Coronavirus Outbreak (Photo Credits: IANS)

Amaravati, August 2: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభన కొనసాగుతోంది. గత 24 గంటల్లో  రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 8,555 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1,58,764 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 15,58,69 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా,  విశాఖపట్నం నుంచి అత్యధికంగా  1,234 కేసులు నమోదయ్యాయి.

గడిచిన ఒక్కరోజులో మరో 67 కరోనా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 1474కు పెరిగింది.

AP's COVID19 Report: 

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు 6,272 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 82,866 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 74,404 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన ఒక్కరోజులో భారీ స్థాయిలో 52,834 మంది శాంపుల్స్   పరీక్షించినట్లు తెలిపింది.  ఈరోజు వరకు 20,65,407 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.