టెక్నాలజీ

Hindenburg vs Block: అదాని తర్వాత ట్విట్ట‌ర్ ఫౌండ‌ర్‌ని టార్గెట్ చేసిన హిండెన్‌బ‌ర్గ్‌, జాక్ డోర్సీ పేమెంట్స్ సంస్థ బ్లాక్ అక్రమాలకు పాల్పడిందని నివేదిక

Hazarath Reddy

గౌతం అదాని సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన యూఎస్ షార్ట్ షెల్లింగ్ సంస్థ హిండెన్‌బ‌ర్గ్‌ మరో సంచలనానికి తెరలేపింది. ట్విట్ట‌ర్ ఫౌండ‌ర్ జాక్ డోర్సీని ల‌క్ష్యంగా చేసుకుని దాడికి దిగింది. జాక్ డోర్సీ (Twitter Co-Founder Jack Dorsey) ఆధ్వ‌ర్యంలోని పేమెంట్స్ సంస్థ బ్లాక్ (Block Inc) అక్ర‌మాల‌కు పాల్పడిందని నివేదికను బయటపెట్టింది.

layoffs 2023:  మూడు నెలల్లో ఇండియాలో 1,50,000 మంది ఉద్యోగులను తీసేసిన కంపెనీలు, 2023లో భారత్‌లో ఉద్యోగుల తొలగింపులు లిస్ట్ ఇదిగో..

Hazarath Reddy

కంపెనీల ఆర్థికమాంద్య భయాల మధ్య గతేడాది లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.2022లో 1,052 టెక్ కంపెనీలు 1,61,411 మందిని తొలగించాయి. తొలగింపు వేవ్ 2022లో ముగియలేదు కానీ 2023 వరకు కూడా కొనసాగింది. ఈ ఏడాదిలోనే 500కు పైగా టెక్‌ సంస్థలు 1,50,000 మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు జారీ చేశాయి.

Meta layoffs: వీసా కోసం అష్టకష్టాలు పడిన తర్వాత.. ఉద్యోగంలో చేరిన 3 రోజులకే పీకేసిన మెటా కంపెనీ, తన అనుభవాలను పంచుకున్న భారత టెకీ

Hazarath Reddy

మెటా లేఆఫ్‌లు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపాయి. ఒక భారతీయ టెక్కీ షేర్ చేసిన అటువంటి పోస్ట్‌లో చేరిన మూడు రోజుల్లోనే అతనిని ఉద్యోగం నుండి తొలగించినట్లు వెల్లడైంది

Walmart Layoffs: యాక్సెంచర్ తర్వాత ఉద్యోగులకు షాకిచ్చిన వాల్‌మార్ట్, వందలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఈ కామర్స్ దిగ్గజం

Hazarath Reddy

ఈ కామర్స్ దిగ్గజం వాల్‌మార్ట్ యుఎస్ లో ఐదు ఇ-కామర్స్ కేంద్రాలలో వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తోంది. 90 రోజుల్లో ఉద్యోగాలను వెతుక్కువాలని ఉద్యోగులకు సూచించింది. న్యూజెర్సీలోని పెడ్రిక్‌టౌన్‌లో దాదాపు 200 మంది కార్మికులు, టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లో వందలాది మంది కార్మికులు ఈ తొలగింపుల్లో ఉన్నారు. ఈ మేరకు రాయిటర్స్‌ న్యూస్ కథనం ప్రచురించింది.

Advertisement

Roofstock Layoffs: యాక్సెంచర్ తర్వాత లేఆఫ్స్ ప్రకటించిన మరో కంపెనీ, 27% మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన Roofstock

Hazarath Reddy

US-ఆధారిత ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ Roofstock దాని రెండవ రౌండ్ ఉద్యోగాల కోతలో దాదాపు 27% మంది ఉద్యోగులను తొలగించింది. దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణంగా తెలుస్తోంది.

Accenture Layoffs: అతిగా రిక్రూట్ చేసుకోవడం యాక్సెంచర్ కొంపలు ముంచింది, భారీ ఉద్యోగాల కోత వెనుక అసలు నిజం, 19 వేల మందికి ఉద్వాసన పలికిన టెక్ దిగ్గజం

Hazarath Reddy

ఐర్లాండ్‌కు చెందిన ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) 19,000 మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది.కంపెనీ కంపెనీ ఆదాయ క్షీణత నేపథ్యంలో 19వేల ఉద్యోగాలను తీసివేయనుంది. అయితే ఇందులో ఎంతమంది భారతీయ ఉద్యోగులు ప్రభావితం కానున్నారనేదానిపై స్పష్టత లేదు.

