టెక్నాలజీ

RBI KYC Update Guidelines: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్, మీ కేవైసీ కోసం ఇక బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు, ఇమెయిల్-ఐడి, రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా చేసుకోవచ్చు

Hazarath Reddy

బ్యాంక్ ఖాతాదారులు ఇప్పటికే చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించి, తమ చిరునామాను మార్చుకోనట్లయితే మీ కైవైసీ (KYC) వివరాలను అప్‌డేట్ చేయడానికి ఇకపై వారి బ్యాంక్ శాఖలను సందర్శించాల్సిన అవసరం లేదని RBI తెలిపింది.

Pegasystems Layoffs: అమెజాన్ బాటలో మరో దిగ్గజం, 4 శాతం ఉద్యోగులను తొలగిస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ పెగాసిస్టమ్స్, స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలతో కంపెనీ

Hazarath Reddy

సాఫ్ట్‌వేర్ కంపెనీ పెగాసిస్టమ్స్ 2023లో ఆర్థిక మాంద్యం భయంతో 6,000 మంది ఉద్యోగులలో 4 శాతం మందిని తొలగిస్తోంది.స్టాక్ షేరు ధర 69 శాతం క్షీణించడంతో పెగాసిస్టమ్స్ షేర్ హోల్డర్లు భారీ నష్టాలను చవిచూశారని అంతకుముందు నివేదికలు తెలిపాయి.ఈ నేపథ్యంలో కంపెనీ 4 శాతం ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయింది.

Twitter Data Leak: ట్విటర్ వాడుతున్నారా? అయితే వెంటనే పాస్‌వర్డు మార్చుకోండి! కోట్లాదిమంది యూజర్ల మెయిల్‌ ఐడీలు, పాస్‌వర్డులను అమ్మకానికి పెట్టిన హ్యాకర్లు, మీ వివరాలు కూడా ఉండే అవకాశం

VNS

మీకు ట్విట్టర్ అకౌంట్ ఉందా? అయితే మీ వ్యక్తిగత మెయిల్ వివరాలు, ఫోన్ నెంబర్, యూజర్‌ నేమ్, ఫాలోవర్ల వివరాలు వేరేవ్యక్తుల చేతుల్లో ఉండే అవకాశం ఉంది. డార్క్ వెబ్ సైట్‌లో ప్రత్యక్షమైన కోట్లాది మంది డేటాలో మీది కూడా ఉండే అవకాశం ఉంది. రెండు నెలల క్రితమే 50 లక్షల మందికి పైగా యూజర్ల ట్విట్టర్ ఖాతాల డేటా హ్యాకర్ల పాలైంది. తాజాగా 235 మిలియన్ యూజర్ల డేటా డార్క్ వెబ్‌ లో ప్రత్యక్షమైంది.

Satya Nadella Met PM Modi: ప్రధాని మోదీని కలిసిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, డిజిటల్ ఇండియా విజన్‌కు మా సహకారం ఎప్పుడూ ఉంటుందని వెల్లడి

Hazarath Reddy

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రధాని మోదీని కలిశారు. డిజిటల్ పరివర్తన ద్వారా సుస్థిరమైన & సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వ లోతైన దృష్టిని చూడటం స్ఫూర్తిదాయకంగా ఉంది. డిజిటల్ ఇండియా విజన్‌ని గ్రహించి ప్రపంచానికి వెలుగుగా నిలిచేందుకు భారతదేశానికి సహాయం చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము" అని నాదెళ్ల ట్వీట్ చేశారు.

Advertisement

ByteDance Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన బైట్‌డాన్స్, వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ కీలక నిర్ణయం, యుఎస్ జాతీయ భద్రతా ఆందోళనల మధ్య క్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటున్న టిక్ టాక్ ఓనర్

Hazarath Reddy

టిక్‌టాక్ యొక్క చైనా ఆధారిత యజమాని బైట్‌డాన్స్ అనేక విభాగాలలో వందలాది మంది కార్మికులను తొలగించినట్లు మీడియా నివేదించింది. 600 మిలియన్ల రోజువారీ క్రియాశీల వినియోగదారులతో టిక్‌టాక్ చైనీస్ వెర్షన్ డౌయిన్‌లోని ఉద్యోగులను తొలగించింది.

ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్ ఇంకా ఫైల్ చేయలేదా, అయితే ఫీజు రూపంలో ఇప్పుడు దాఖలు చేయవచ్చు, ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ మీకోసం..

Hazarath Reddy

జూలై 31, 2022 గడువును మిస్ అయిన వారికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చివరి తేదీగా డిసెంబర్ 31, 2022ని భారత ఆదాయపు పన్ను శాఖ జారీ చేసింది. అయినప్పటికీ, పన్ను చెల్లింపుదారులు ఇప్పటికీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫీజు రూపంలో పన్ను రిటర్న్‌లను చెల్లించవచ్చు.

Tesla Fined in South Korea: టెస్లా కార్లకు షాక్, తప్పుడు ప్రకటనలు చేసిందంటూ 2.2 మిలియన్ డాలర్లు ఫైన్ విధించిన దక్షిణ కొరియా యాంటీట్రస్ట్ రెగ్యులేటర్

Hazarath Reddy

దక్షిణ కొరియా యాంటీట్రస్ట్ రెగ్యులేటర్.. టెస్లాపై 2.85 బిలియన్ వోన్ ($2.2 మిలియన్) జరిమానా విధించనున్నట్లు తెలిపింది, తక్కువ ఉష్ణోగ్రతలలో దాని ఎలక్ట్రిక్ వాహనాల యొక్క తక్కువ డ్రైవింగ్ పరిధి గురించి వినియోగదారులకు చెప్పడంలో విఫలమైందని కొరియా ఫెయిర్ ట్రేడ్ కమీషన్ (KFTC) ఆరోపణలు చేస్తోంది.

UPI Transaction Limit: యూపీఐ పేమెంట్లు అదే పనిగా చేస్తున్నారా, అయితే లిమిట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే, లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు

Hazarath Reddy

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), ఇన్‌స్టంట్ రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్, ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ లావాదేవీల కోసం మార్గాన్ని చాలా సులభతరం చేసింది. ఎక్కువ వివరాలను నమోదు చేయకుండా కూడా సెకన్లలో డబ్బు పంపడంలో లేదా స్వీకరించడంలో ఇది సహాయపడుతుంది.

Advertisement

UTS Mobile Ticketing App: ఇక క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదు, మీ మొబైల్ నుంచి యూటీఎస్ ద్వారా ఫ్లాట్ ఫాం టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు, స్టెప్ బై స్టెప్ మీకోసం

Hazarath Reddy

భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్తను అందించింది. మీరు ఇకపై టికెట్ కోసం క్యూ లైన్లో నిల్చుకోకుండా నేరుగా యాప్ ద్వారా బుక్ (Book Platform Ticket) చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. సెకన్ల వ్యవధిలో మీ మొబైల్ ఫోన్‌తో మీ స్థానిక రైలు టికెట్ లేదా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసలుబాటుని కల్పించింది.

Head of Family Update In Aadhar: ఆధార్ అప్‌డేట్‌పై గుడ్ న్యూస్, కుటుంబ పెద్ద సమ్మతితో చిరునామాను అప్‌డేట్ చేసే సదుపాయాన్ని కల్పించిన UIDAI

Hazarath Reddy

కుటుంబ పెద్ద (HoF) సమ్మతితో ఆన్‌లైన్‌లో ఆధార్‌లోని చిరునామాను అప్‌డేట్ చేసే సదుపాయాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఏర్పాటు చేసింది.

