Traffic Restrictions In Secunderabad: సికింద్రాబాద్ రూట్‌లో ట్రాఫిక్ డైవర్షన్, ఉజ్జయిని బోనాల సందర్భంగా ఆంక్షలు విధించిన పోలీసులు, ప్రత్యామ్నాయ మార్గాలివే!
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల (Ujjaini Mahankali Bonalu) జాతర సందర్భంగా ఈనెల 9, 10 తేదీల్లో ఆలయ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు (Traffic Restrictions) 10వ తేదీ జాతర పూర్తయ్యే వరకు అమలులో ఉంటాయన్నారు.
Hyderabad, July 08: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల (Ujjaini Mahankali Bonalu) జాతర సందర్భంగా ఈనెల 9, 10 తేదీల్లో ఆలయ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు (Traffic Restrictions) 10వ తేదీ జాతర పూర్తయ్యే వరకు అమలులో ఉంటాయన్నారు. బోనాల పండుగ సందర్భంగా వచ్చే భక్తులతో ఆలయ సమీపంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాలను దారి మళ్లిస్తున్నట్టు కమిషనర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణం చేసే వారు త్వరగా ఇంట్లో నుంచి వెళ్లి సరైన సమయానికి స్టేషన్‌లోకి ప్లాట్ ఫామ్ నంబర్. 1 నుంచి వెళ్లే వారు రద్దీ ఎక్కువ ఉండడంతో చిలకలగూడ వైపు నుంచి వచ్చి ప్లాట్ ఫామ్ నంబర్.10ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందన్నారు. అందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఆంక్షలు , ట్రాఫిక్ మళ్లింపు (Traffic Restrictions), వాహ నాల పార్కింగ్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Commuters are urged to make note of Traffic Arrangements in view of Sri Ujjaini Mahankali Bonalu on 8/9 and 10th of July '23.
Kindly as much as avoid commuting between Junctions: Paradise -Patny- Ghansmandi - Ranigunj.@HYDTP pic.twitter.com/wfjU0WVsKY
— Raju K P V (@InsAdmnHYDTP) July 8, 2023
ట్రాఫిక్ ఆంక్షలు ( 9వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ జాతర పూర్తయ్యేవరకు )
❀ మహంకాళి ఆలయం, టోబాకో బజార్, హిల్ స్ట్రీట్ రూట్‌లో ట్రాఫిక్ రాకపోకలు పూర్తిగా నిలిపివేసి, రోడ్లను మూసివేస్తారు.
❀ సుభాష్ రోడ్డు, బాటా చౌరస్తా, రాంగోపాల్‌పేట్ పీఎస్, సికింద్రాబాద్ మార్గాలను మూసివేస్తారు.
❀ అడవయ్య రోడ్డు మార్గాలను మూసివేస్తారు.
❀ జనరల్ బజార్ నుంచి ఆలయ మార్గం రోడ్డు మూసివేస్తారు.
Commuters are urged to note the #Trafficdiversions & #parking arrangements in view of Sri Ujjaini Mahankali Bonalu Jatara at Secunderabad on 08/09-07-2023 till the conclusion on 10-07-2023.#Bonalu #Bonalu2023 #FESTIVAL pic.twitter.com/3hBHalNA7I
— Hyderabad Traffic Police (@HYDTP) July 7, 2023
దారి మళ్లింపు….
❀ కర్బాల మైదాన్ నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్, ఆర్టీసీ బస్సులను రాణిగంజ్ ఎక్స్ రోడ్డులో మినిస్టర్ రోడ్డు వైపు దారి మళ్లిస్తారు.
❀ రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు చిలకలగూడ క్రాస్‌రోడ్స్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్ క్రాస్ రోడ్, కవాడిగూడ, మ్యారెట్ హోటల్ ట్యాంక్‌బండ్ రూట్‌లో వెళ్లాలి.
❀ తాడ్‌బన్ వైపు వెళ్లే బస్సులు క్లాక్‌టవర్, ప్యాట్నీ ఎక్స్ రోడ్డు, వైఎంసీఏ, ఎస్‌బీహెచ్ ఎక్స్ రోడ్స్ మీదుగా వెళ్లాలి.
❀ ఘాస్మండి క్రాస్ రోడ్స్: బైబుల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, తిరుమలగిరి వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్ ఘాస్మండి ఎక్స్ రోడ్స్ నుంచి సజ్జనాల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హిల్ స్ట్రీట్, రాణిగంజ్ వైపు వెళ్లాలి.
❀ ప్యాట్నీ ఎక్స్ రోడ్స్ : ఎస్‌బీహెచ్ చౌరస్తా నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను ప్యాట్నీ ఎక్స్ రోడ్స్‌లో ప్యారడైజ్, మినిస్టర్ రోడ్డు లేదా క్లాక్ టవర్, సంగీత్ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిలకలగూడ, ముషీరాబాద్, కవాడిగూడ, మ్యారెట్ హోటల్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాలి.
❀ ప్యారడైజ్ ఎక్స్ రోడ్స్: సీటీఓ జంక్షన్ నుంచి ఎంజీ రోడ్డు వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్ ఎక్స్ రోడ్డులో సింధికాలనీ, మినిస్టర్ రోడ్డు, రాణిగంజ్, కర్బాల మైదాన్ మళ్లిస్తారు, ప్యాట్నీ క్రాస్ రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ప్యారడైజ్ ఎక్స్ రోడ్స్ వద్ద సీటీఓ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
❀ పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు పంజాగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్, ఐమ్యాక్స్ రోటరీ, తెలుగుతల్లి ైప్లెఓవర్, లోయర్ ట్యాంక్‌బండ్, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు, ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు, గాంధీ హాస్పిటల్, చిలకలగూడ క్రాస్ రోడ్డు, ప్లాట్ ఫామ్ నంబర్ 10కు రాకపోకలు సాగించాలి.
❀ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఓల్డ్ గాంధీ ఎక్స్ రోడ్స్, మోండా మార్కెట్, ఘాస్మండి, బైబిల్ హౌస్, కర్బాల మైదాన్, ట్యాంక్‌బండ్ రూట్లలో రాకపోకలు సాగించాలి.
❀ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, పంజాగుట్ట రూట్లల్లో వెళ్లరాదు. ఆ రూట్లలో భారీగా రద్దీ ఉంటుంది.
❀ ఉప్పల్ నుంచి పంజాగుట్ట వైపు రాకపోకలు సాగించే వారు ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్ జంక్షన్, పంజాగుట్ట రూట్లను ఉపయోగించాలి. అయితే ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ రూట్లల్లో భారీగా ట్రాఫిక్ ఉంటుంది.
❀ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సెయింట్ మేరీ రూట్ మార్గాలను మూసేస్తారు.
❀ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హకీంపేట, బోయిన్‌పల్లి, బాలానగర్, అమీర్‌పేట వెళ్లే ట్రాఫిక్‌ను క్లాక్ టవర్ నుంచి వయా ప్యాట్నీ, ఎస్‌బీహెచ్ వైపు నుంచి వెళ్లాలి.
వాహనాల పార్కింగ్ ప్రదేశాలు
(The above story first appeared on LatestLY on Jul 08, 2023 08:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