2023 DZ2 Asteroid: భూమికి దగ్గరగా రానున్న గ్రహశకలం, భూమిని ఢీకొడితే భారీ నష్టమే, అయితే భూమిని సురక్షితంగా అది దాటుతుందని నాసా ట్వీట్

Hazarath Reddy

చంద్రునికి సగం దూరంలో భూమికి దగ్గరగా అతి పెద్ద గ్రహశకలం శనివారం రానుంది. 2023 DZ2 అని పిలువబడే ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే, అది భారీ నష్టాన్ని కలిగిస్తుంది. అయితే, ఎర్త్‌స్కీ ప్రకారం, ఇది గంటకు 28,044 కిమీ వేగంతో క్లీన్ పాస్ అయ్యే అవకాశం ఉంది

Accenture Layoffs: టెక్ రంగంలో అతి పెద్ద లేఆఫ్స్, 19 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న ఐటీ దిగ్గజం యాక్సెంచర్

Hazarath Reddy

దాదాపు 19,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు ఐటీ దిగ్గజం యాక్సెంచర్ గురువారం ప్రకటించింది. సంస్థ యొక్క శ్రామిక శక్తిలో ఈ సంఖ్య 2.5 శాతంగా ఉంది. ఇంతకుముందు, కంపెనీ ప్రస్తుత త్రైమాసిక ఆదాయాన్ని $16.1 బిలియన్ నుండి $16.7 బిలియన్ల పరిధిలో అంచనా వేసింది. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో టెక్ దిగ్గజం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

Mukesh Ambani: ఆదానిని వెనక్కి నెట్టేసిన అంబానీ, దేశంలో అత్యంత సంపన్నులలో నంబర్ వన్ గా నిలిచిన రిల్ అధినేత, దేశ సంపదలో మూడో వంతు ముంబైలోనే..

Hazarath Reddy

దేశీయ అపర కుబేరుడిగా మళ్లీ ముకేశ్‌ అంబానీ నిలిచారు.గౌతమ్‌ అదానీని వెనక్కినెట్టి 82 బిలియన్‌ డాలర్లతో దేశంలో సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచినట్లు హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌-2023 స్పష్టం చేసింది.

Google Down: గూగుల్ డౌన్, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఇబ్బందులు ఎదుర్కున్న యూజర్లు, ఇంకా గూగుల్ నుంచి అధికారికంగా రాని ప్రకటన

Hazarath Reddy

టెక్ దిగ్గజం గూగుల్ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడినట్లు Down Detector India తెలిపింది. గూగుల్ కు చెందిన యూట్యూబ్, జీమెయిల్, డ్రైవ్ తో పాటు సెర్చ్ ఇంజిన్ సేవలు కాసేపు డౌన్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు

6G Mission in India: భారత్‌లో 6జీ వచ్చేస్తోంది, ఈ దశాబ్దం భారత సాంకేతిక దశాబ్దం అని తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

Hazarath Reddy

దేశం టెక్నాలజీ రంగంలో అమితవేగంతో దూసుకుపోతోంది. 5జీ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన కేవలం ఆరు నెలల్లోనే 6జీ టెక్నాలజీపై పరిశోధనలు చేసే స్థాయికి భారత్‌ ఎదిగిందని ప్రధాని మోదీ ప్రకటించారు.

Indeed Layoffs: ఆగని లేఆఫ్స్, 2,200 మంది ఉద్యోగులను తీసేస్తున్న ప్రముఖ జాబ్ పోర్టల్ Indeed, చాలా బాధగా ఉందని తెలిపిన సీఈఓ క్రిస్ హైమ్స్

Hazarath Reddy

వేలమంది తమ కలల ఉద్యోగాలను సాధించడంలో సహాయపడే ప్రముఖ జాబ్ పోర్టల్ Indeed.. 2,200 మంది ఉద్యోగులను లేదా 15 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. నిజానికి ఫ్లెక్స్‌లో దాదాపు ప్రతి టీమ్, ఫంక్షన్, లెవెల్, రీజియన్ నుండి జాబ్ కోతలు వస్తాయని ఆవేదనతో CEO క్రిస్ హైమ్స్ ప్రకటించారు.

Advertisement

Logitech Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన మరో కంపెనీ, 300 మందిని ఇంటికి సాగనంపిన స్విస్ టెక్నాలజీ సంస్థ లాజిటెక్

Hazarath Reddy

గ్లోబల్ స్థూల-ఆర్థిక వాతావరణం సవాలుగా ఉన్న నేపథ్యంలో స్విస్ టెక్నాలజీ సంస్థ లాజిటెక్ 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు మీడియా గురువారం నివేదించింది.