2023's First Sunrise: ఈ ఏడాది తొలి సూర్యోదయం వీడియో ఇదే, సూర్యుడు మెల్లిగా బయటకు వస్తున్న దృశ్యం నిజంగా అద్భుతమే, కొత్త ఏడాది, తొలి సూర్యోదయం అంటూ ట్వీట్ చేసిన జపాన్ వ్యోమగామి కొయిచీ వటాకా

Hazarath Reddy

కొత్త ఏడాదిలో మొదటి రోజు సూర్యోదయాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని జపాన్ వ్యోమగామి కొయిచీ వటాకా చెబుతున్నారు. ఓ ప్రాజెక్టు పనిమీద ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న కొయిచీ.. కొత్త సంవత్సరాన్ని తొలి సూర్యోదయంతో స్వాగతించారు.

UPI Payments:డిసెంబర్‌లో రికార్డు స్థాయిలో రూ.12.82 లక్షల కోట్లకు చేరుకున్న యూపీఐ చెల్లింపులు, ఇప్పటివరకు రూ. 782 కోట్ల లావాదేవీలు

Hazarath Reddy

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగిన చెల్లింపులు డిసెంబర్‌లో రికార్డు స్థాయిలో రూ.12.82 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2016లో ప్రారంభించబడిన ప్లాట్‌ఫారమ్‌లో వాల్యూమ్ పరంగా రూ. 782 కోట్ల లావాదేవీలు జరిగాయి.

Advertisement

Mark Zuckerberg: మరోసారి తండ్రి కాబోతున్న మార్క్‌ జుకర్‌బర్గ్‌, హ్యాపీ న్యూ ఇయర్‌. ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి 2023లో మా జీవితాల్లోకి రాబోతున్నారంటూ ట్వీట్

Hazarath Reddy

ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ కొత్త ఏడాది శుభవార్త చెప్పారు. ఈ ఏడాది తమ జీవితాల్లోకి ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి రాబోతున్నట్లు తెలిపారు. ఈ సంతోషకరమైన వార్తను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. ’హ్యాపీ న్యూ ఇయర్‌

UPI DOWN: దేశవ్యాప్తంగా నిలిచిపోయిన యూపీఐ సర్వీసులు, పండుగ బిజీలో షాపింగ్ చేసే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు, #UPIDOWN అంటూ వేలాదిగా ట్వీట్లు పెడుతున్న యూజర్లు

VNS

దేశ ప్రజలంతా నూతన సంవత్సర వేడుకల్లో ఉండగా..యూపీఐ పేమెంట్స్ (UPI Payments) నిలిచిపోయాయి. ప్రజలంతా షాపింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో యూపీఐ సేవలు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో యూపీఐకి ఏమైందంటూ ట్విట్టర్‌ లో గోల మొదలైంది. వేలాది మంది యూజర్లు #UPIDOWN అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే యూపీఐ సర్వీసుల పునరుద్దరణపై ఇంకా అధికారిక సమాచారం మాత్రం లేదు

Paid Promotions in Social Media: సోషల్ మీడియాలో చెప్పకుండా పెయిడ్ ప్రమోషన్ చేస్తే రూ.50 లక్షల జరిమానా, కొత్త నిబంధనలు అమల్లోకి

Hazarath Reddy

యూట్యూబ్ చానళ్లు, ఇన్ స్టాగ్రామ్ రీల్స్, ట్విట్టర్ తదితర వేదికలపై డబ్బులు తీసుకుని వివిధ సంస్థలు, ఉత్పత్తులకు అనుకూల కథనాలను ప్రసారం చేస్తుంటారు. ఇకపై వీరు తాము చేసేది పెయిడ్ ప్రమోషన్ అని ముందే చెప్పి తీరాలి. లేదంటే రూ.50 లక్షల జరిమానా చెల్లించాల్సి వస్తుంది.

