తెలంగాణ
Telangana: ఫోన్ చేస్తే మాట్లాడని ప్రియురాలు, గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ప్రియుడు, కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన, మరో చోట అదనపు కట్నం వేధింపులకు పుట్టింట్లో ఆత్మహత్య చేసుకున్న నవవధువు
Hazarath Reddyకామారెడ్డి జిల్లాలోని దళితవాడలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని ఓ యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి (young man attempted suicide) పాల్పడ్డాడు. గొంతు కోసుకున్న వ్యక్తి నరేష్‌గా గుర్తించారు.
Coronavirus in Telangana: తెలంగాణలో విద్యాలయాల్లో కరోనా కలకలం, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలోనే 25 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌, రాష్ట్రంలో కొత్తగా 189 మందికి కోవిడ్
Hazarath Reddyతెలంగాణలోని విద్యాలయాల్లో కరోనా కలకలం రేపుతోంది. వేర్వేరు గురుకులాలు, కేజీబీవీల్లో గురువారం 34 మంది విద్యార్థినులు కరోనా (Coronavirus in Telangana) బారినపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలోని మహత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలోనే 25 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విద్యాసంస్థలో బుధవారం ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే.
Vijay Bhaskar Reddy Murder Case: రియల్టర్‌ విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో కొత్త కోణం, సోదరుడే దారుణంగా కాల్చి చంపేశాడు, మీడియాకు వివరాలను వెల్లడించిన సీనీ అంజనీకుమార్
Hazarath Reddyహైదరాబద్‌లోని తిరుమలగిరి ఠాణా పరిధిలో శవమై కనిపించిన రియల్టర్‌ తోట విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో (Vijay Bhaskar Reddy Murder Case) కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే వరుసకు సోదరుడయ్యే తోట నరేందర్‌రెడ్డి నాటు తుపాకీతో కాల్చి చంపినట్టు (Alwal Realtor Vijay Bhaskar Reddy Murder) పోలీసులు గుర్తించారు.
Telangana: తెలంగాణలో ఒమిక్రాన్ అలజడి, యూకే నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్, మాస్క్ ధ‌రించ‌క‌పోతే రూ. 1,000 జ‌రిమానా, ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని కోరిన తెలంగాణ ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు
Hazarath Reddyద‌క్షిణాఫ్రికాలో బ‌య‌ట‌ప‌డ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్ప‌టికే 24 దేశాల‌కు విస్త‌రించిన నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. నిన్న యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చిన ఓ 35 ఏండ్ల మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింద‌ని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు వెల్ల‌డించారు.
Hyderabad: దేశంలో అతి పెద్ద సైబర్ మోసం, రూ. వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్న ముఠాలను అరెస్ట్ చేసిన సైబరాబాద్‌ పోలీసులు, మీడియాకు వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర
Hazarath Reddyదేశంలోనే అతిపెద్ద సైబర్‌ మోసం భాగ్యనగరంలో వెలుగు చూసింది. ఎస్‌బీఐ ధనీ బజార్‌, ద లోన్ ఇండియా, లోన్‌ బజార్ పేర్లతో నకిలీ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా రూ.వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్న ముఠాలను సైబరాబాద్‌ పోలీసులు (Cyberabad police) అరెస్టు చేశారు. ఈ వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర (Cyberabad CP Stephen Ravindra) మీడియా సమావేశంలో తెలిపారు.
Telangana: ప్రమాణస్వీకారం చేసిన తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు, రాజ్యసభ సమావేశాల దృష్ట్యా బండా ప్రకాశ్‌ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు
Hazarath Reddyతెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా (MLC) ఎన్నికైన ఐదుగురు టీఆర్‌ఎస్‌ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, పీ వెంకట్రామిరెడ్డితో శాసన మండలిలోని తన చాంబర్‌లో ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి ప్రమాణం చేయించారు. కాగా, రాజ్యసభ సమావేశాల దృష్ట్యా బండా ప్రకాశ్‌ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు.
Corona in TS: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 193 మందికి కరోనా, అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 40,018 శాంపిళ్లు పరీక్షించగా, 193 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి.
