తెలంగాణ

Hyderabad Shocker: అక్రమ సంబంధముందనే అనుమానంతో భార్య తల నరికిన భర్త, నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన యువకుడు, రాజేంద్రనగర్‌లో ఘటన

Naresh. VNS

తన భార్య ఇంకెవరితోనే అక్రమ సంబంధం(extramarital relationships) పెట్టుకుందనే అనుమానం పర్వేజ్ మెదడును తొలిచేసింది. అప్పటికే గంజాయి(Ganja)తో పాటూ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు పర్వేజ్. గురువారం రాత్రి మత్తులో ఇంటికి వచ్చిన పర్వేజ్‌...తన భార్యతో గొడవ పడ్డాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కత్తితో సమ్రీన్ గొంతు కోశాడు.

TS MLC Election 2021: ముగిసిన స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికల పోలింగ్, భారీ స్థాయిలో ఓటింగ్ నమోదు, ఈ నెల 14న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. కాగా నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ (TS MLC Election 2021 Polling) సాయంత్రం 4 గంటలకు ముగిసింది.

MLC Polls 2021: తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు

Hazarath Reddy

తెలంగాణలోని 5 జిల్లాల్లోని 6 స్థానాలకు పోలింగ్ (MLC Polls 2021) కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మ.2 గంటల వరకు 96.69 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక ఖమ్మం జిల్లాలో మ.2 గంటల వరకు 79.95 శాతం పోలింగ్ జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో మ.2 గంటల వరకు 87.73 శాతం పోలింగ్ జరిగింది.

Telangana Shocker: భర్త మరో మహిళతో.. చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య, తెలంగాణ జనగామ జిల్లాలో విషాద ఘటన

Hazarath Reddy

తెలంగాణలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఓ వివాహిత మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య (married woman committed suicide) చేసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రామన్నగూడెంలో జరిగింది.

Advertisement

Corona in TS: తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 201 కరోనా కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో 76 మందికి కరోనా

Hazarath Reddy

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 201 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 76 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో ఒకరు మృతి చెందగా... 184 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 98.83 శాతంగా ఉంది.

Singareni Coal Blocks: సింగరేణిలో మోగిన సమ్మె సైరన్, బొగ్గు గనుల్లో నిలిచిపోయిన ఉత్పత్తి, 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్రం వెంటనే ఆపాలని డిమాండ్, ప్రధాని మోదీకి లేఖ రాసిని సీఎం కేసీఆర్

Hazarath Reddy

సింగరేణిలో తలపెట్టిన 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధానమంత్రి (PM Narendra Modi) నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ తలపెట్టిన బొగ్గు బ్లాకుల వేలాన్ని (Singareni Coal Blocks Auction) వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం నుంచి మూడు రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చాయి

Coronavirus in TS: తెలంగాణలో కొత్తగా 205 మందికి కరోనా పాజిటివ్, అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 79 కేసులు

Hazarath Reddy

తెలంగాణలో బుధవారం 38,085 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 205 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,77,546కి చేరిందని తెలిపారు.

Singareni Strike:సింగరేణిలో సమ్మె సైరన్, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై గళమెత్తిన కార్మికులు, నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

Naresh. VNS

సింగరేణి (Singareni )లో సమ్మె(strike) సైరన్ మోగింది. నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ(commercial mining)కు వ్యతిరేకంగా కార్మికులు విధులను బహిష్కరించారు. మొదటి షిప్ట్‌ నుంచే కార్మికులు విధులకు హాజరుకాలేదు. దీంతో కోల్‌బెల్ట్‌(Coal Blet) వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈ సమ్మె(strike) మూడు రోజులపాటు కొనసాగనుంది.

Advertisement

Telangana: తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్, సర్వీసులను క్రమబద్ధీకరించే జీవో 16 అమలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు, ఇంప్లీడ్‌ పిటిషన్‌ కొట్టివేసిన తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం

Hazarath Reddy

కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2016లో జారీచేసిన జీవో 16ను అమలుచేయాలని హైకోర్టు (High Court) మంగళవారం తీర్పునిచ్చింది. జీవో 16ను సవాల్‌చేస్తూ దాఖలైన ఇంప్లీడ్‌ పిటిషన్‌ కొట్టివేసింది. ఒక రిట్‌ను కొట్టేసిన విషయాన్ని దాచడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

Coron in TS: తెలంగాణలో కొత్తగా 203 కరోనా కేసులు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 87 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 40,730 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 203 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 87 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 19, కరీంనగర్ జిల్లాలో 12, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 12 కేసులు గుర్తించారు.

Teenmaar Mallanna joins BJP: బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేసిన పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్

Hazarath Reddy

తీన్మార్ మల్లన్న అలియాన్ చింతపండు నవీన్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నకు తరుణ్ ఛుగ్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Parliament Session 2021: మోదీది ఫాసిస్ట్ ప్ర‌భుత్వం, మోదీ ప్ర‌భుత్వంపై ప్ర‌జాక్షేత్రంలోనే తేల్చుకుంటాం, పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు, బీజేపీపై మండిపాటు

Hazarath Reddy

ధాన్యం సేక‌ర‌ణ‌, విప‌క్ష ఎంపీల స‌స్పెన్ష‌న్ త‌దిత‌ర అంశాల‌పై కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా టీఆర్ఎస్ పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను (Parliament Winter Session) బ‌హిష్క‌రించారు. శీతాకాల స‌మావేశాలు పూర్త‌య్యేవ‌ర‌కు పార్ల‌మెంట్ బ‌హిష్క‌రిస్తున్నామ‌ని (TRS MPs to boycott Parliament's Winter Session) వారు ప్ర‌క‌టించారు.

