Representational Image | (Photo Credits: Twitter/ZoomUs)

New Delhi, FEB 08: కరోనా సమయంలో చాలా పాపులర్ అయిన వీడియో సర్వీసుల యాప్‌ జూమ్‌(Zoom app) సంచలన నిర్ణయం తీసుకుంది. రెండేళ్లుగా భారీగా నియామకాలు చేసుకున్న జూమ్ కంపెనీ(Zoom)...తమ ఉద్యోగుల్లో 15 శాతం మందికి ఉద్వాసన పలుకనుంది. అంటే దాదాపు 1300 మంది ఉద్యోగులను తొలగించనుంది. కరోనా సమయంలో భారీగా సేవలు అందించాల్సిన అవసరం కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని నియమించుకున్నామని, ఇప్పుడు ఆర్ధిక భారం తగ్గించుకోవడంలో భాగంగా తొలగింపులు తప్పడం లేదని జూమ్‌ సీఈవో ఎరిక్ యువాన్ (Eric Yuan) తెలిపారు. జులై 2019 నుంచి అక్టోబర్ 2022 మధ్యలో తమ కంపెనీ దాదాపు 272 శాతం ఎక్కువగా ఉద్యోగుల్ని నియమించుకుందని, ఈ కాలంలో దాదాపు 8,422 మందిని కొత్తగా రిక్రూట్ చేసుకున్నట్లు ప్రకటించారు.

దాంతో తమ కంపెనీపై భారం పడిందని, ఇప్పుడు దిద్దుబాటు చర్యల్లో బాగంగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నట్లు తెలిపారు. అయితే ఆర్ధిక మాంద్యం కారణంగా ఇప్పటికే పలు టెక్ కంపెనీలు ఉద్యోగుల్లో కోత పెడుతున్నాయి. అమెజాన్ (Amazon), మైక్రోసాఫ్ట్ తో పాటూ అనే టెక్ కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటించాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాల కోత ఉండొచ్చని వినిపిస్తోంది. దీంతో టెక్ కంపెనీల ఉద్యోగుల్లో గుబులు మొదలైంది.