Balakrishna Meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన నంద‌మూరి బాల‌కృష్ణ‌, బ‌స‌వ‌తారకం ఆస్ప‌త్రి ప‌నుల నిమిత్తమే! రేవంత్ తో వ‌రుస‌గా ప్ర‌ముఖుల భేటీ
Balakrishna Meets Revanth Reddy (PIC@ TS CMO X)

Hyderabad, DEC 30: హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanth Reddy) టీడీపీ ఎమ్మెల్యే, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ (Nandamuri Balakrishna) మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సమయంలో బసవతారకం ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా బాలకృష్ణతోనే ఉన్నారు. అనంతరం రేవంత్ రెడ్డితో పలు అంశాలపై బాలకృష్ణ మాట్లాడారు.

 

మరోవైపు, రేవంత్ రెడ్డిని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ డీఎస్పీ నళిని (Nalini) కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే.

 

న‌టుడు నాగార్జున త‌న స‌తీమ‌ణి అమ‌లతో పాటూ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు. అటు పుదుచ్చేరి మాజీ సీఎం నారాయ‌ణ‌స్వామి ప‌లువురు మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేత‌ల‌తో పాటూ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు.

 

వీరితో పాటు మరికొందరు ప్రముఖులు కూడా హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రేవంత్ రెడ్డిని కలిశారు. పలు అంశాలపై రేవంత్ రెడ్డితో వారు మాట్లాడారు.