తెలంగాణ
Pushpa-2 Stampede Row: సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం, థియేటర్‌కు షోకాజ్ నోటీసులు పంపిన సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
Hazarath Reddyసంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో మలుపులు తిరుగుతోంది. తాజాగా సంధ్య థియేటర్‌కు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని, దీనిపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు.
Formula E Race Case: ఫార్ములా-ఈ కార్ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్
Hazarath Reddyఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి, BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా రంగం సిద్ధమవుతోంది. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyహరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను బీఆర్ఎస్ తప్పువదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. అప్పులపై చర్చ జరగాలనే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ‘‘అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా?’’ భట్టి సవాల్ విసరగా.. అందుకు మాజీ మంత్రి హరీష్ రావు సై అన్నారు.
Telangana Assembly Session 2024: ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు, ఇలాగే కొనసాగితే వచ్చే 5 ఏళ్లలో రూ. 6,36,040 కోట్లుఅవుతుంది, అసెంబ్లీలో మండిపడిన హరీష్ రావు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై శాసనసభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఏడాది కాలంలో రూ. 52 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, నల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లగచర్ల రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్
Hazarath Reddyనల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇదేమి రాజ్యం.. ఖాకీ రాజ్యం.. దోపిడి రాజ్యం, లాఠీ రాజ్యం.. లూఠీ రాజ్యం, రైతులకు సంకెళ్లా సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు.
Student Suicide in Hyderabad: నారాయణ స్కూల్ లో మరో విద్యార్థి ఆత్మహత్య.. హయత్ నగర్ లో ఘటన (వీడియో)
Rudraనారాయణ స్కూల్స్ లో విద్యార్థులు ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ స్కూల్ హాస్టల్ లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
TTD Arjita Seva Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపు ఆర్జిత సేవ టికెట్ల కోటా విడుదల.. 24న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన మార్చి నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.
Telangana: తెలంగాణలో భూమిలేని వారికి రూ.6 వేలు, సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో..
Hazarath Reddyముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుమారు 5 గంటలకుపైగా కేబినెట్ భేటీ జరిగింది.ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 28న భూమిలేనివారికి రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
TS Inter Exam Schedule 2025: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదిగో, మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్
Hazarath Reddyతెలంగాణలో ఇంటర్ మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సోమవారం ఇంటర్‌బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో ప్రాక్టికల్స్ జరగనున్నాయి.
Hyderabad: వీడియో ఇదిగో, బొమ్మ తుపాకీ చూపించి తేవర్ బార్‌లో భారీ దోపిడీ, రూ. 4 లక్షల నగదుతో పాటు విలువైన యాపిల్ ఉత్పత్తులు చోరీ
Hazarath Reddyరాయదుర్గం పీఎస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలోని తేవర్ బార్‌లో దోపిడీ. బార్ సెక్యూరిటీ గార్డును బొమ్మ తుపాకీతో బెదిరించి, ఆపై గదిలో బంధించి.. నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు, ఒక ఐ ప్యాడ్, యాపిల్ ల్యాప్‌టాప్ దోచుకెళ్లిన దుండగులు.
