Income Tax (Photo-IANS)

Hyderabad, NOV 02:  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐటీ దాడులు (IT Raids) కలకలం రేపుతున్నాయి. గురువారం ఉదయం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 10 ప్రాంతాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేత పారిజాత నర్సింహారెడ్డికి (Parijatha Nasimhareddy) చెందిన బాలాపూర్ లోని నివాసంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. బడంగ్పేట్ మేయర్ గా ఉన్న పారిజాత కాంగ్రెస్ పార్టీ నుంచి మహేశ్వరం (Maheswaram) నియోజకవర్గం టికెట్ ఆశించారు. అదేవిధంగా మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎల్ఆర్ (KLR) నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

 

తెల్లవారుజామున 5గంటల నుంచి ఏకకాలంలో అధికారులు ఈ దాడులు కొనసాగిస్తున్నారు. పారిజాత నర్సింహారెడ్డి తిరుపతిలో, ఆమె భర్త నర్సిహారెడ్డి ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. పారిజాత నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు నివాసాల్లోనూ పది నుంచి పదిహేను బృందాలు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో అనధికారికంగా డబ్బు, నగలు ఉన్నట్లు సమాచారం రావడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం. మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ కోసం రవంత రెడ్డికి పారిజాత నరసింహారెడ్డి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపద్యంలోనే ఐటీ దాడులు జరఉహూతున్నట్లు తెలుస్తోంది