World

Volodymyr Zelensky Biography: ఉక్రెయిన్ అధ్యక్షుడికి సంబంధంచిన ఈ విషయాలు తెలుసా? కమెడియన్ నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడి వరకు ప్రస్థానం ఇదీ! జెలెన్‌ స్కీ లైఫ్ స్టోరీలో కీలకమైన మైలురాళ్లు ఇవే

Naresh. VNS

ప్రపంచానికి ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ గానే తెలుసు.. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు (Russia war) దిగిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీగా ముందుగా వచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ భయంతో దేశం విడిచి పారిపోకుండా దేశ పౌరులతో పాటుగా ఉక్రెయిన్ ఆర్మీలో ధైర్యాన్ని నింపారు. నేను ఉన్నా.. మనదేశాన్ని మనం కాపాడుకుందాం.. అంటూ ముందుకు నడిపిస్తున్నారు.

Russia-Ukraine War: ఉక్రెయిన్ నుంచి ముంబైకి క్షేమంగా చేరుకున్న 219 మంది భార‌తీయులు, స్వాగతం పలికిన కేంద్ర మంత్రి పీయూశ్ గోయ‌ల్

Hazarath Reddy

ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం బాంబుల వర్షం మూడో రోజు కూడా కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో భారతీయ పౌరులు, విద్యార్థులు తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. రుమేనియా నుంచి తొలి ఎయిర్‌ ఇండియా విమానం ముంబైలో ల్యాండ్ అయింది.

Indians in Ukraine: భారతీయులు జాగ్రత్తగా ఉండండి, ఎవ‌రూ ఏ దేశ స‌రిహ‌ద్దుల వైపు వెళ్లొద్ద‌ు, హెచ్చరించిన ఉక్రెయిన్‌ ఎంబ‌సీ అధికారులు, ఉక్రెయిన్ నుంచి వ‌చ్చే విద్యార్థుల‌కు ముంబై ఎయిర్ పోర్టులో ఆర్టీపీసీఆర్ టెస్టులు

Hazarath Reddy

ఎంబ‌సీ అధికారులు ( Indian Embassy in Kyiv) భార‌తీయులు అత్యంత అప్ర‌మ‌త్త‌త‌తో ఉండాల‌ని సూచించారు. త‌మ సూచ‌న‌లు తీసుకోకుండా, వాటికి విరుద్ధంగా ఎవ‌రూ ఏ దేశ స‌రిహ‌ద్దుల వైపు వెళ్లొద్ద‌న స్ప‌ష్టం చేశారు. అక్క‌డి ఎంబ‌సీ అధికారుల సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని సూచించింది.

Russia-Ukraine War: సాయం అందించండి, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఫోన్ చేసిన ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ

Hazarath Reddy

ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి శ‌నివారం ఫోన్ చేశారు. ర‌ష్యా బాంబుల మోత మోగిస్తూ.. ఉక్రెయిన్‌పై విరుచుకుప‌డుతున్న నేప‌థ్యంలో భార‌త్ సాయం కావాలంటూ ఉక్రెయిన్ అధ్య‌క్షుడు మోదీని కోరారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల గురించి వీరిద్ద‌రూ మాట్లాడుకున్నారు.

Advertisement

Russia-Ukraine War: భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చిన యుద్ధం, రష్యా దాడిలో 198 మంది సామాన్య పౌరులు మృతి, వారిలో ముగ్గురు చిన్నారులు, 1115 మందికి గాయాలు, క్షతగాత్రుల్లో 33 మంది పిల్లలు

Hazarath Reddy

ఉక్రెయిన్ పై రష్యా పంజా విసిరుతోంది. బాంబులతో (Russia-Ukraine War) విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ పై దురాక్రమణ మొదలుపెట్టిన రష్యా దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది. గత గురువారం సైనిక చర్య మొదలుపెట్టగా ప్రస్తుతం రష్యన్ బలగాలు రాజధాని కీవ్ ను హస్తగతం చేసుకునేందుకు (Street Fighting Erupts in Kyiv) తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