Telangana: వీడియో ఇదిగో, గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా పురుటినొప్పులు, నొప్పిని భరిస్తూనే పరీక్షరాసిన అభ్యర్థిని రేవతి
Hazarath Reddyనాగర్‌కర్నూల్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి నాగర్‌కర్నూల్ పట్టణంలోని జడ్పీహెచ్ పాఠశాలలో గ్రూప్-2 పరీక్ష రాసేందుకు వెళ్లారు. పరీక్ష రాస్తుండగా ఆమెకు పురుటినొప్పులు వచ్చాయి
Telangana: వీడియో ఇదిగో, మెనూ సరిగా పాటించడంలేదని హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన భువనగిరి జిల్లా కలెక్టర్, స్కూల్ ప్రిన్సిపల్‌కి షోకాజ్ నోటీసులు జారీ
Hazarath Reddyప్రభుత్వ వసతిగృహాల్లో కొత్తగా ప్రారంభించిన డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందజేయాలని, మెనూ అమలులో తేడా రావద్దని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. భువనగిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
KTR Slams CM Revanth Reddy: రైతుల గురించి మాట్లాడదామంటే పారిపోయిన పిరికి దద్దమ్మ, సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడిన కేటీఆర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyరేవంత్ రెడ్డి.. తెలంగాణ, కొడంగల్ నీ అయ్య జాగీరు అనుకుంటున్నావా? రైతులు వాళ్ల సొంత భూములు ఇవ్వమని అంటే వాళ్లకి బేడీలు వేసి జైల్లో పెడతావా.. రేవంత్ రెడ్డి నువ్వేమైనా రారాజు అనుకుంటున్నావా? ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసన సభలో రైతుల గురించి మాట్లాడదామంటే పారిపోయిన పిరికి దద్దమ్మవి నువ్వు
Telangana: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లు భయపడుతున్నారు, మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyచంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana: తెలంగాణలో ఏ జిల్లాను రద్దు చేయడం లేదు, అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Hazarath Reddyకాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కొలువుదీరాక రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను కుదిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శాసన మండలిలో ఓ సభ్యుడు జిల్లాల కుదింపుపై ప్రశ్న వేయగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాను కూడా రద్దు చేయబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు
Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, తెలంగాణ నుంచి కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం అక్రమ రవాణా, అసెంబ్లీ వేదికగా నిజమేనని తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ నుంచి రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు అక్రమ రవాణా జరుగుతుందని అసెంబ్లీ వేదికగా బాంబ్ పేల్చారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రేషన్ కార్డుల లెక్కలు పొంతన లేకుండా పోతున్నాయని తెలిపారు.
Hyderabad: సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద డీజిల్ ట్యాంకర్ బోల్తా, భారీగా ట్రాఫిక్ జామ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyసికింద్రాబాద్ సమీపంలోని రైల్ నిలయం మార్గమధ్యలో డీజిల్ ట్యాంకర్ బోల్తా కొట్టింది. దీంతో ట్యాంకర్‌లోని వందల లీటర్ల డీజిల్ అంతా నేల పాలయ్యింది.దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఇంధనం మీద నుంచి వెళితే ఏదైనా ప్రమాదం జరగొచ్చని జంకుతున్నారు
Telangana Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం, రోడ్డు దాటుతూ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు, ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
Hazarath Reddyసిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న క్రమంలో గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామ సమీపంలోకి రాగానే గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కారు ఒక్కసారిగా రోడ్డు దాటే క్రమంలో బస్సును ఢీ కొట్టింది.
Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, బీఆర్‌ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి, సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసిన మంత్రి సీతక్క
Hazarath Reddyసర్పంచ్‌ల పదవి కాలం ఫిబ్రవరిలో ముగిసిందని, ఇప్పుడున్న పెండింగ్ బిల్లులు బీఆర్ఎస్ నుంచి వారసత్వంగా వచ్చినవేనని మంత్రి సీతక్క అన్నారు. హరీష్ రావు ఫైనాన్స్ మంత్రిగా ఆనాడు సంతకం పెడితే బిల్లులు క్లియర్ అయ్యేవికదా అని అన్నారు. కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదని, తాము పెండింగ్ బిల్లులు చెల్లించం అనడం లేదని చెప్పారు.
Telangana Assembly Session 2024: సంక్రాంతి తర్వాత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీడియో ఇదిగో
Hazarath Reddyకొత్త రేషన్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని, 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ఆలోచనలో ఉన్నామని అన్నారు. అలాగే తెలంగాణలో బీసీ కుల గణన ప్రక్రియ కొనసాగుతోందని, సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకొని, ఈ డేటా ఆధారంగా స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.