్నట్టు ఈవో శివాజీ తెలిపారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 374 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 91 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 39,579 శాంపిల్స్ పరీక్షించగా, 374 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 91 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 39, నల్గొండ జిల్లాలో 22 కేసులు వెల్లడయ్యాయి.
COVID in TS: తెలంగాణ తగ్గుముఖం పట్టిన కరోనా, గత 24 గంటల్లో 385 మందికి కోవిడ్, జీహెచ్ఎంసీ పరిధిలో 95 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 39,386 శాంపిల్స్ పరీక్షించగా, 385 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 95 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27, ఖమ్మం జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి.
CM KCR Speech at Narayankhed: దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నా, పోరాటానికి బయల్దేరా, బంగారు భారతదేశాన్ని తయారుచేద్దాం, నారాయణఖేడ్‌‌ బహిరంగసభలో కేసీఆర్
Krishnaనారాయణఖేడ్‌‌లో నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడుతూ జాతీయ రాజకీయ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో దుర్మార్గమైన మత రాజకీయాలు నడుస్తున్నాయని ధ్వజమెత్తారు.
MP Sanjay Raut on CM KCR: సీఎం కేసీఆర్ అందర్నీ కలుపుకుపోతారు, ముందుకు నడిపించే సామర్థ్యాలు మెండుగా ఉన్నాయని తెలిపిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్
Hazarath Reddyకే చంద్రశేఖర్ రావు ఎంతో కష్టపడి పనిచేసే రాజకీయ నేత. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అందరికనీ కలుపుకునిపోయే, నాయకత్వం వహించే సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి’’ అని సంజయ్ రౌత్ అన్నారు. ఇద్దరు సీఎంలు (కేసీఆర్,ఠాక్రే), ఇతర రాజకీయ నాయకులు త్వరలోనే సమావేశమై చర్చలు నిర్వహిస్తారని చెప్పారు.
CM KCR Meets Sharad Pawar: సరికొత్త ఎజెండాతో ముందుకు వస్తాం: కేసీఆర్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ తో సుధీర్ఘంగా చర్చ, కేసీఆర్‌ తో కలిసి పనిచేస్తానన్న పవార్, త్వరలోనే అన్ని పార్టీల నేతలతో సమావేశం
Naresh. VNSదేశం దశ, దిశను మార్చేందుకు తాను ప్రయత్నిస్తున్నాన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR). ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) తో సమావేశమైన ఆయన...పలు కీలక అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో పాలన సరైన రీతిలో జరగడం లేదని, కొత్త అజెండాతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు కేసీఆర్.
CM KCR Mumbai Tour Highlights: సీఎం కేసీఆర్ ముంబై పర్యటన విజయవంతం, జాతీయ స్థాయిలో అందర్నీ ఏకం చేస్తామని ప్రకటన, దేశ రాజ‌కీయాల‌పై చ‌ర్చల కోసం ప్రముఖులతో భేటీ
Hazarath Reddyతెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ముంబై ప‌ర్య‌ట‌న (CM KCR Mumbai Tour Highlights) విజ‌య‌వంతంగా ముగిసింది. ముంబై ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాకరేతో పాటు ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌తో వేర్వేరుగా సీఎం కేసీఆర్ (Telangana CM K Chandrashekar Rao) స‌మావేశ‌మై జాతీయ రాజ‌కీయాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 256 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 107 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,341 కరోనా పరీక్షలు నిర్వహించగా, 256 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 107 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17 కేసులు వెల్లడయ్యాయి.
KCR Meets Uddhav: ఇది ఆరంభం మాత్రమే! త్వరలోనే అన్ని పార్టీల నేతల మీటింగ్, ఉద్దవ్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించిన సీఎం కేసీఆర్, ప్రతీకార రాజకీయాలు మంచివి కావన్న ఇరువురు సీఎంలు
Naresh. VNSదేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ( Regional parties) ఏకతాటిపైకి రావాల్సిన సమయమిదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) అన్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఆదివారం ముంబయి వచ్చిన సీఎం కేసీఆర్‌... జాతీయ రాజకీయాలపై ఉద్ధవ్‌ ఠాక్రేతో (Uddhav Thackeray) చర్చించారు.
Telangana CM KCR meets Maharashtra CM Uddhav Thackeray: ముంబై చేరుకున్న కేసీఆర్, మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ తో సీఎం కేసీఆర్ భేటీ
Krishnaతెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో ఆదివారం నాడు ముంబైలో భేటీ అయ్యారు. హైద్రాబాద్ బేగంపేట విమానాశ్రయం నండి ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ముంబైలో ఘన స్వాగతం లభించింది.
Sangareddy MLA Jagga Reddy Resignation: పదిహేను రోజుల తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
Krishnaపదిహేను రోజుల తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పెద్దలు తనతో సంప్రదింపులు జరిపిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
KCR To Meet Uddhav: జాతీయ రాజకీయాల్లోకి తెలంగాణ సీఎం కేసీఆర్! మహారాష్ట్రతోనే తొలి అడుగు, ఆదివారం ఉద్దవ్‌ తో కేసీఆర్ కీలక భేటీ, కేంద్రంపై యుద్ధానికి స్కెచ్ వేయనున్న కేసీఆర్
Naresh. VNSజాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌(CM KCR)...ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఒక్కొక్కరిని కలువనున్నారు. ఈ మేరకు ఆదివారం నాడు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో (Uddhav Thackeray) సమావేశం కానున్నారు.