తెలంగాణ

Fake Alert: తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, అలాంటిది ఏమీ లేదని తెలిపిన తెలంగాణ డిజిటల్ మీడియా డైరక్టర్ కొణతం దిలీప్, ఆ క్లిప్ పాతది అంటూ ట్వీట్

Hazarath Reddy

తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ (TS Lockdown) విధించే ఆలోచన ఉందని ఓ వీడియో సోషల్ మీడియాలో (Social Media) చక్కర్లు కొడుతోంది.అయితే ఆ వీడియో గతేడాది నాటిదని ఈ వదంతులు నమ్మవద్దని తెలంగాణ ప్రభుత్వం (TS Govt) తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరక్టర్ కొణతం దిలీప్ (Konatham Dileep) ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు.

Telangana Weather Update: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు, విదర్భ వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో 900 మీటర్ల ఎత్తు వరకూ ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం మధ్యప్రదేశ్‌ వరకూ విస్తరించింది. కర్ణాటక నుంచి మరఠ్వాడా వరకూ అదే ఎత్తులో ఈ ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని (Telangana Weather Update) వాతావరణశాఖ తెలిపింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 డిగ్రీల వరకూ తక్కువగా ఉంటున్నాయి. గాలిలో తేమ పెరిగింది.

Telangana Shocker: మంటల్లో కాలిపోయిన మూడు బస్సులు, ఓ వ్యక్తి సజీవ దహనం, తేనెటీగలను తరిమేందుకు బస్సుకు నిప్పు పెట్టడమే కారణం, నారాయణపేట జిల్లా మక్తల్‌లో విషాద ఘటన

Hazarath Reddy

తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తేనెటీగలను తరమాలనే ప్రయత్నంలో ఓ వ్యక్తి మంటల్లో సజీవ దహనం (man burnt alive in flames) అయ్యాడు. కరోనా సమయంలో పక్కన పెట్టేసిన బస్సుల్లో చేరిన తేనెటీగలను (honey bees ) చెదరగొట్టేందుకు నిప్పు పెట్టడంతో మూడు బస్సులు దగ్ధం అయ్యాయి. ఆ దగ్ఘమైన బస్సులతో పాటే ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు.

Covid Updates: మళ్లీ కరోనా విశ్వరూపం..ఒక్కరోజే 197 మంది మృతి, తెలంగాణలో స్కూళ్లు, కాలేజీల్లో కరోనా కల్లోలం, దేశంలో తాజాగా 43,846 కొత్త కేసులు, తెలంగాణలో 394 కొత్త కోవిడ్ కేసులు నమోదు, ఏపీలో 380 మందికి కోవిడ్ పాజిటివ్, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరేకు కరోనా

Hazarath Reddy

దేశంలో గ‌త‌ 24 గంట‌ల్లో 43,846 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... కొత్త‌గా 22,956 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,99,130కు( Coronavirus in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 197 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,755కు (Covid Deaths in India) పెరిగింది.

Advertisement

Telangana MLC Results: ఫలించిన కేసీఆర్ వ్యూహం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ రెపరెపలు, సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఘన విజయం, ఓటమితో రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నా‌రెడ్డి, డబ్బుతో నన్ను ఓడించారని తెలిపిన బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావు, దొంగ ఓట్లతో టీఆర్ఎస్ గెలిచిందన్న తీన్మార్ మల్లన్న

Hazarath Reddy

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో (Telangana MLC Election 2021 Results) టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి (surabhi Vanidevi), నల్లగొండ-ఖమ్మం- వరంగల్‌ స్థానంలో డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy) గెలిచారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానాన్ని బీజేపీ నుంచి వశం చేసుకున్న టీఆర్‌ఎస్‌ నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌లో వరుసగా రెండోసారి గెలుపొందింది.

Fire at Telangana Bhavan: తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం, భారీ ఎత్తున చెలరేగిన మంటలు, 'ఎమ్మెల్సీ' గెలుపు సంబరాల్లో అపశృతి

Hazarath Reddy

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి గెలుపు సంబరాల్లో అపశృతి (fire-broaken-in-telangana-bhavan) చోటుచేసుకుంది. హైదరాబాదు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శ్రేణులు బాణసంచా కాల్చుతుండగా అగ్నిప్రమాదం (Fire at Telangana Bhavan) సంభవించింది. ఈ ప్రమాదంలో మంటలు భారీ ఎత్తున చెలరేగాయి.

