Auckland, March 16: న్యూజిలాండ్ సమీపంలో భూకంపం (Earthquake Hits) సంభవించింది. పసిఫిక్ సముద్రంలో భూమి కంపించిటనట్లు యూఎస్‌జీఎస్ (USGS) తెలిపింది. కెర్మెడిక్ ఐలాండ్స్ సమీపంలో భూకంపం వచ్చినట్లు నమోదైంది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.0గా నమోదైంది. దీంతో సముద్రంలో చిన్నపాటి సునామీ అలలు (Small Tsunami) ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. ఆక్లాండ్ సహా పరిసర ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. న్యూజిలాండ్ స్థానిక కాలమానప్రకారం మద్యాహ్నం 1.56 నిమిషాలకు భూకంపం వచ్చింది. రౌల్ ఐలాండ్స్ కు (Raoul Island) 195 కిలోమీటర్లు, ఆక్లాండ్ ఈశాన్య ప్రాంతానికి 700 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
UPDATE: 7.0 quake hits north of New Zealand, causes small tsunami https://t.co/e3se1zWPBU
— BNO News Live (@BNODesk) March 16, 2023
భూమికి 22 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపారు. దీంతో కెర్మెడిక్ ఐలాండ్స్, ఫిజీ, న్యూజిలాండ్, టోంగా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే దీనివల్ల పెద్దగా ప్రమాదం లేదని తేలడంతో వాటిని ఉపసంహరించుకున్నారు.