Cyclone Jawad: భయం గుప్పిట్లో ఉత్తరాంధ్ర, వణికిస్తున్న జవాద్ తుపాన్, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
Hazarath Reddyఇప్పటికే భారీ వర్షాలతో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలు వణికిపోగా తాజాగా ఉత్తరాంధ్రను ‘జవాద్‌’ తుపాన్‌ (Cyclone Jawad) వణికించేందుకు రెడీ అయింది.ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష (CM Jagan Mohan Reddy Review Meeting) నిర్వహించారు.
Car in Agricultural Well: సాయం చేయబోయి ప్రాణాలు కోల్పోయాడు, సిద్దిపేట కారు బావిలో పడ్డ ఘటనలో గజ ఈతగాడు మృతి, కారులో రెండు మృతదేహాలు లభ్యం
Naresh. VNSసిద్దిపేట(Siddipet)లో విషాదం నెలకొంది. రోడ్డుపై వెళ్తున్నకారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. అయితే కారును బయటకు తీసేందుకు బావి(Well)లోకి దిగిన గజ ఈతగాడు(Swimmer) కూడా నీటిలో ఊపిరాడక చనిపోయాడు. వృత్తి ధర్మంతో ఇతరులకు సాయం చేసేందుకు బావిలోకి దిగిన వ్యక్తి కూడా మరణించడం అందరినీ కలిచివేసింది.
KTR on NDA: ఎన్డీయేపై మంత్రి కేటీఆర్ సెటైర్స్, ఎన్డీయే అంటే నో డాటా అవైలెబుల్ అంటూ ట్వీట్, రైతు మరణాలపై కేంద్రం స్పందించిన తీరును తప్పబట్టిన విపక్షాలు
Naresh. VNSకేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరాలు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(KTR). ఎన్డీయే(NDA) అంటే నో డాటా అవైలబుల్(No Data Available) అంటూ ట్వీట్ చేశారు. రైతు ఆందోళనల్లో మరణించిన వారి రికార్డులు తమ వద్ద లేవని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి లోక్‌సభ(Loksabha)లో రాతపూర్వక సమాధానం ఇవ్వడంపై మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు.
Parliament Winter Session: కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ వరిని సేకరించాలి, లోక్‌సభలో డిమాండ్ చేసిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Hazarath Reddyకాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ వరిని సేకరించాలని & రబీ కోసం వరిపై ఎటువంటి ఆంక్షలు వద్దని లోక్‌సభలో డిమాండ్ చేసారు. ఖరీఫ్‌ పంటను కేసీఆర్‌ కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలకు హితవు పలికారు.
Parliament Winter Session: ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌, ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం స‌మ‌గ్ర విధానం తీసుకురావాలని డిమాండ్, రాజ్య‌స‌భ రేప‌టికి వాయిదా
Hazarath Reddyపార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిర‌స‌న స్వ‌రం పెంచారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం స‌మ‌గ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్య‌స‌భ రేప‌టికి వాయిదాప‌డ‌గా.. లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న కొన‌సాగుతున్న‌ది. పార్టీకి చెందిన 9 మంది ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి బైఠాయించారు.
Car Plunges into Well: కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు, ఎంతమంది కారులో ఉన్నారనే దానిపై ఇంకా తెలియని సమాచారం
Hazarath Reddyతెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుత‌ప్పి బావిలో (Car Plunges into Well) ప‌డిపోయింది. చిట్టాపూర్‌, భూంపల్లి గ్రామాల మధ్యలో.. రోడ్డుపక్కన ఉన్న ఒక వ్యవసాయ బావిలో కారు అదుపుతప్పి పడిపోయింది.
TSRTC Bus Fare Hike: తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపు, ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 25 పైసలు, ఇతర బస్సుల్లో 30 పైసలు మేర పెరిగే అవకాశం, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన టీఎస్‌ఆర్టీసీ అధికారులు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి. ఎప్పటి నుంచో టీఎస్‌ఆర్టీసీ ఛార్జీల పెంపుపై (TSRTC Bus Fare Hike) సాగుతున్న చర్చ తాజాగా ఇది కొలిక్కి వచ్చింది. ఆర్డినరీ బస్సుల్లో (RTC Bus)కిలోమీటర్‌కు 25 పైసలు, ఇతర బస్సుల్లో 30 పైసలు మేర ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది.