Telangana MLC Election 2021 Results: బీజేపీకి షాకిచ్చిన టీఆర్ఎస్, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవి ఘన విజయం, రెండవ స్థానానికి పరిమితమైన రాంచంద్రరావు, కొనసాగుతున్న నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి ఘన విజయం (trs-vani-devi wins) సాధించారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Telangana MLC Election 2021 Results) ఆమె విజేతగా నిలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో వాణీదేవి గెలిచారు. కాసేపట్లో ఈసీ అధికారికంగా ప్రకటించనుంది.

Bengaluru Shocker: ప్రియుడి నగ్న వీడియోతో ప్రియురాలు బ్లాక్‌మెయిల్, బెంగుళూరులో ఘటన, హైదరాబాద్‌లో వితంతువును పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ. 3లక్షలు దోచుకున్న సైబర్‌ నేరగాడు, అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు

Hazarath Reddy

Advertisement

IPS Officer RS Praveen Kumar: ముదురుతున్న స్వేరోస్ వివాదం, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞపై మండి పడుతున్న బీజేపీ నేతలు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు ఫిర్యాదు చేసిన నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు

Hazarath Reddy

తెలంగాణ ఐపీఎస్ అధికారి, స్వేరోస్ సంస్థ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ (IPS Officer RS Praveen Kumar) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. స్వేరోస్ భీమ్ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో స్వేరో సభ్యులతో కలసి ఆయన హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడం వివాదాస్పదంగా మారింది.

Shyamala Goli: పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళగా గోలి శ్యామల రికార్డు, ప్రపంచంలోనే రెండో మహిళగా గుర్తింపు, 13 గంటల 43 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరిన శ్యామల, సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది వద్ద శిక్షణ

Hazarath Reddy

భారత్, శ్రీలంకల మధ్యనున్న పాక్ జలసంధిని 30 కిలోమీటర్ల మేర ఈదిన ప్రపంచంలోనే రెండో మహిళగా (Shyamala Goli) హైదరాబాద్‌కు చెందిన గోలి శ్యామల రికార్డులకెక్కారు. 13 గంటల 43 నిమిషాల్లోనే జలసంధిని ఈది ఔరా అనిపించారు. నిన్న ఉదయం 4.15 గంటలకు శ్రీలంక తీరంలో తన సాహసకృత్యాన్ని ప్రారంభించిన శ్యామల ఏకబిగిన 13.43 గంటల్లోనే ఈది రామేశ్వరంలోని ధనుష్కోడి చేరుకున్నారు.

Covid in TS: తెలంగాణాలో ఒక్కసారిగా పెరిగిన యాక్టివ్ కేసులు, తాజాగా 364 మందికి కరోనా, కోవిడ్‌ను ఎదుర్కోవడానికి రూ. 5,268 కోట్లు ఖర్చు చేశామని తెలిపిన కేసీఆర్ సర్కారు

Hazarath Reddy

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 364 కరోనా కేసులు (Coronavirus in Telangana) నమోదయ్యాయి. కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 189 మంది (Corona in TS) కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,724కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,98,451 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,666గా ఉంది.

Telangana Secretariat: తెలంగాణ నూతన సచివాలయం కోసం బడ్జెట్‌లో రూ. 610 కేటాయింపు, నిర్మాణ పనులను వేగవంతం చేసిన ప్రభుత్వం, నేరుగా వెళ్లి పనుల పురోగతిని సమీక్షించిన సీఎం కేసీఆర్

Team Latestly

తెలంగాణ ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా, తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయాన్ని మనం నిర్మించుకోవాలి. దేశం గర్వించే విధంగా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా మన సచివాలయం నిలవాలి. ఉద్యోగులకు, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా వాతావరణాన్ని నెలకొల్పాలి. విశాలమైన...