Anant Ambani to marry Radhika Merchant: అంబానీ చిన్న కొడుకు పెళ్లి కొడుకాయెనే, రాధికా మర్చంట్‌ను వివాహం చేసుకోబోతున్న అనంత్ అంబానీ

Hazarath Reddy

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani)-నీతా అంబానీ (Nita Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్-శైల దంపతుల కుమార్తె రాధిక మర్చంట్‌(Radhika Merchant)తో అనంత్ వివాహం నిశ్చయమైంది.

Advertisement

Amazon Delivery By Drone: డ్రోన్‌ల ద్వారా ఆర్డర్‌లను డెలివరీ చేయనున్న అమెజాన్, ముందుగా కాలిఫోర్నియా, టెక్సాస్‌లలో ప్రారంభించిన ఈకామర్స్ దిగ్గజం

Hazarath Reddy

E-కామర్స్ దిగ్గజం అమెజాన్.. US రాష్ట్రాలైన కాలిఫోర్నియా, టెక్సాస్‌లలో డ్రోన్‌ల ద్వారా ఆర్డర్‌లను డెలివరీ చేయడం ప్రారంభించింది, ఒక గంటలోపు కస్టమర్‌ల ఇళ్లకు ప్యాకేజీలను పంపించే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది అక్కడ విజయవంతమయితే ఇతర దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది.

Twitter Down: మరోసారి మొరాయించిన ట్విట్టర్, లాగిన్ సమస్యలతో ఇబ్బందిపడ్డ వేలాది మంది యూజర్లు, గత రెండు వారాల్లో ఇది రెండో సారి

VNS

ట్విట్టర్‌ మరోసారి డౌన్ (Twitter down) అయింది. లాగిన్ సమస్యతో వేలాది మంది యూజర్లు ఇబ్బంది పడ్డారు. ఈ మేరకు డౌన్ డిటెక్టర్. కామ్‌ కు(Downdetector.com) వేలాది ఫిర్యాదులు వచ్చాయి. అమెరికా సహా పలు దేశాల్లో వేలాది మంది యూజర్లు ట్విట్టర్ లో లాగిన్ అయ్యేందుకు ఇబ్బందులు ఎదుర్కున్నారు. దీనిపై ట్విట్టర్ (Twitter down) నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు

5G Scam Alert: 5జీ స్కాం అలర్ట్, వొడాఫోన్ 5జీ సేవలంటూ ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయి జాగ్రత్త, వాట్సాప్‌లో ఇవి క్లిక్ చేశారంటే మీ అకౌంట్లో డబ్బులన్నీ గోవిందా 

Hazarath Reddy

ఓ లింక్ పంపించి, దానిపై క్లిక్ చేయడం ద్వారా 5జీ సేవలను పొందొచ్చనే సమాచారం ఉంటోంది. ఆ లింక్ పై క్లిక్ చేస్తే ఫోన్ లోకి మాల్వేర్ ను జొప్పించి సున్నితమైన సమాచారాన్ని నేరగాళ్లు తస్కరిస్తారు. బ్యాంకు ఖాతా తదితర వివరాలు వారికి చేతికి వెళ్లాయంటే ఉన్నదంతా ఊడ్చేస్తారు.

Indian Railways Data Breach: రైల్వే వినియోగదారులకు షాకింగ్ న్యూస్, 30 మిలియన్లకు పైగా యూజర్ల డేటా హ్యాక్, ఇంకా స్పందించని భారతీయ రైల్వే

Hazarath Reddy

ఈ నెల ప్రారంభంలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో జరిగిన డేటా ఉల్లంఘన తర్వాత, భారతీయ రైల్వే వినియోగదారుల డేటాబేస్‌లో తాజా డేటా ఉల్లంఘనకు సంబంధించిన నివేదికలు వెలువడ్డాయి. ఈ నివేదికల ప్రకారం, 30 మిలియన్లకు పైగా రైల్వే వినియోగదారుల వివరాలను హ్యాకర్ ఫోరమ్‌లో అమ్మకానికి ఉంచారని వార్తలు వస్తున్నాయి.

Advertisement
Advertisement