తెలంగాణ
Yadadri Bhuvanagiri Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, RTC బస్సు ఢీ కొని రోడ్డు పనులు చేసుకునే 4 గురు కూలీలు మృతి..
Krishnaయాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. నలుగురు కూలీలు మృతి చెందారు. ఆలేరు మండలం మంతపురి బైపాస్ రెడ్డు వద్ద డివైడర్ పనులు చేస్తున్న కూలీలపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. డివైడర్ ను ఢీకొన్న తర్వాత అక్కడే ఉన్న ట్రాక్టర్ ను కూడా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
Khammam Crime: బాబాయితో శృంగారం చేస్తూ భర్తకు అడ్డంగా దొరికిపోయింది, నిలదీసినందుకు కట్టుకున్న భర్తను రోకలిబండతో దారుణంగా కొట్టి చంపిన మహిళ..
Krishnaకట్టుకున్న భర్తను కాదని.. వివాహేతర సంబంధాలపై మోజు పెంచుకుంటున్నారు. వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను హతమార్చిందో భార్య. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.
Mahesh Babu: రియల్ హీరో అనిపించుకుంటున్న మహేష్ బాబు, చిన్నారుల ఆపరేషన్ల కోసం ఫౌండేషన్ ప్రారంభించిన సూపర్ స్టార్, ఇప్పటి వరకు 1200 మందికి పైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు
Naresh. VNSమహేష్ బాబు మరో ముందడుగు వేశారు. ఇప్పటికే ఆంధ్రా హాస్పిటల్స్‌(Andhra Hospitals), రెయిన్ బో హస్పటల్స్(Rainbow Hospitals) తో కలిసి మహేష్ చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయిస్తూ వారికి పునర్జన్మనందిస్తున్నారు. ఇప్పటి వరకు మహేష్ 1200 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్‌ చేయించినట్లు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చాడు.
Congress Leader Bhatti Vikramarka: కల్లు తాగుతూ కార్యకర్తల్లో జోష్ నింపిన సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మధిరలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న భట్టివిక్రమార్క
Krishnaగీత కార్మికుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఏం చేయడం లేదన్నారు. తాటిచెట్లు ఎక్కడానికి ఎలక్ట్రానిక్ మోకులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క కల్లు తాగారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 152 మందికి కరోనా, రాష్ట్రంలో నేటివరకు 3,36,46,433 కరోనా టెస్టులు
Hazarath Reddyతెలంగాణలో కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30వేల 146 కరోనా పరీక్షలు చేయగా 152 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు.
KCR Meet Hemant Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో సీఎం కేసీఆర్ భేటీ, ప్రస్తుత దేశ రాజ‌కీయాలపై చర్చలు
Hazarath Reddyజార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌, రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షులు వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.
Telangana: గల్వాన్‌ అమరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ పరామర్శ, సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్న తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyగల్వాన్ అమరవీరులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం జార్ఖండ్‌ రాజధాని రాంచీకి వెళ్లనున్నారు. గతేడాది గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం (Galwan martyrs) పొందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు.
Ibrahimpatnam shooting: ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కేసును చేధించిన రాచ‌కొండ పోలీసులు, ఆరుగురిని అరెస్ట్ చేశామని తెలిపిన సీపీ మహేష్ భగవత్
Hazarath Reddyతెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కేసులో (Ibrahimpatnam shooting) మిస్టరీ వీడింది. మట్టారెడ్డి సహా ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు ఆయుధాలు, 20 రౌండ్ల బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. మట్టారెడ్డిని కీలక సూత్రధారిగా పోలీసులు తేల్చారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 164 కేసులు, అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 61 మందికి పాజిటివ్
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 31,303 కరోనా పరీక్షలు నిర్వహించగా, 164 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 61 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి.
CM KCR Delhi Tour: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, బీకేయూ నేత రాకేష్ టికాయత్‌తో సీఎం కేసీఆర్ భేటీ, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు
Hazarath Reddyతెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, బీకేయూ నేత రాకేష్ టికాయత్ తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని నివాసంలో సీఎం కేసీఆర్ వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపైన చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Telangana: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అవాస్తవం, ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా నన్ను సెల‌వుపై పంపించలేదు, కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి
Hazarath Reddyన‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా సెల‌వుపై పంపించింద‌ని రేవంత్ చేసిన ఆరోప‌ణ‌లపై డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి (DGP Mahendar Reddy) స్పందించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు అవాస్త‌వ‌మ‌ని డీజీపీ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల త‌న ఇంట్లో తాను జారిప‌డ‌టంతో ఎడ‌మ భుజానికి గాయ‌మైందని డీజీపీ తెలిపారు.
Telangana Inter Exams: తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు, జేఈఈ మెయిన్స్ కారణంగా మారిన తేదీలు, ఇంటర్ బోర్డు కొత్తగా రీ షెడ్యూల్ చేసిన తేదీలు ఇవే!
