New York, FEB 01: ఐటీ కంపెనీలపై ఆర్ధిక సంక్షోభం ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఏ క్షణాన జాబ్ పోతుందో అన్న టెన్షన్ తో ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కేవలం ఐటీ సెక్టార్ (IT sector) మాత్రమే కాదు, ఇతర రంగాల్లోనూ ఉద్యోగాల కోతలు నడుస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు ప్రతినిత్యం లే ఆఫ్స్ (Layoffs ) ప్రకటిస్తున్నాయి. తాజాగా పేపాల్ (Layoffs in PayPal) కంపెనీతో పాటూ హబ్ స్పాట్, హర్పల్ కొలిన్స్ కంపెనీలు తమ ఉద్యోగుల్లో కొంతమందికి ఉద్వాసన పలికాయి. పేపాల్ కంపెనీలోని 2వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అటు హబ్ స్పాట్ (Layoffs in HubSpot) కూడా తమ కంపెనీలో పనిచేస్తున్న 500 మందిని తొలగించింది. ఆర్ధిక భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీలు ప్రకటిస్తున్నాయి.
2023 Layoffs: PayPal, HubSpot And HarperCollins Announce Cuts https://t.co/1DuRgxImWw pic.twitter.com/6mnIVvJ11t
— Forbes (@Forbes) January 31, 2023
రోజు రోజుకూ పెరుగుతున్న ద్రవోల్బణం ఎఫెక్ట్ తో ఆర్ధిక మాంధ్యం ముంచుకొస్తోంది. దాంతో క్లయింట్ల బడ్జెట్లో కోతలు సాధారణం అయిపోయాయి. దీంతో పే పాల్ కంపెనీ తమ ఉద్యోగుల్లోని 7 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ ఎఫెక్ట్ పడింది. అటు హర్పర్ కొలిన్స్ (HarperCollins) కూడా తమ ఉద్యోగుల్లోని 5 శాతం మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు తెలిపింది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 4వేల మందికి పైగా ఎంప్లాయిస్ ఉన్నారు.
ఇదే బాటలో ఫిలిప్స్ కంపెనీ కూడా లే ఆఫ్స్ ప్రకటించింది. రానున్న రోజుల్లో దాదాపు 6వేల మందిని తొలగించే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించగా, ఇప్పుడు అన్ని రంగాలకు లే ఆఫ్స్ పాకడంతో ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది.