టెక్నాలజీ

Netflix Update: నెట్‌ఫ్లిక్స్ కొత్త అప్‌డేట్, ఇకపై బయటవారికి మీరు పాస్‌వర్డ్ షేర్ చేయలేరు, నెల రోజులకు ఓ సారి వైఫై కనెక్ట్ కావాల్సిందే..

Hazarath Reddy

ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్ తన ప్లాట్‌ఫారమ్‌లో పాస్‌వర్డ్ షేరింగ్‌ను ఆపడానికి ఎట్టకేలకు కొత్త అప్‌డేట్‌ను విడుదల చేస్తోంది. స్ట్రీమింగ్ దిగ్గజం తన సహాయ కేంద్రం పేజీని అప్‌డేట్ చేసింది.

Pinterest Layoffs: ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న మరో టెక్ దిగ్గజం, 150 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించిన పిన్‌టెరిస్ట్

Hazarath Reddy

Pinterest Inc. సుమారు 150 మంది ఉద్యోగులను తొలగిస్తోంది, గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా విస్తరించిన పరిశ్రమ కోసం ఈ కల్లోల సమయంలో ఖర్చులను తగ్గించుకునే పనిలో సంస్థ పడింది.

PAN Card: వ్యాపారులు ఇకపై పాన్ కార్డు చూపిస్తే చాలు, అధికారులకు మరే పత్రాలు చూపించనవసరం లేదు, సరికొత్త వ్యవస్థని అందుబాటులోకి తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వం

Hazarath Reddy

ఈ నేపథ్యంలో పాన్‌ నంబరును (PAN Number) అన్ని వ్యాపారాలకు ఐడెంటిఫయర్‌గా (PAN to be used as common identifier)ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర అనుమతుల కోసం వ్యాపారులు వెళ్లినపుడు పాన్‌ నంబరు చెబితే చాలు.

Intel Cuts Employee Salaries: ఉద్యోగులను తీసేయకుండా..వారి వేతనాల్లో కోత విధించాలని కీలక నిర్ణయం తీసుకున్న ఇంటెల్, ఆర్థిక పరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి

Hazarath Reddy

టెక్ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న వేళ చిప్ దిగ్గజం ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను తొలగించడానికి బదులుగా వారి వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించింది. కంపెనీ సీఈవో స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది.

Advertisement

WhatsApp Banned 36 Lakh Bad Accounts: 36 లక్షల బ్యాడ్ అకౌంట్స్ బ్యాన్ చేసిన వాట్సప్, ఐటీ రూల్స్ కు అనుగుణంగా యాక్షన్ షురూ..

kanha

WhatsApp సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై మరింత బాధ్యతగా ఉండడానికి సవరించబడుతున్న కొత్త IT రూల్స్ 2021కి అనుగుణంగా డిసెంబర్ 2022 నెలలో భారతదేశంలో 36 లక్షల ఖాతాలను నిషేధించినట్లు తెలిపింది.

Mukesh Ambani Overtakes Gautam Adani: గౌతం అదానీని వెనక్కి నెట్టేసిన ముఖేష్ అంబానీ, 84.3 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే సంపన్నుడైన భారతీయుడిగా బిలియనీర్

Hazarath Reddy

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, బిలియనీర్ ముఖేష్ అంబానీ సంపదలో అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీని వెనక్కి నెట్టేశారు. ప్రస్తుతం 84.3 బిలియన్‌ డాలర్ల సంపదతో అంబానీ ప్రపంచంలోనే సంపన్నుడైన భారతీయుడిగా అవతరించారు. గౌతమ్‌ అదానీ 83.9 బిలియన్‌ డాలర్ల సంపదతో అంబానీ తర్వాత స్థానానికి పడిపోయారు.

Budget 2023 Highlights: రూపాయి రాక, రూపాయి పోక వివరాలు ఇవిగో, రూ.45.03 లక్షల కోట్లతో 2023 కేంద్ర బడ్జెట్, శాఖల వారీగా కేటాయింపులు, కేంద్ర బడ్జెట్‌ కీ పాయింట్స్ ఇవే..

Hazarath Reddy

ఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్ రూపొందించారు. అవి వరుసగా సమ్మిళిత అభివృద్ధి, చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు, భారీగా పెట్టుబడులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, దేశ ప్రజల సామర్థ్యానికి పెద్ద పీట, పర్యావరణ అనుకూల అభివృద్ధి, యువ శక్తి, పటిష్టమైన ఆర్థిక రంగం.