Advertisement

Coronavirus in TS: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 195 మందికి పాజిటివ్, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 78 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 37,108 కరోనా పరీక్షలు నిర్వహించగా, 195 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 78 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 14, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి.

Telangana: తాగిన మత్తులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన కూలీ, మహబూబ్‌ నగర్‌ జిల్లాలో విషాద ఘటన, మరో చోట భార్య కాపురానికి రావడంలేదని బావిలో పడి ఆత్మహత్య చేసుకున్న భర్త

Hazarath Reddy

వెంకటయ్యకు మతిస్థిమితం సరిగ్గా పనిచేయడం లేదు. దానికి తోడు మద్యానికి బానిస (drinking alcohol) అయ్యాడు. శనివారం రాత్రి తాగిన మైకంలో అర్ధరాత్రి వేళ పక్కన ఉన్న రేకుల షెడ్డు లో ఉరి వేసుకొని ఆత్మహత్య ( insane person committed suicide) చేసుకున్నాడు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 156 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 54 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,693 కరోనా పరీక్షలు నిర్వహించగా, 156 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 54 కొత్త కేసులు వెల్లడి కాగా, కరీంనగర్ జిల్లాలో 47 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 147 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

Disha Rape And Murder Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ప్రాంతాన్ని పరిశీలించిన సిర్పూర్కర్‌ కమిషన్‌ సభ్యులు, స్థానికుల నుంచి తీవ్ర నిరసన..

Krishna

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ పై విచారణ జరుపుతున్న సిర్పూర్కర్‌ కమిషన్‌ ఆదివారం ఎన్ కౌంటర్ జరిగిన స్థలాన్ని పరిశీలించింది. మానవ హక్కుల సంఘాల దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ కమిషన్‌ను నియమించింది.

Advertisement

Rosaiah Last Rites: ముగిసిన మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు, అశ్రునయనాల మధ్య ఆయన వీడ్కోలు పలికిన అభిమానులు, హాజరైన నేతలు

Naresh. VNS

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(Rosaiah) అంత్యక్రియలు ముగిశాయి. కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఏపీ(AP) ప్రభుత్వం తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ(Bosta Sathyanarayana), వెల్లంపల్లి(Vellampally), పేర్నినాని(Perni Nani), బాలినేని(Balineni) హాజరయ్యారు.

Shilpa Chowdary Case Update: చిట్టా విప్పుతున్న శిల్పా చౌదరి, రూ.10 వడ్డీకి ఓ మహిళకు అప్పు ఇచ్చి మోసపోయానన్న శిల్ప, తెరపైకి మరో మహిళా వ్యాపారవేత్త పేరు

Naresh. VNS

అప్పుల పేరుతో సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలను కోట్ల రూపాయలు మోసం చేసిందని ఆరోపణలు ఎదుర్కుంటున్న శిల్పాచౌదరి (Shilpa chowdary) కేసులో ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తున్నాయి. శిల్ప వసూలు చేసిన డబ్బులను ఏం చేసిందనే కోణంలో ఇంటరాగేషన్ చేసిన పోలీసులకు(Police) పలు కీలక విషయాలు చెప్పింది.

Telangana Paddy Procurement: ముందు చేసుకున్న ఒప్పందానికి తెలంగాణ కట్టుబడి ఉండాలి, ధాన్యం సేక‌ర‌ణ‌పై ఎంపీ కేశవరావు ప్రశ్నకు బదులిచ్చిన పియూష్ గోయల్

Hazarath Reddy

కేంద్రమంత్రి పియూష్ గోయల్ స్పష్టమైన సమాధానం (Minister Piyush Goyal Clarified) ఇచ్చారు. వానాకాలం పంటను పూర్తిగా కొంటామని వెల్లడించారు. గతంలో తెలంగాణతో చేసుకున్న ఒప్పందం (ఎంఓయూ) ప్రకారమే ధాన్యం కొనుగోలు ఉంటుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తోనూ చర్చించినట్టు గోయల్ తెలిపారు. ముందు చేసుకున్న ఒప్పందానికి తెలంగాణ కట్టుబడి ఉండాలని హితవు పలికారు

Telangana Shocker: భర్త కళ్ల ముందే అల్లుడితో మేనత్త సెక్స్.. ఆ సీన్ చూస్తూ వీడియోలు తీసిన ఆమె భర్త, అనంతరం వీడియోతో అల్లుడిని బ్లాక్ మెయిల్ చేసిన దంపతులు, హైదరాబాద్‌లో దారుణ ఘటన

Hazarath Reddy

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలుడిపై మేనత్త లైంగిక దాడి (Aunty molestation minor boy) చేయడమే కాకుండా డబ్బు కోసం బెదిరింపులకు పాల్పడింది. పద్నాలుగు సంవత్సరాల వయసున్న మేనల్లుడిని స్కూలు నుంచి లాడ్జికి తీసుకువెళ్లి తన కామవాంఛలను తీర్చుకుంది. అనంతరం ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరింపులకు (blackmail with Video in banjara hills) పాల్పడింది.

Advertisement
Advertisement