తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం వైద్య కళాశాలల కేటాయింపుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్ రావు ఆదివారం నాడు మండిపడ్డారు. తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారనే దానిపై ట్విటర్ యూజర్ అడిగిన ప్రశ్నకు గవర్నర్ స్పందిస్తూ, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య చెప్పినట్లుగా సకాలంలో దరఖాస్తు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ‘నిద్రపోయి లేటుగా లేచి అడిగారు. ఒక్క ఏడాదిలో 11 మెడికల్ కాలేజీలు తమిళనాడుకు వచ్చాయి’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
Medical revolution in the last 8yrs:Number of med colleges doubled from around 300 to 700 approx.MBBS seats increased by 85% nearing 1 Lakhs from 30000 ,PG med seats 150% increased.15 New AIIMS & New Nursing Colleges in every New med colleges added district wise accross Nation
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 5, 2023
ఆమె ట్వీట్‌పై హరీష్‌రావు స్పందిస్తూ, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) బీబీనగర్ పూర్తి చేయడానికి అంచనా వేసిన రూ.1365 కోట్లలో కేంద్రం కేవలం రూ.156 కోట్లు మాత్రమే విడుదల చేసిందని చెప్పారు. ఢిల్లీ ఎయిమ్స్ స్థాయిలో ఉండాల్సిన బీబీనగర్ ఎయిమ్స్, ఎందుకు గల్లీలోని మా పీహెచ్‌సీ స్థాయిలో లేదని, ఎందుకు అధ్వాన్నంగా ఉంది? అని ప్రశ్నించారు. రూ. 1365 కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉన్నా.. ఎందుకు రూ.156 కోట్లు (11.4%) మాత్రమే మంజూరు చేశారు నిలదీశారు.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,
గుజరాత్ ఎయిమ్స్‌కు 52 శాతం నిధులు కేటాయించగా తెలంగాణకు 11.4 శాతం నిధులు ఎందుకు వచ్చాయని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో వాగ్దానం చేసిన విధంగా గిరిజన విశ్వవిద్యాలయం రైలు కోచ్ ఫ్యాక్టరీ కోసం రాజ్‌భవన్ దృష్టి సారించి, భారత ప్రభుత్వాన్ని ముందుకు తెస్తే తెలంగాణ ప్రజలకు ఇది గొప్ప సహాయం అని ఆయన వ్యాఖ్యానించారు.
CM #KCR Garu setup 12 medical clgs with state's own funds in tune to vision of 1️⃣medical clg in each dist.
TS tops in country with 19 MBBS seats per lakh population?
Instead of hurling abuses, Centre & governor shud appreciate TS govt for opening 8️⃣colleges in a single day 3/5
— Harish Rao Thanneeru (@BRSHarish) March 5, 2023
కేంద్రం ఆమోదించిన 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదన్నారు. మూడు దశల కాలేజీల కేటాయింపుల్లోనూ కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపి తెలంగాణను మోసం చేసిందని ఆయన అన్నారు. ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్న జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు కేటాయించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించేదెవరు? “మెడికల్ కాలేజీలపై కేంద్ర మంత్రుల విరుద్ధమైన ప్రకటనలు దారుణం. ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడుగలేదని అంటే.. మరొకరు కరీంనగర్, ఖమ్మంలో మెడికల్ కాలేజీ కోసం తెలంగాణ అడిగిందని, అక్కడ ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉండడంతో మంజూరు చేయలేకపోయామని చెబుతున్నారని గుర్తు చేశారు. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు ? ఎవరు తప్పుదారి పట్టుస్తున్నారు? అంటూ మంత్రి నిలదీశారు.
FACT is Gross injustice meted out to Telangana in sanctioning of Medical Colleges, despite repeated pleas from state govt to Centre.
Of 157 medical colleges approved by centre, TS got 🅾️
Union Govt discriminated & deceived TS in all three phases of allotment of Colleges 1/5 pic.twitter.com/Bsblqeb9MP
— Harish Rao Thanneeru (@BRSHarish) March 5, 2023
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో సొంత నిధులతో 12 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో వైద్య కళాశాలలను కేటాయించామన్నారు. లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. దూషణలకు బదులు రాష్ట్ర ప్రభుత్వం ఒకేరోజు 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించినందుకు కేంద్రం, గవర్నర్ అభినందించాలి’’ అని అన్నారు.