New Income Tax Slabs 2023-24: వేతన జీవులకు ఊరటనిచ్చిన కేంద్రం, రూ. 7లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్‌ లేదని ప్రకటన, పన్ను మినహాయింపు రూ.5లక్షల నుంచి 7లక్షలకు పెంపు

Hazarath Reddy

ఈ సందర్భంగా వేతన జీవులకు భారీ ఊరటనిచ్చారు. ప్రస్తుతమున్న 6 శ్లాబులను 5 శ్లాబులకు తగ్గించారు. రూ. 7లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్‌ లేదని ప్రకటించారు. పన్ను మినహాయింపు రూ.5లక్షల నుంచి 7లక్షలకు పెంచారు. 9 లక్షల ఆదాయం ఉన్న వారికి 5% టాక్స్‌, రూ.9లక్షల నుంచి 15లక్షల వరకు 10శాతం పన్ను, రూ.15లక్షలు దాటితే 30శాతం పన్ను విధిస్తామని తెలిపారు.

Advertisement

Union Budget 2023: బడ్జెట్లో విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్, 5G సేవల యాప్‌ల అభివృద్ధి కోసం ఇంజనీరింగ్ కాలేజీలలో 100 ల్యాబ్‌లు

Hazarath Reddy

5G సేవలను ఉపయోగించి యాప్‌లను అభివృద్ధి చేయడానికి 100 ల్యాబ్‌లు engg సంస్థలలో ఏర్పాటు చేయబడతాయి. కొత్త శ్రేణి అవకాశాలు, వ్యాపార నమూనాలు & ఉపాధి అవకాశాలను గ్రహించడం కోసం, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ప్రెసిషన్ ఫార్మింగ్, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్&హెల్త్‌కేర్ వంటి యాప్‌లను ల్యాబ్‌లు కవర్ చేస్తాయని FM నిర్మల తెలిపారు.

WhatsApp: మీ దగ్గర ఈ ఐ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా? అయితే ఇకపై వాట్సాప్‌ను వాడలేరు, ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ నిలిపివేయనున్న ఫోన్ల లిస్ట్ ఇదే!

VNS

మీ దగ్గర అప్ డేట్ అవ్వని స్మార్ట్ ఫోన్ (smart phone) ఉందా? ఫస్ట్ జనరేషన్ యాపిల్ ఐ ఫోన్ తో పాటూ, కొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లలో ఇకపై వాట్సాప్ (WhatsApp) పనిచేయదు. యాపిల్‌ ఐఫోన్‌ 6 (apple iphone 6), మొదటి జనరేషన్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ లేదా పాత ఆండ్రాయిడ్‌ ఫోన్లలో వాట్సాప్ పని చేయదని కంపెనీ తెలిపింది. ఈ మేరకు వాట్సాప్ పని చేయని ఫోన్ల లిస్ట్ ను హెచ్‌టీ టెక్‌ కంపెనీ రిలీజ్ చేసింది

Rare Green Comet: వారంపాటూ ఖగోళంలో అద్భుతం, 50వేల ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా రానున్న తోకచుక్క, విజయవాడ వాసులకు దగ్గరగా చూసే అదృష్టం

VNS

మంచు యుగంలో దాదాపు 50,000 సంవత్సరాల తర్వాత ఈ తోకచుక్క తిరిగి మన దారిలోకి వస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి 6వ తేదీ వరకు విజయవాడ (Vijayawada) నగర వాసులు ఈ అరుదైన తోక చుక్కను స్పష్టంగా వీక్షించవచ్చు. నగరానికి ఉత్తర దిక్కున ధృవ నక్షత్రం, సప్తర్షి మండలం మధ్యలో చూడొచ్చునని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు.

Google Chrome: గూగుల్ క్రోమ్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి, యూజర్లను హెచ్చరించిన గూగుల్, పాత క్రోమ్‌పై హ్యాకర్లు సులభంగా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపిన సీఈఆర్టీ-ఎన్

Hazarath Reddy

సెర్చింజన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ పాత వెర్షన్ ఉపయోగిస్తున్న వారు తక్షణమే అప్ డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ భద్రతా సంస్థ సీఈఆర్టీ-ఎన్ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా) అప్రమత్తం చేసింది.

Advertisement

LIC Clarifies on Adani Stocks: కుప్పకూలిపోతున్న అదానీ సామ్రాజ్యం, కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన LIC, భారీ నష్టాలపై స్పందించిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్

Hazarath Reddy

హిండెన్ బర్గ్ రీసెర్చ్ దెబ్బకు అదానీ సామ్రాజ్యం కుప్పకూలిపోతోంది. స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్ల విలువ భారీగా పడిపోతోంది.లక్షల కోట్లు ఆవిరైపోతున్నాయి.కాగా అదానీకి సంబంధించిన కంపెనీల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ), ఎస్‌బీఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టాయి.

OLX Layoffs: ఉద్యోగులను సాగనంపుతున్న మరో కంపెనీ, 1,500 మందికి పైగా ఉద్యోగులకు తీసేస్తున్న OLX, ఆర్థిక మాంద్య భయాలే కారణం..