Vladimir Putin Biography: పుతిన్ ఆహార అలవాట్లు ఇప్పటికీ మిస్టరీనే, ఆయన రక్తంతో స్నానం చేస్తాడని తెలుసా? అధికారం కోసం ఎంతకైనా తెగిండచం పుతిన్‌ కే చెల్లింది

Naresh. VNS

అమెరికా (America) వంటి అగ్రరాజ్యం హెచ్చరికలు, ఇతర మిత్ర దేశాల సూచనలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్న పుతిన్ ఎవరు? ఆయన హిస్టరీ ఏంటి? అసలు ఇంత పవర్‌ ఫుల్‌ గా ఎలా మారారు? గురించి తెలుసుకుందాం. 1952 లెనిన్‌గ్రాడ్‌ (సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌)లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన పుతిన్‌.. ఇప్పుడు అసాధారణ వ్యక్తిగా ప్రపంచానికి తెలుసు. పుతిన్‌ చదివింది లా.

Ukraine President Video: నేను ఇక్కడే ఉన్నా: ఉక్రెయిన్ ప్రెసిడెంట్, అధ్యక్ష భవనం నుంచి సెల్ఫీ వీడియో, మిటలరీతో పాటూ ఉన్నానంటూ భరోసా, రష్యాపై ఆరోపణలు

Naresh. VNS

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ (Ukraine President) జెలెన్ స్కీ (Volodymyr Zelensky) ఎట్టకేలకు బయటకు వచ్చారు. తాను రాజధాని కీవ్ నగరంలోనే ఉన్నట్లు సోషల్ మీడియాలో (Social Media) ఒక వీడియోను పోస్ట్ చేశారు. తనతో పాటూ Kyiv ను కాపాడుకునేందుకు నిల్చొన్న ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి సెల్ఫీ వీడియోలో కనిపించాడు.

Russia-Ukraine war Updates: చైనా జోక్యంతో మొత్తబడ్డ పుతిన్, ఉక్రెయిన్ అధికారులతో చర్చించేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటన, బెలారస్ లో చర్చిద్దాం రండి! అంటూ రష్యా అధ్యక్షుడి కార్యాలయం ప్రకటన

Naresh. VNS

రష్యా- ఉక్రెయిన్ (Russia Ukraine) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పుతిన్ (Putin) కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఉక్రెయిన్‌ అధికారుల బృందంతో చర్చలకు సిద్ధమని తెలిపింది. చర్చలకు బెలారస్‌ రాజధాని మిన్‌స్క్‌కు (Minsk) రష్యా బృందాన్ని పంపిస్తామని ప్రకటించింది. ఉక్రెయిన్‌ సైన్యం ఆయుధాలు వీడితే చర్చలకు తాము సిద్ధమేనంటూ ఇప్పటికే రష్యా విదేశాంగశాఖ మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

Russia-Ukraine Conflict: కన్నీరుపెట్టిస్తున్న ఉక్రెయిన్‌ సైనికుడి వీడియో, మామ్, డాడ్ ఐ ల‌వ్ యూ అంటూ కుటుంబానికి సందేశం ఇస్తున్న సైనికుడు, నెట్టింట వైరల్ అవుతున్న 13 సెకన్ల వీడియో

Hazarath Reddy

ఉక్రెయిన్‌ను చెందిన ఓ సైనికుడు విడుద‌ల చేసిన సందేశం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌ అవుతోంది. ఓ వీడియోలో సైనికుడు త‌న కుటుంబ స‌భ్యుల‌కు సందేశాన్ని పంపాడు. మామ్, డాడ్ ఐ ల‌వ్ యూ.. అంటూ అత‌ను పేర్కొన్నాడు. 13 సెకన్ల వీడియోలో సైనికుడు తన కుటుంబానికి సందేశం ఇస్తున్నట్లు కనిపించాడు.

