టెక్నాలజీ
BSNL 5G in India: వచ్చే ఏడాది నుంచి BSNL 5జీ సేవలు, దేశవ్యాప్తంగా 80 శాతం మేరకు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
Hazarath Reddyవచ్చే ఏడాది నుంచి భారత్ సంచార నిగమ్ లిమిటెడ్-BSNL ద్వారా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అదేవిధంగా రానున్న రెండు నుంచి మూడేళ్లలో దేశవ్యాప్తంగా 80 శాతం మేరకు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
Jio Fiber Down: దేశంలో జియో ఫైబర్ సర్వర్లు డౌన్, ట్విట్టర్లో హోరెత్తిన రిలయన్స్ జియో సర్వర్ డౌన్ మెసేజ్‌లు, కాసేపటికే సేవలను పునరుద్ధరించిన రిలయన్స్ జియో యాజమాన్యం
Hazarath Reddyభారతదేశం అంతటా రిలయన్స్ జియో సర్వర్లు కొద్ది సేపటికే డౌన్ అయ్యాయి. వినియోగదారులు బుధవారం ఉదయం ఇంటర్నెట్ సేవలను యాక్సెస్ చేయలేకపోయారు. ఇంటర్నెట్ సేవల ట్రాకర్ డౌన్‌డెటెక్టర్.. Jio యొక్క బ్రాడ్‌బ్యాండ్, ఇంటర్నెట్ సేవలను యాక్సెస్ చేయడంలో సమస్యలను నివేదించిన వినియోగదారుల యొక్క అధిక సందర్భాలను చూపించింది.
Making Pig Livers Humanlike: మనుషులకు పంది కాలేయాన్ని అమర్చే ప్రయోగాలు, అమెరికాలో గత 12 ఏళ్ల నుంచి శరవేగంగా జరుగుతున్న ట్రయల్స్
Hazarath Reddyఅమెరికాలో మనుషులకు పంది కాలేయాన్ని అమర్చే ప్రయోగాలు వేగంగా జరుగుతున్నాయి. లివర్ అవయవ కొరతను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు అమెరికాలో గత కొన్నేండ్లుగా ఈ ప్రయోగాలు చేస్తున్నారు. మనిషి కాలేయంలో ఉండే లక్షణాలను పంది కాలేయంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Ration Card in DigiLocker: రేషన్ కార్డును మీరు ఇక తీసుకువెళ్లనవసరం లేదు, DigiLocker ద్వారా రేషన్ కార్డును జారీ చేస్తున్న ఏపీ ప్రభుత్వం, డిజిలాకర్ యాప్‌ డౌన్ లోడ్ లింక్ ఇదే..
Hazarath Reddyఇప్పుడు #రేషన్ కార్డ్ యొక్క ఒరిజినల్ కాపీని మీరు రేషన్ షాపుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు! వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & పౌర సరఫరాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు #DigiLocker ద్వారా రేషన్ కార్డును జారీ చేస్తోంది. యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి ఈ లింక్ ద్వారా..
Fake OTP Delivery Scam: ఆన్‌లైన్‌లో ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారా? మీరు ఆర్డర్ చేయకుండానే ఇంటికే పార్శిల్ వచ్చే అవకాశముంది! కొత్త తరహా మోసానికి తెరలేపిన సైబర్ నేరగాళ్లు, ఆర్డర్ కాన్సిల్ చేయాలంటే ఓటీపీ చెప్పాలంటూ మోసాలు
VNSడెలివరీ లేదా రద్దును ప్రాసెస్ చేయడానికి స్కామర్‌ OTP అడుగుతారు. అక్కడే యూజర్లను మోసగిస్తారు. తెలియని యూజర్లు తమ స్కామర్లకు OTP ఇవ్వడం లేదా ఫోన్‌లో వచ్చిన లింక్‌పై క్లిక్ చేసి మోసపోతుంటారు. స్కామర్‌లు OTPని స్వీకరించిన తర్వాత వారు ఫోన్‌ను క్లోన్ (Phone Clone) చేస్తారు లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలను యాక్సెస్ చేసేందుకు హ్యాక్ చేస్తారు.
Google: ఈ సారి గూగుల్ వంతు, 6 శాతం మంది ఉద్యోగులను తొలగించే పనిలో టెక్ దిగ్గజం, వీరంతా పేలవమైన పనితీరు కనబరుస్తున్నట్లుగా గూగుల్‌ సమావేశంలో చర్చలు
Hazarath Reddyగత వారం గూగుల్‌లో జరిగిన సమావేశంలో ఉద్యోగుల పనితీరుపై చర్చలు జరిగాయి.ఈ సమావేశంలో 6 శాతం మంది ఉద్యోగులు పేలవమైన పనితీరు కనబరుస్తున్నట్లుగా చర్చకు వచ్చింది. ఇది వారిని ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Digital Ad Spending in India: భారత్‌లో 2028 నాటికి 21 బిలియన్ల డాలర్లకు చేరుకోనున్న డిజిటల్ ప్రకటనల వ్యయం, సరికొత్త నివేదిక బయటకు
Hazarath Reddyస్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగంలో గణనీయమైన పెరుగుదలతో, భారతదేశంలో డిజిటల్ ప్రకటనల వ్యయం 2028 నాటికి $21 బిలియన్లకుఇంటర్నెట్ చేరుకునే అవకాశం ఉందని ఒక నివేదిక చూపించింది.
YouTuber MrBeast: నేను ట్విట్టర్ సీఈఓ కావొచ్చా అంటూ ట్వీట్ చేసిన ప్రపంచంలోని అగ్రశ్రేణి యూట్యూబర్, దానికి ఎలాన్ మస్క్ సమాధానం ఏంటంటే...
Hazarath Reddyప్రపంచంలోని అగ్రశ్రేణి యూట్యూబర్ అయిన MrBeast తాను ట్విట్టర్ సీఈఓ కావాలనుకుంటున్నట్లుగా ట్వీట్ చేశాడు. అతను నేను కొత్త ట్విట్టర్ CEO కావచ్చా?" అంటూ ట్వీట్ చేశాడు.దానికి ఎలాన్ మస్క్ ఇది ప్రశ్నార్థకం కాదు" అని బదులిచ్చారు. MrBeast యొక్క ట్వీట్ ఇప్పటివరకు 49 మిలియన్ల వీక్షణలను అందుకుంది.
IceWarp: ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ IceWarpలో భారీగా ఉద్యోగ అవకాశాలు, వచ్చే ఏడాది చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని భావిస్తున్న యాజమాన్యం
Hazarath Reddyసాఫ్ట్‌వేర్ కంపెనీ #IceWarp భారతదేశంలో 2023 చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీ ఇండియా టీమ్‌లో 100 మంది సభ్యుల బలం ఉంది.
Airtel 5G in Vizag: విశాఖ వాసులకు గుడ్ న్యూస్, నేటి నుంచి నగరంలో 5జీ సేవలు అందుబాటులోకి, ప్రస్తుతం ఉన్న 4జీ నెట్‌వర్క్‌ సిమ్‌తోనే 5జీ సేవలు
Hazarath Reddyభా­రతీ ఎయిర్‌టెల్‌ వైజాగ్‌లో అత్యాధునిక 5జీ ప్లస్‌ సేవలను గురువారం నుంచి ప్రా­­రంభించినట్లు ప్రకటించింది. సంస్థ త­న 5జీ నెట్‌వర్క్‌ని దశలవారీగా విశాఖ నగ­రంలోని వినియోగదారులకు అందుబా­టులోకి తీసుకురానున్నట్లు ఎయిర్‌టెల్‌ ఏపీ, తెలంగాణ సీఈవో శివన్‌ భార్గవ వెల్లడించారు
XBB Subvariant: వైరల్ అవుతున్న న్యూస్ ఫేక్, డెల్టా వేరియంట్ కన్నా 5 రెట్లు ప్రమాదకరంగా XBB సబ్‌వేరియంట్, ఈ వాట్సప్ మెసేజ్ ఫేక్ అని తెలిపిన కేంద్ర ఆరోగ్యశాఖ
Hazarath Reddyకేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ క్లెయిమ్‌ను తిరస్కరించింది. మెసేజ్ ఫేక్ అని పేర్కొంది. "#COVID19 యొక్క XXB వేరియంట్‌కు సంబంధించి అనేక వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అవుతున్న ఈ సందేశం నకిలీ, తప్పుదారి పట్టించేది" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Tesla Layoff: ఈ సారి టెస్లా వంతు, భారీగా ఉద్యోగులను తొలగించే పనిలో ఎలాన్ మస్క్, ట్విట్టర్ నష్టాల బాటలో నడవటమే కారణం
Hazarath Reddyఎలోన్ మస్క్ యొక్క ఎలక్ట్రిక్ ఆటోమేకర్ టెస్లా తదుపరి ఆర్థిక త్రైమాసికంలో నియామకాన్ని స్తంభింపజేయాలని, ఒక రౌండ్ తొలగింపులను అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. కంపెనీ అధికారులు రిపోర్టు ప్రకారం, వచ్చే నెల నుండి ప్రారంభమయ్యే ఆర్థిక త్రైమాసికంలో హైరింగ్ ఫ్రీజ్, లేఆఫ్‌ల గురించి ఉద్యోగులకు తెలియజేసినట్లు సమాచారం.
WhatsApp: భారీ మొత్తంలో వాట్సాప్ అకౌంట్లపై నిషేదం, జస్ట్ నవంబర్ నెలలోనే భారత్‌లో 37లక్షలకు పైగా అకౌంట్లను నిషేదించిన వాట్సాప్, ఎందుకు ఇలా చేసిందో తెలుసా?
VNSఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021లోని రూల్ 4(1)(D) ప్రకారం.. వాట్సాప్ నవంబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య 37 లక్షల వాట్సాప్ అకౌంట్లను నిషేధించినట్లు వెల్లడించింది. అక్టోబర్‌లో నిషేధించిన అకౌంట్ల కన్నా రెండు లక్షలు ఎక్కువగానే ఉన్నాయి. 37 లక్షలకు పైగా వాట్సాప్ అకౌంట్లలో 990,000 యూజర్ల నుంచి ఎలాంటి నివేదికలు రాకముందే ముందస్తుగా బ్యాన్ చేసినట్టు నివేదిక పేర్కొంది.
Online Betting Apps: ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లను చట్టబద్ధం చేసే ఆలోచన ఏదీ లేదు, రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానం తెలిపిన కేంద్రం
Hazarath Reddyఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లను చట్టబద్ధం చేసే ఆలోచన ప్రస్తుతం లేదని కేంద్రం బుధవారం తెలిపింది. ఆన్‌లైన్ బెట్టింగ్, జూదంపై రాజ్యసభలో ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లను చట్టబద్ధం చేసే ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా అనే ప్రశ్నకు సమాధానంగా, ఎటువంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్రం తెలిపింది.
Bombay High Court: సోషల్ మీడియా ప్రజాస్వామ్యానికి మూలస్థంభం, అభిప్రాయాల మార్పిడికి శక్తివంతమైన మాధ్యమం, దానిని దుర్వినియోగం చేయకూడదని తెలిపిన బాంబే హైకోర్టు
Hazarath Reddyబాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్ సోమవారం సోషల్ మీడియాను దుర్వినియోగం చేయకుండా హెచ్చరించింది, అయితే ఇది అభిప్రాయాల మార్పిడికి శక్తివంతమైన మాధ్యమంగా మారిందని అంగీకరించింది.
Elon Musk: ట్విటర్ సీఈవోగా తప్పుకునేందుకు సిద్దంగా ఉన్నా! ట్విటర్ పోల్‌పై స్పందించిన ఎలాన్ మస్క్, కానీ ఒక్క కండీషన్ అంటూ మెలిక
VNSసీఈఓగా వేరే వ్యక్తికి బాధ్యతలు అప్పగించిన తరువాత నేను ఆ పదవి నుంచి వైదొలుగుతానని మస్క్ తెలిపారు. ఆ తర్వాత సాప్ట్‌వేర్ అండ్ సర్వర్‌ల బృందాలను నడుపుతానంటూ ట్విటర్‌లో మస్క్ పేర్కొన్నాడు. ట్విటర్ కొనుగోలు తరువాత మస్క్ పలు వివాదాలకు కేంద్ర బింధువుగా మారుతున్నారు. దీంతో ట్విటర్ తీరుతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Xiaomi May Cut 15% Workforce: ఈ సారి షియోమి వంతు, భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం, 15 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వార్తలు
Hazarath Reddyచైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు #Xiaomi కఠినమైన ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు, స్థానిక #COVID19 లాక్‌డౌన్‌ల మధ్య తన శ్రామిక శక్తిని 15 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, బహుళ విభాగాల నుండి కార్మికులను తొలగించవచ్చని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.
Mobile Data Speed: మొబైల్ డేటా వేగంలో భారత్ 105 ర్యాంక్.. 176.18 ఎంబీపీఎస్ వేగంతో ప్రపంచంలోనే ఖతార్ టాప్
Rudraమొబైల్ డేటా వేగంలో అంతర్జాతీయంగా భారత్ స్థానం కొంత మెరుగుపడింది. ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ తాజా నివేదికలో భారత్ లో సగటు మొబైల్ డౌన్ లోడ్ వేగం 18.26 ఎంబీపీఎస్ గా ఉంది. కానీ, అక్టోబర్ లో ఈ సగటు వేగం 16.50 ఎంబీపీఎస్ గానే ఉంది. ఫలితంగా అక్టోబర్ లో ఉన్న 113వ ర్యాంక్ నుంచి భారత్ 105కి చేరింది.
YouTube: యూట్యూబ్ నుంచి భారతదేశానికి రూ. 10,000 కోట్లకు పైగా జీడిపి రూపంలో ఆదాయం, 750,000 ఉద్యోగాలకు సమానంగా మద్ధతు ఇచ్చామని తెలిపిన గూగుల్
Hazarath Reddyయూట్యూబ్ భారతీయ GDPకి రూ. 10,000 కోట్లకు పైగా అందించింది. 2021లో దేశంలో 750,000 కంటే ఎక్కువ పూర్తి-సమయ సమానమైన ఉద్యోగాలకు మద్దతునిచ్చిందని గూగుల్ యాజమాన్యంలోని సంస్థ సోమవారం తెలిపింది.
AIIMS Cyber Attack: ఢిల్లీ ఎయిమ్స్ స‌ర్వ‌ర్ల‌ హ్యాకింగ్ వెనుక చైనా హస్తం, 100 స‌ర్వ‌ర్లు హ్యాకింగ్‌కు గురైన‌ట్లు తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ, కొన్నింటిని తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్న‌ట్లు వెల్లడి
Hazarath Reddyచైనా హ్యాక‌ర్లు ఢిల్లీ ఎయిమ్స్ స‌ర్వ‌ర్ల‌ను హ్యాక్ చేసిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వ‌ర్గాలు బుధ‌వారం వెల్ల‌డించాయి. ఎయిమ్స్‌లో దాదాపు 100 స‌ర్వ‌ర్లు హ్యాకింగ్‌కు గురైన‌ట్లు పేర్కొన్నారు. ఇందులో కొన్నింటిని తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్న‌ట్లు తెలిపాయి. ఈ స‌ర్వ‌ర్ల‌లో డేటాను పునరుద్ధ‌రించిన‌ట్లు ఆరోగ్య శాఖ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి.