రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు .. ఏ ఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష భర్త సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో అలిగిన ఆయన రేవంత్ రెడ్డిని నమ్ముకొని మోసపోయాను అని రేవంత్ BRS అభ్యర్థిని గెలిపించాలని చూస్తున్నాడని ఆరోపణలు చేశారు. నాలాంటి రేవంత్ బాధితులను కలుపుకుని కొడంగల్లో ఆయన్ని ఓడగొట్టిస్తానని శపథం చేశారు. నేడు సోమాజిగుడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఉప్పల్ లో నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తాను అని సర్వేలన్నీ చెప్పాయి.. GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది రెండు సీట్లయితే.. మా భార్య కార్పొరేటర్ గా గెలిచిందని గుర్తు చేశారు. అలాగే గత తోమిదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేశానని అన్నారు.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...

నేను రేవంత్ రెడ్డికి సన్నిహితుడిని.. ఎన్ని కష్టాలు ఎదురైన పార్టీతోనే ఉన్న. 2014లో టికెట్ అన్నారు.. ఆ తరువాత 2018లో అన్నారు.. ఇప్పుడు కూడా ఇవ్వలేదు. కనీసం సెకండ్ ఆప్షన్ గా కూడా నా పేరు స్క్రీనింగ్ కమిటీలో పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టిక్కెట్ అందుకున్న పరమేశ్వర్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డికి లేదన్నారు. అంతేకాదు BRS అభ్యర్థిని గెలిపించాలని రేవంత్ చూస్తున్నాడని ఆరోపణ చేశారు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్స్ ఇచ్చి.. పార్టీని నాశనం చేయాలని రేవంత్ చూస్తున్నాడన్నారు. టీడీపీ లాగా పార్టీని నాశనం చేసి ప్రాంతీయ పార్టీ స్థాపించాలని రేవంత్ చూస్తున్నాడని ఆరోపణ చేశారు. సీఎం పదవి కోసం ప్రైవేట్ ఆర్మీని రేవంత్ నిర్మించుకున్నాడని, రేవంత్ రెడ్డికి అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని ఆరోపించారు.

రేవంత్ రెడ్డిని కొడంగల్లో తంతే మల్కాజిగిరిలో మేము గెలిపించుకున్నాం. రేవంత్ రెడ్డికి అహంకారం వచ్చింది. రేవంత్ బాధితులు అంత నాతో రండి.. అందరి తరుపున నేను కొట్లాడతానని సింగిరెడ్డి అన్నారు. కొడంగల్లో రేవంత్ ఓటమికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా.. 300 మంది రేవంత్ బాధితులు ఉన్నారు.. మాతో వందల కోట్లు ఖర్చు చేపించిండు. ఇన్ని రోజులు రేవంత్ కోసం పని చేసిన నేను.. రేపటి నుంచి రేవంత్ కు వ్యతిరేకంగా పని చేస్తా.. రేవంత్ రెడ్డికు హటావో.. కాంగ్రెస్ కు బచావో అని పిలుపు నిచ్చారు.