Hyderabad, December 02: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) అలర్ట్ జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం (Cyclone Michaung) శుక్రవారం వాయుగుండంగా మారి.. ఆదివారానికి తుపానుగా బల పడనున్నది. ఈ తుఫాన్‌కు మిచౌంగ్ అని భారత వాతావరణ విభాగం పేర్కొంది. దీంతో ఆదివారం, సోమవారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Passengers Please Note:
Cancellation of Trains in View of #CycloneMichaung pic.twitter.com/RjI1X4hXAg
— South Central Railway (@SCRailwayIndia) December 2, 2023
ఆదివారం మిచౌంగ్ తుపాన్ తీరాన్ని దాటనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 142 రైళ్లు రద్దు చేశామని (Trains Cancelled) సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ చెప్పారు. ఈ నెల మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకూ ఈ రైలు సర్వీసులు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని కోరారు. మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రాకేశ్ తెలిపారు.