New Delhi, December 06: పార్డ్ టైం జాబ్స్ పేరుతో ( Part-Time Job Frauds) ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న వందకు పైగా వెబ్ సైట్లను నిషేదించింది (Government Ban) భారత ప్రభుత్వం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ వెబ్ సైట్లను బ్లాక్ చేసింది. టాస్క్ ఆధారిత, వ్యవస్థీకృత చట్టవ్యతిరేక పెట్టుబడి సంబంధిత (Illegal Investment-Related Crimes) ఆర్థిక నేరాలకు ఈ వెబ్ సైట్లు పాల్పడుతున్నాయని తెలిపింది.
Ministry of Electronics and Information Technology (MeitY), invoking its power under the Information Technology Act, 2000, has blocked these websites. These websites, facilitating task based and organized illegal investment related economic crimes, were learnt to be operated by…
— ANI (@ANI) December 6, 2023
ఈ వెబ్ సైట్లు డిజిటల్ ప్రకటనలు, చాట్ మెసెంజర్లు, మ్యూల్, అద్దె ఖాతాలను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి వంద వెబ్ సైట్లను వెంటనే నిషేదిస్తున్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది.