Basara IIIT Campus: బాసర ట్రిపుల్ ఐటీకి  తెలంగాణ గవర్నర్ తమిళిసై , విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్, రైలు మార్గం ద్వారా ప్రయాణం..
Governor Tamil Sai (Photo-Video Grab)

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బాసరలో పర్యటిస్తున్నారు. రైలు మార్గాన వెళ్లిన గవర్నర్ తెల్లవారుజామున 2:50 గంటలకు బాసర రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 4 గంటలకల్లా బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. 6.15గంటల వరకు ట్రిపుల్ ఐటీ గెస్ట్ హౌస్ లో విశ్రాంతి తీసుకున్న అనంతరం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం ఉదయం 7 గంటలకు తిరిగి ట్రిపుల్ ఐటీకి చేరుకున్న గవర్నర్ తమిళిసై విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి 10 వరకు అక్కడ విద్యార్థులతో సమావేశం అయ్యారు. 10 గంటలకు ట్రిపుల్ ఐటీ నుంచి బయలుదేరి నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీకి రోడ్డు మార్గంలో చేరుకుంటారు.వర్సిటీ విద్యార్థులు, సిబ్బందితో గవర్నర్ ముచ్చటించనున్నారు.

లంచ్ అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రైలు మార్గంలో సాయంత్రం 5.40గంటలకు హైదరాబాద్ రానున్నారు.