Advertisement

Telangana's COVID Bulletin: తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, కొత్తగా మరో 318 మందికి పాజిటివ్, విద్యార్థులకు వైరస్ సోకుతుండటం పట్ల రాష్ట్ర హైకోర్ట్ ఆందోళన, వ్యాప్తిని కట్టడి చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

Team Latestly

MLC Polls 2021 Counting: తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌సీ స్థానాలకు కొనసాగుతున్న కౌంటింగ్, ఆధిక్యంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థులు, రెండో ప్రాధాన్యత ఓట్లు తమకేనని ప్రత్యర్థుల ధీమా!

Team Latestly

శుక్రవారం ఉదయం నాటికి నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌సీ స్థానానికి మొత్తం 7 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ఈ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.....

Telangana Budget 2021: రూ. 2.30 లక్షల కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్! అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఏయే రంగాలకు కేటాయింపులు ఎలా ఉన్నాయో చూడండి

Team Latestly

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్ రావు గురువారం ఉదయం 11.30 గంటలకు శాసన సభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది రూ. 2 లక్షల 30 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు.....

TS's COVID Report: తెలంగాణలో పలు జిల్లాల్లో విస్తరిస్తున్న కోవిడ్ మహమ్మారి, సరిహద్దు ప్రాంతాలపై ఆరోగ్యశాఖ నిఘా, రాష్ట్రంలో కొత్తగా 278 కోవిడ్ కేసులు నమోదు

Team Latestly

కరోనా యొక్క రెండవ వేవ్ ప్రమాద సూచనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య అధికారులు హెచ్చరిస్తున్నారు. మాస్కులు వేసుకోవడం, చేతులకు శానిటైజేషన్ చేసుకోవడం, పబ్లిక్ ర్యాలీలు, సభలు, పార్టీలకు దూరంగా ఉంటూ రాష్ట్రంలో మహమ్మారి మరింత విస్తరించకుండా సహకరించాలని వారు కోరుతున్నారు....

Advertisement

MLC Polls 2021 Results: తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, రెండు చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థుల ఆధిక్యం, పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తున్న స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న

Team Latestly

కొద్దిసేపటి క్రితమే తొలి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి గానూ 16,130 ఓట్లతో టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో నిలిచారు. ఈయనకు సమీపంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న 12,046 ఓట్లతో....

Weather Forecast: తెలంగాణలోని పలు ప్రాంతాలకు నేడు వర్షసూచన, ఉరుములు- మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అలర్ట్స్ జారీ చేసిన వాతావరణ శాఖ

Team Latestly

ఆదిలాబాద్, కొమరంభీమ్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు తదితర ప్రాంతాల్లో గురువారం ఆకాశం మేఘావృతమై, తేలికపాటి వర్షపాతానికి అవకాశం ఉందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.....

TS EAMCET: ఏఐసీటీఈ మార్గదర్శకాలను ఈ ఏడాది అమలు చేయం, స్పష్టం చేసిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఈనెల 18న ఎంసెట్‌–2021 నోటిఫికేషన్‌, 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, జూలై 5 నుంచి ఎంసెట్‌ పరీక్షలు

Hazarath Reddy

ఇంజనీరింగ్‌లో చేరాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాల్సిన అవసరం లేదన్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి విదితమే. కాగా 2021–22 విద్యా సంవత్సరంలో అమలు చేయబోమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (Telangana State Council of Higher Education) స్పష్టం చేసింది.

CM KCR Speech Highlights: ఉచిత విద్యుత్ పేటెంట్ వైఎస్సార్‌దే, కరోనాపై కన్నేసి ఉంచాం, రైతుల‌కు రుణ‌మాఫీ వంద‌కు 100 శాతం చేసి తీరుతాం, బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ స్పీచ్‌లో హైలెట్ పాయింట్స్ ఇవే

Hazarath Reddy

ఉచిత విద్యుత్‌ అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిదేనని (YSR) తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు మరోసారి పునరుద్ఘాటించారు. ఉచిత విద్యుత్‌ తాము అమలు చేశామని డబ్బాలు కొట్టుకునే అలవాటు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నట్లు వివరించారు.

Advertisement
Advertisement