TSRTC MD Sajjanar: ఆర్టీసీ డిపోల‌ మూసివేత అవాస్తవం, భూములు అమ్మే ఆలోచ‌న ఆర్టీసీకి లేదని తెలిపిన ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్
Hazarath Reddyహైద‌రాబాద్‌లోని ప‌లు ఆర్టీసీ డిపోల‌ను మూసివేస్తున్న‌ట్లు ప‌లు మీడియాల్లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ స్పందించారు. ఆర్టీసీ డిపోల మూసివేత‌పై వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం అని స‌జ్జ‌నార్ స్ప‌ష్టం చేశారు. భూములు అమ్మే ఆలోచ‌న ఆర్టీసీకి లేదు. ఉద్యోగుల సంక్షేమం ఆర్టీసీ చాలా ముఖ్యం అని తేల్చిచెప్పారు.
CM KCR Press Meet: వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ క్లారిటీ , యాసంగిలో కొనుగోలు కేంద్రాలు లేవు, 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ...సీఎం కేసీఆర్ ఫైర్
Krishnaధాన్యం కొనుగోలుపై తెలంగాణ కేబినేట్ భేటీ ముగిసిన త‌ర్వాత ప్రెస్ మీట్‌లో మాట్లాడిన సీఎం.. ఈసంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. 750 మంది రైతుల‌ను పొట్ట‌న పెట్టుకున్న బీజేపీ రైతు హంత‌కుల పార్టీ అని సీఎం కేసీఆర్ విమర్శించారు.
Telangana: భార్య వివాహేతర సంబంధం, భర్తను చంపి ఆ శవాన్ని ఏడు ముక్కలుగా నరికి పారేసిన ఆమె ప్రియుడు, నా పేరు శివ సినిమా తరహాలో సాక్ష్యాలు మాయం, ఎట్టకేలకు పోలీసులకు దొరికిన నిందితుడు
Hazarath Reddyతెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గల రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కలకలం రేపిన కాంపెల్లి శంకర్‌ హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఈ హత్య కేసుకు సంబంధించి సోమవారం ఎన్టీపీసీ పోలీసు స్టేషన్‌ ఆవరణలో సీపీ చంద్రశేఖర్‌రెడ్డి ( Commissioner of Police S Chandrashekhar Reddy) వివరాలను మీడియాకు వెల్లడించారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 184 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 70 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో కరోనా వ్యాప్తి కనిష్ట స్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 33,236 కరోనా పరీక్షలు నిర్వహించగా, 184 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 70 కొత్త కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 33, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి.
Coronavirus in Telangana: తెలంగాణలో ఒమిక్రాన్ వైరస్ అలర్ట్, ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపిన ప్రజారోగ్య సంచాలకుడు, డెల్టా కంటే ఒమిక్రాన్ 30 రెట్లు వేగంగా వ్యాప్తి చెదుతుందని వెల్లడి
Hazarath Reddyదక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా కల్లోలం రేపుతున్న ఒమిక్రాన్‌ వేరియెంట్‌ (Telangana on alert amid Omicron ) ధాటికి తెలంగాణ రాష్ట్రం అలర్ట్ అయింది. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
COVID in TS: తెలంగాణలో కరోనా అలజడి, గురుకులంలో 43 మందికి పాజిటివ్, దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు గత మూడు రోజుల్లో 185 మంది ప్రయాణికులు, ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్‌
Hazarath Reddyసంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని ముత్తంగి గురుకుల పాఠశాలలో ఒక్కసారిగా కరోనా కలకలం రేగింది. ఏకంగా 43 మంది విద్యార్థులతో పాటు ఒక టీచర్ కరోనా బారిన పడ్డారు. ఈ గురుకుల పాఠశాలలో మొత్తం 491 మంది విద్యార్థులతో పాటు 27 మంది సిబ్బంది ఉన్నారు. మూడు రోజుల క్రితం ఓ విద్యార్థి అస్వస్థతకు గురి కాగా... వైద్య పరీక్షలు నిర్వహించారు.