File Image (Credits: Hyderabad Traffic FB Page)

Hyderabad, April 06: హనుమాన్ జయంతి (Hanuman Jayanthi) సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో భారీ శోభాయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ శోభాయాత్ర సవ్యంగా సాగేందుకు ఏర్పాట్లు చేశారు. రంజాన్ మాసం కూడా నడుస్తుండటంతో ఎలాంటి ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. హనుమాన్ శోభాయాత్ర (Hanuman Shobha yatra) సవ్యంగా సాగేందుకు హైదరాబాద్ నగరవాసులు సహకరించాలని ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు విజ్ఞప్తి చేశారు. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఉదయం 11 గంటలకు గౌలిగూడలోని రామ మందిరం నుండి శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు.

ఈ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపులు:

* అఫ్జల్ గంజ్ వైపు నుండి వచ్చే వాహనాలను ఎస్ఎ మసీద్ నుంచి ఎంజీబీఎస్ (MGBS) బస్టాండ్ వైపు మల్లింపబడుతుంది.

* రంగమహల్ నుండి వచ్చే ట్రాఫిక్ ను సీబీఎస్ (CBS) వైపు మళ్ళించబడుతుంది.

* మధ్యాహ్నం 12:30 గంటలకు యాత్ర కోటి ఆంధ్ర బ్యాంక్ సర్కిల్ కు ఉంటుంది.

* ఆ సమయంలో కోటి వైపు వచ్చే వాహనాలను చాదర్ ఘాట్ ఎక్స్ రోడ్స్ వద్ద డైవర్ట్ చేసి నింబోలిఅడ్డ రంగమహల్ వైపు మళ్ళించబడును.

* కాచిగూడ వైపు నుండి వచ్చే ట్రాఫిక్ ను లింగంపల్లి ఎక్స్ రోడ్ నుండి పోస్టాఫీస్ రోడ్ చప్పల్ బజార్ వైపు మళ్లించబడుతుంది.

* నారాయణగూడ షాలిమార్ థియేటర్ వైపు వాహనాలు అనుమతించబడవు.

* ఆ ట్రాఫిక్ ను షాలిమార్ మీదుగా ఈడెన్ గార్డెన్ వైపు మళ్ళించబడును.

* శోభాయాత్ర సమయంలో నారాయణగూడ ఫ్లైఓవర్ తెరిచే ఉంటుంది. వాహనదారులు గమనించగలరు.

* అశోక్ నగర్ లో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగుతుంది.

* శోభాయాత్ర సందర్భంగా నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేశారు.

* గతంలో ఎక్కువ హైట్ లో డీజేలు పెట్టడం వల్ల అవి కూడా ట్రాఫిక్ జామ్ కు కారణం అయ్యాయి.

* ఈసారి నిర్వహకులకు నిర్ణీత ఎత్తులో డీజేలు అమర్చుకోవాలని సూచన చేశారు.

* ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, బైబిల్ హౌస్.. శోభాయాత్ర సమయంలో ఈ మూడు ప్రాంతాలు చాలా కీలకం.

* బైబిల్ హౌస్ మీదుగా కవాడీ గూడ వెళ్లే వాహనాలను శోభాయాత్ర రోజు అనుమతించరు.

* ఆ ట్రాఫిక్ ను కర్బలా మైదాన్ గుండా మహంకాళి ట్రాఫిక్ మళ్లించబడుతుంది.

హనుమాన్ శోభాయాత్ర రాత్రి 8 గంటల ప్రాంతంలో తాడ్ బండ్ హనుమాన్ దేవాలయం చేరుకునే అవకాశం

* శోభాయాత్రలో ప్రత్యక్షంగా 750 మంది ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉంటారు.

* ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా పనిచేస్తారు.