Habsiguda Fire Accident: హబ్సీగూడలో భారీ అగ్నిప్రమాదం, ఉప్పల్ వెళ్లేదారిలో భారీగా నిలిచిన ట్రాఫిక్, అన్‌లిమిటెడ్‌ స్టోర్‌లో మంటలు భారీగా ఆస్తినష్టం

హైదరాబాద్‌ హబ్సీగూడలో (Habsiguda fire accident) అగ్నిప్రమాదం సంభవించింది. అన్‌లిమిటెడ్‌ షోరూం నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలకు దట్టమైన పొగ ఎగిసిపడుతుంది. దీంతో ఉప్పల్‌ – సికింద్రాబాద్‌ మార్గంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Habsiguda Fire Accident: హబ్సీగూడలో భారీ అగ్నిప్రమాదం, ఉప్పల్ వెళ్లేదారిలో భారీగా నిలిచిన ట్రాఫిక్, అన్‌లిమిటెడ్‌ స్టోర్‌లో మంటలు భారీగా ఆస్తినష్టం
Habsiguda Fire Accident (PIC@ Twitter)

Hyderabad, Aug 02: హైదరాబాద్‌ హబ్సీగూడలో (Habsiguda fire accident) అగ్నిప్రమాదం సంభవించింది. అన్‌లిమిటెడ్‌ షోరూం నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలకు దట్టమైన పొగ ఎగిసిపడుతుంది. దీంతో ఉప్పల్‌ – సికింద్రాబాద్‌ మార్గంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదం గురించి తెలియగానే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మూడు ఫైర్‌ ఇంజిన్లతో మంటలను (Fire accident) అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

అగ్నిప్రమాదం సంభవించిన షోరూం పక్కనే పెట్రోల్‌ బంక్‌ ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

(The above story first appeared on LatestLY on Aug 02, 2023 10:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).