Hazarath Reddy

ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న కంపెనీల్లో OLX గ్రూప్ కూడా చేరింది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 15 శాతం ఉద్యోగులను లేదా 1,500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తగ్గిస్తుందని రిపోర్టులు వస్తున్నాయి. అయితే OLX తొలగింపులలో ఎంత మంది భారతీయ కార్మికులు ప్రభావితం అవుతారో స్పష్టంగా తెలియలేదు.

Amgen Layoffs: 300 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన డ్రగ్‌మేకర్ ఆమ్జెన్, సంస్థాగత మార్పుల మధ్య కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని వెల్లడి

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల భారీ తొలగింపుల మధ్య, డ్రగ్‌మేకర్ ఆమ్జెన్ యునైటెడ్ స్టేట్స్‌లో 300 మంది ఉద్యోగులను తొలగించింది. రాయిటర్స్‌లోని ఒక నివేదిక ప్రకారం, మొత్తం శ్రామిక శక్తిలో దాదాపు 1.2 శాతం మంది తొలగించారు.

Manu Jain Quits Xiaomi: షియోమికి గుడ్ బై చెప్పిన మను కుమార్ జైన్, తొమ్మిదేళ్ల పాటు అనుబంధం తర్వాత కంపెనీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన

Hazarath Reddy

చైనా మొబైల్ దిగ్గజం Xiaomi గ్రూప్‌ కి మను కుమార్ జైన్ గుడ్ బై చెప్పారు. తొమ్మిదేళ్ల పాటు అనుబంధం తర్వాత కంపెనీ నుంచి వైదొలుగుతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. సోషల్ మీడియాలో పంచుకున్న ఒక ప్రకటనలో, జైన్ "తదుపరి వృత్తిపరమైన సవాలు" వైపు వెళ్లడానికి ముందు "కొంత సమయం తీసుకుంటాను" అని చెప్పాడు.

Advertisement

US H1B Visa Applications: అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్‌వేర్లకు గుడ్ న్యూస్, మార్చి 1వ తేదీ నుంచి హెచ్‌1బీ వీసాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న US, 31కల్లా వీసా హోల్డర్ల పేర్లు

Hazarath Reddy

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్. 2023–24 సంవత్సరానికి గాను మార్చి ఒకటో తేదీ నుంచి హెచ్‌1బీ వీసాలకు (H1B visa ) దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్‌ విభాగం ఆదివారం తెలిపింది

Philips Layoff:ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న మరో టెక్ దిగ్గజం, 6000 మంది ఉద్యోగులను తొలగించే పనిలో ఫిలిప్స్

Hazarath Reddy

2025 నాటికి 6,000 ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్లు టెక్ సంస్థ ఫిలిప్స్ సోమవారం తెలిపింది, ఈ సంవత్సరం దాదాపు 3,000 ఉద్యోగాలు సహా, పనితీరును మెరుగుపరచడానికి, విలువ సృష్టిని పెంచడానికి. గత ఏడాది అక్టోబర్‌లో, కంపెనీ "బహుళ సవాళ్లను" ఎదుర్కొన్నందున 4,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది

IBM Layoffs: కొనసాగుతున్న ఐబీఎంలో భారీగా ఉద్యోగాల కోత, 3900 మందిని తొలగిస్తూ నిర్ణయం, ఐటీ కంపెనీలపై కొనసాగుతున్న ఆర్ధిక మాంధ్యం ఎఫెక్ట్‌

VNS

సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ మల్టీనేషనల్‌ టెక్‌ కంపెనీలైన గూగుల్‌ (Google), అమెజాన్‌ (Amazon), మైక్రోసాఫ్ట్‌, మెటా (Meta) ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. మరింత మందిని వదిలించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో ఐటీ దిగ్గజం ఐబీఎం (IBM) కూడా చేరింది. కంపెనీలోని 3900 మంది ఉద్యోగులను తీసేస్తూ నిర్ణయం తీసుకున్నది.

Cyber Attack on MEA Sever: భార‌త విదేశాంగ మంత్రిత్వ‌శాఖ‌ సర్వర్ హ్యాక్.., బీజేపీ మంత్రితో సహా 15 మంది ఉన్న‌తాధికారుకుల ఈ-మెయిల్ ఐడీలు, పాస్‌వ‌ర్డ్‌ల‌ను సేల్ కోసం పెట్టిన‌ట్లుగా వార్తలు

Hazarath Reddy

భార‌త విదేశాంగ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఈ-మెయిల్ స‌ర్వ‌ర్‌ను హ్యాకర్లు హ్యాక్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.డేటాను దొంగ‌లించిన హ్యాక‌ర్లు ఆ త‌ర్వాత ఆ స‌మాచారాన్ని అమ్మ‌కానికి పెట్టినట్లుగా తెలుస్తోంది సుమారు 15 మంది ఉన్న‌తాధికారుకుల చెందిన ఈ-మెయిల్ ఐడీలు, పాస్‌వ‌ర్డ్‌ల‌ను సేల్ కోసం పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement