Hyderabad, DEC 14: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రజాభవన్‌లో గృహప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి శాస్త్రయుక్తంగా గురువారం తెల్లవారుజామున ప్రజాభవన్‌లో (Praja Bhavan) గృహప్రవేశం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం డిప్యూటీ సీఎం భట్టికి (Bhatti Vikramarka) ప్రజాభవన్‌ను అధికారిక నివాసంగా బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈరోజు మంచి రోజు కావటంతో భట్టి కుటుంబ సమేతంగా తన నివాసాన్ని ప్రజాభవన్‌లో కొనసాగించేందుకు గృహప్రవేశం చేశారు. వేద పండితుల ఆశ్వీర్వాదాలు అందించారు. డిప్యూటీ సీఎం గృహప్రవేశం సందర్భంగా ప్రజాభవన్‌ను ప్రత్యేకంగా అలంకరించారు.
#WATCH | Telangana Deputy CM Bhatti Vikramarka Mallu arrived at the State Secretariat to take charge of the office, amid the chanting of mantras by priests today
(Video source: PRO) pic.twitter.com/oljk9JpF5z
— ANI (@ANI) December 14, 2023
కాగా..బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రగతిభవన్ సీఎం అధికారిక నివాసంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ భవనాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జ్యోతిరావు పూలే పేరుతో ప్రజాభవన్‌గా మార్చింది. ఆ భవనాన్ని డిప్యూటీ సీఎంకు అధికారిక నివాసంగా కేటాయిస్తు నిన్ననే సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేకకుండా మరునాడే భట్టి ప్రజాభవన్‌లో గృహప్రవేశమయ్యారు.