Naresh. VNSగతంలో తెలంగాణలో ఇంటర్ పరీక్షల (Telangana Inter Exams) షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు.. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 21వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించాలనుకున్నారు. కానీ జేఈఈ పరీక్షల కారణంగా ఎగ్జామ్స్ ను రెండు రోజులు వెనక్కు మార్చారు.
TSRTC: వీసీ స‌జ్జ‌నార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం, హైద‌రాబాద్ సిటీలో ఉచితంగా ప్ర‌యాణం, 250 కిలోమీట‌ర్ల పైన టికెట్ బుక్ చేసుకున్న వారికి తీపి కబురు చెప్పిన టీఎస్ఆర్టీసీ
Hazarath Reddyతెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. 250 కిలోమీట‌ర్లపై ఉన్న సుదూర ప్రాంతాల‌కు వెళ్ల‌డానికి ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చేసుకున్న ప్ర‌యాణికుల‌కు తీపి క‌బురు అంద‌జేశారు. ఇలా సుదూర ప్రాంతాల‌కు వెళ్లే వారు త‌మ ప్రాంతం నుంచి ఆర్టీసీ బ‌స్సు ఎక్కే ప్రాంతం వ‌ర‌కూ హైద‌రాబాద్ సిటీలో ఉచితంగా ప్ర‌యాణం చేయ‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించారు.
Minister Srinivas Goud: హత్య చేసేందుకు రూ.12కోట్ల సుపారీ, తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్య కుట్రను చేధించిన పోలీసులు, నలుగురు అరెస్ట్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్య కుట్రను పోలీసులు ఛేదించారు. మంత్రితో ( Telangana Minister Srinivas Goud) పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్‌కు సుపారీ గ్యాంగ్‌తో హత్యకు మహబూబ్‌నగర్‌కు చెందిన కొందరు కుట్ర పన్నారు.
GST Collections in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.3,157 కోట్ల జీఎస్టీ, తెలంగాణలో రూ.4,113 కోట్ల జీఎస్టీ
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు (GST Collections in Telugu States) పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.3,157 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇది గత ఏడాది ఫిబ్రవరి కంటే 19 శాతం ఎక్కువ. అటు, తెలంగాణలో కూడా జీఎస్టీ ఆదాయం 13 శాతం పెరిగి రూ.4,113 కోట్లకు చేరుకున్నది.
Telangana: చౌటుప్పల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు, ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు
Hazarath Reddyతెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Telangana Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, పదకొండు మంది గాయపడ్డారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 152 మందికి కరోనా, అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 64 కొత్త కేసులు
Hazarath Reddyగడచిన 24 గంటల్లో తెలంగాణలో 19,527 కరోనా టెస్టులు నిర్వహించగా, 152 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 64 కొత్త కేసులు వెలుగు చూశాయి. మంచిర్యాల జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులే రాగా... మిగతా జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
Mana Ooru Mana Badi: తెలంగాణలో మన ఊరు -మన బడి, మార్చి 8న వనపర్తి జిల్లా నుంచి ప్రారంభించనున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌
Hazarath Reddyతెలంగాణ సీఎం కేసీఆర్‌ మార్చి 8న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. మన ఊరు -మన బడి (Mana Ooru Mana Badi) కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కన్నెతండా లిప్టును, వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్మించిన వ్యవసాయ మార్కెట్‌ యార్డును ప్రారంభిస్తారు.
Discounts on Traffic E-Challans: భారీగా పెండింగ్ చలానాలు ఉన్నాయా.. ఏం పర్లేదు, ఈ నెలాఖరు వరకు 75 శాతం డిస్కౌంట్‌తో కట్టేయండి, వాహనదారులకు బంపరాఫర్ ప్రకటించిన తెలంగాణ ట్రాఫిక్‌ పోలీస్ శాఖ
Hazarath Reddyతెలంగాణ ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులకు మార్చి నెలల శుభవార్తను అందించారు. మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు వాహనాదారులు పెండింగ్‌లో ఉన్న చలానాల మొత్తంలో 25 శాతం మాత్రమే చెల్లిస్తే (Discounts on Ttraffic E-Challans) సరిపోతుంది. అంటే 75శాతం రాయితీ (Pending Challans from March 1) ఉంటుంది.
Covid in TS: గడచిన 24 గంటల్లో తెలంగాణలో 156 మందికి కరోనా, జీహెచ్ఎంసీలో అత్యధికంగా 44 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyగడచిన 24 గంటల్లో తెలంగాణలో 19,947 కరోనా పరీక్షలు నిర్వహించగా, 156 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 44 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధిక జిల్లాల్లో సింగిల్ డిజిట్ లోనే తాజా కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 425 మంది కరోనా నుంచి కోలుకున్నారు.