Russia-Ukraine Conflict: చెర్నోబిల్ న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ ప్లాంట్‌లో మళ్లీ పెరిగిన రేడియేష‌న్, ప్లాంట్ వ‌ల్ల యూరోప్ దేశాల‌కు ప్ర‌మాదం ఉన్న‌ట్లు ఆరోపణలు

Hazarath Reddy

చెర్నోబిల్ న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ ప్లాంట్‌లో మ‌ళ్లీ రేడియేష‌న్ పెరిగింది. ఈ విష‌యాన్ని ఉక్రెయిన్‌కు చెందిన న్యూక్లియ‌ర్ ఏజెన్సీ తెలిపింది. చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రాన్ని గురువారం ర‌ష్యా ద‌ళాలు స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే.

Russia-Ukraine Conflict: గగనతలాన్ని మూసేసిన రష్యా, బ్రిటన్‌ విమానాల ల్యాండింగ్‌‌పై నిషేధం, అధికారికంగా ప్రకటించిన రష్యా పౌర విమానయాన సంస్థ

Hazarath Reddy

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తాజాగా తన గగనతలాన్ని బ్రిటీష్‌ ఎయిర్‌లైన్స్‌కి మూసేసింది. అలాగే రష్యా విమానాశ్రయాల్లో బ్రిటన్‌ విమానాల ల్యాండింగ్‌ను నిషేధించింది. రష్యా పౌర విమానయాన సంస్థ ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది

Russia-Ukraine Conflict: ప్రేమ‌, శాంతి .. యుద్ధంపై విజ‌యం సాధించాలి, ఉక్రెయిన్ జెండాతో యువకుడు.. ర‌ష్యా జెండాతో యువతి, 2019 నాటి ఫోటోను షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్

Hazarath Reddy

ఉక్రెయిన్, ర‌ష్యా మ‌ధ్య యుద్ధం జ‌రుగుతున్న నేప‌థ్యంలో 2019 నాటి ఈ ఫోటో ఇప్పుడు అంద‌ర్నీ అట్రాక్ట్ చేస్తోంది. ఈ ఫోటోలో ఉన్న ఓ జంట త‌మ ఒంటిపై ఉక్రెయిన్, ర‌ష్యా జాతీయ జెండాల‌ను క‌ప్పుకున్నారు. 2019లో పోలాండ్‌లో జ‌రిగిన మ్యూజిక్ క‌న్‌స‌ర్ట్ స‌మ‌యంలో ఈ సీన్ క‌నిపించింది.

Advertisement

Russia-Ukraine Conflict: ఉక్రెయిన్‌ సైన్యం పోరాటం ఆపితే చర్చలకు సిద్ధమని రష్యా కీలక ప్రకటన, ఉక్రెయిన్‌ ఆర్మీ ఆయుధాల్ని వదలి లొంగిపోవాలని తెలిపిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్‌

Hazarath Reddy

Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపుకు రెండు విమానాలు, విద్యార్థులంతా హంగేరి, రుమేనియా దేశాల సరిహద్దులకు రావాలని సూచించిన కేంద్రం

Hazarath Reddy

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం (India to Evacuate Citizens From Ukraine ) కీలక ప్రకటన చేసింది. హంగేరి, రుమేనియా దేశాలకు (Hungary, Romania) దగ్గరగా ఉన్న వారు సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టుల వద్దకు రావాలని సూచించింది.

Russia-Ukraine War: ప్రపంచం తమను ఒంటరిగా వదిలేసింది, ర‌ష్యా పోరాటంలో మన పక్షాన నిలబడి పోరాడటానికి ఎవరు సిద్ధంగా లేరని ఆవేదన వ్యక్తం చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ

Hazarath Reddy

రష్యా పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ ఉంటే ప్రపంచం తమను ఒంటరిగా (left alone) వదిలేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ (Ukrainian President Zelensky) ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాతో పోరాడి, తమ దేశాన్ని కాపాడుకునే బాధ్యతను కేవలం తమపైనే పెట్టిందని వాపోయారు. స్వాతంత్ర్య పోరాటంలో తాము ఒంట‌రిగా మిగిలామ‌న్నారు.