Whatsapp on 4 Device: వాట్సాప్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్, ఒకేసారి నాలుగు డివైజ్‌ల్లో వాడుకునేలా కొత్త అప్‌డేట్, విండోస్‌కోసం సరికొత్త యాప్‌ రూపొందించిన వాట్సాప్‌

VNS

వినియోగదారుల కోసం వాట్సాప్ (WhatsApp) మరోసరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీంతో ఇకపై మీ వాట్సాప్‌ను ఒకేసారి నాలుగు డివైజ్‌ల్లో (4 devices) లాగిన్ అవ్వొచ్చు. దీనిపై వాట్సాప్ అధికారికంగా ట్వీట్ చేశారు. ఇకపై చార్జర్ అవసరం లేదు, ఎలాంటి సమస్య లేదు, ఒకవేళ మీ ఫోన్ ఆఫ్‌లైన్‌లోకి వెళ్లినప్పటికీ, మిగిలిన డివైజ్‌ల్లో వాట్సాప్ వాడుకోవచ్చు అంటూ ట్వీట్ చేసింది.

Jobs in AI: ఈ కోర్సు నేర్చుకుంటే 45 వేల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి, ఫ్రెషర్లు రూ.14 లక్షల వార్షిక వేతనం పొందే అవకాశం

Hazarath Reddy

భారతదేశంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో 45,000 ఓపెన్ ఉద్యోగాలు ఉన్నాయని, ఫ్రెషర్లకు వార్షిక వేతనాలు రూ. 10 నుండి రూ.14 లక్షల వరకు ఉన్నాయని కొత్త నివేదిక వెల్లడించింది.

Pinduoduo App: చైనా యాప్‌లో మాల్ వేర్, Pinduoduoని ప్లే స్టోర్ నుండి తీసేసిన చేసిన సెర్జ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్

Hazarath Reddy

China, Chinese, Chinese app, Chinese Shopping App, Google Malware, Pinduoduo, Pinduoduo App, Shopping app, software

Advertisement

Twitter: ట్విట్టర్ వాడే వారికి గుడ్ న్యూస్, ట్వీట్‌లో అక్షరాలను 280 నుంచి 10,000కు పెంచుతున్న మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్

Hazarath Reddy

#Twitter CEO #ElonMusk మాట్లాడుతూ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ త్వరలో లాంగ్-ఫారమ్ ట్వీట్‌లను 10,000 అక్షరాలకు, సాధారణ ఫార్మాటింగ్ సాధనాలతో పాటు పెంచుతుందని తెలిపారు. ఇంతకుముందు, ట్వీట్లు కేవలం 280 అక్షరాలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి, ఇది ఇప్పటికీ చందాదారులు కాని వారికి వర్తిస్తుంది.

Layoffs 2023: వణికిస్తున్న లేఆఫ్స్, ఒక్క ఏడాదే 500 కంపెనీల నుంచి 1.5 లక్షల మంది ఉద్యోగులు బయటకు, అగమ్యగోచరంగా ఉద్యోగుల భవిష్యత్

Hazarath Reddy

అమెజాన్ మరో 9,000 మంది ఉద్యోగులను తొలగించడంతో (గతంలో 18,000 మందిని తొలగించారు) టెక్ చీకటిని మరింత తీవ్రతరం చేసింది. ఇక 500 కి పైగా కంపెనీలు ఈ సంవత్సరం ఇప్పటి వరకు దాదాపు 1.5 లక్షల మంది కార్మికులను తొలగించాయి.

Amazon Layoffs: ఆమెజాన్‌లో ఆగని ఉద్యోగాల కోత, తాజాగా 9 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఈకామర్స్ దిగ్గజం

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత ఆగడం లేదు. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు ఉద్యోగులు ఇంటికి సాగనంపాయి. సాగనంపే బాటలో ఉన్నాయి. తాజాగా Amazon Inc.అదనంగా 9,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది,

Rs. 2000 Notes in ATMs: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన, ఏటీఎంలలో ఆ నోట్లు నింపడమనేది పూర్తిగా బ్యాంకుల ఇష్టమని తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల

Hazarath Reddy

రూ.2వేల నోట్లకు సంబంధించి పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు నింపడం అనేది పూర్తిగా బ్యాంకుల ఇష్టమని, దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సూచనలూ ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా పార్లమెంటులో తెలియజేశారు.

Advertisement
Advertisement