Russia-Ukraine War: ర‌ష్యా విమానాన్ని కూల్చివేసిన‌ట్లు ప్రకటించిన ఉక్రెయిన్ హోంశాఖ, సెంట్ర‌ల్ కీవ్ ప్రాంతంలో రెండు భారీ పేలుళ్లు

Hazarath Reddy

గురువారం రాత్రి కీవ్ గ‌గ‌న‌త‌లంలోకి వ‌చ్చిన ర‌ష్యా విమానాన్ని కూల్చివేసిన‌ట్లు ఉక్రెయిన్ హోంశాఖ వెల్ల‌డించింది. రాత్రి పూట కీవ్ న‌గ‌రంపై పేల్చివేత‌కు గురైన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

Advertisement

Russia-Ukraine Conflict: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 16 వేల మంది భారతీయులు, క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపిన విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్లా

Hazarath Reddy

ఉక్రెయిన్‌లో ప్రస్తుతం దాదాపు 16 వేల మంది భారతీయులు ఉన్నారని, వారిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్లా చెప్పారు. ఇందుకోసం ఉక్రెయిన్‌ సమీపంలో ఉన్న పోలాండ్, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాల సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు.

Russia-Ukraine War Updates: ఉక్రెయిన్ లో రష్యా రక్తపాతం, ఒక్కరోజే 137 మంది పౌరులు మృతి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న ఉక్రెయిన్ వాసులు, దూకుడు పెంచిన రష్యా బలగాలు

Naresh. VNS

యుక్రెయిన్‌లో ర‌ష్యా (Russian attack) ర‌క్తపాతం సృష్టిస్తోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో (Kyiv) రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. కీవ్ గగనతలంపై రష్యా యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. భయం గుప్పెట్లో కీవ్ (Kyiv) ప్రజలు గడుపుతుండగా.. కీవ్ విమానాశ్రయాన్ని రష్యా సైనికులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

PM Modi Speaks to Putin: యుద్ధం ఆపండి, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మోదీ ఫోన్, హింసకు తెరదించాలంటూ విజ్ఞప్తి, ఉక్రెయిన్ లోని భారతీయులపై ఇరువురి మధ్య చర్చ

Naresh. VNS

ఉక్రెయిన్- రష్యా యుద్ధం (Russia-Ukraine War) నేపథ్యంలో...శాంతి నెలకొల్పేందుకు ప్రపంచదేశాలు రంగంలోకి దిగుతున్నాయి. రష్యాతో (Russia) మంచి సంబంధాలు ఉన్న భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఫోన్ లో మాట్లాడారు(PM Modi speaks to Putin). ఉక్రెయిన్‌పై సైనిక దాడికి త‌క్ష‌ణం స్వ‌స్తి పలుకాల‌ని కోరారు.

Russia-Ukraine Crisis: రష్యా బాంబు దాడులు, 40 మంది సైనికులు, 10 మంది పౌరులు మృతి, 70కి పైగా ఉక్రెయిన్ సైనిక స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన రష్యా

Hazarath Reddy

రష్యా బాంబు దాడులకు ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఉక్రెయిన్‌కు చెందిన 40 మంది సైనికులు (Over 40 Ukraine Soldier), 10 మంది పౌరులు మృతి (10 Civilians Killed) చెందిన‌ట్లు ఆ దేశ‌ ప్రెసిడెంట్ కార్యాల‌యం ప్ర‌క‌టించింది. ర‌ష్యా చేప‌ట్టిన మిల‌ట‌రీ ఆప‌రేష‌న్‌లో వంద‌లాది మంది తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలిపింది.

Advertisement
Advertisement