World
Russia-Ukraine Conflict: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 16 వేల మంది భారతీయులు, క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపిన విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్లా
Hazarath Reddyఉక్రెయిన్‌లో ప్రస్తుతం దాదాపు 16 వేల మంది భారతీయులు ఉన్నారని, వారిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్లా చెప్పారు. ఇందుకోసం ఉక్రెయిన్‌ సమీపంలో ఉన్న పోలాండ్, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాల సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు.
Russia-Ukraine War Updates: ఉక్రెయిన్ లో రష్యా రక్తపాతం, ఒక్కరోజే 137 మంది పౌరులు మృతి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న ఉక్రెయిన్ వాసులు, దూకుడు పెంచిన రష్యా బలగాలు
Naresh. VNSయుక్రెయిన్‌లో ర‌ష్యా (Russian attack) ర‌క్తపాతం సృష్టిస్తోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో (Kyiv) రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. కీవ్ గగనతలంపై రష్యా యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. భయం గుప్పెట్లో కీవ్ (Kyiv) ప్రజలు గడుపుతుండగా.. కీవ్ విమానాశ్రయాన్ని రష్యా సైనికులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
PM Modi Speaks to Putin: యుద్ధం ఆపండి, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మోదీ ఫోన్, హింసకు తెరదించాలంటూ విజ్ఞప్తి, ఉక్రెయిన్ లోని భారతీయులపై ఇరువురి మధ్య చర్చ
Naresh. VNSఉక్రెయిన్- రష్యా యుద్ధం (Russia-Ukraine War) నేపథ్యంలో...శాంతి నెలకొల్పేందుకు ప్రపంచదేశాలు రంగంలోకి దిగుతున్నాయి. రష్యాతో (Russia) మంచి సంబంధాలు ఉన్న భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఫోన్ లో మాట్లాడారు(PM Modi speaks to Putin). ఉక్రెయిన్‌పై సైనిక దాడికి త‌క్ష‌ణం స్వ‌స్తి పలుకాల‌ని కోరారు.
Russia-Ukraine Crisis: రష్యా బాంబు దాడులు, 40 మంది సైనికులు, 10 మంది పౌరులు మృతి, 70కి పైగా ఉక్రెయిన్ సైనిక స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన రష్యా
Hazarath Reddyరష్యా బాంబు దాడులకు ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఉక్రెయిన్‌కు చెందిన 40 మంది సైనికులు (Over 40 Ukraine Soldier), 10 మంది పౌరులు మృతి (10 Civilians Killed) చెందిన‌ట్లు ఆ దేశ‌ ప్రెసిడెంట్ కార్యాల‌యం ప్ర‌క‌టించింది. ర‌ష్యా చేప‌ట్టిన మిల‌ట‌రీ ఆప‌రేష‌న్‌లో వంద‌లాది మంది తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలిపింది.
Russia-Ukraine Crisis: ఉక్రెయిన్- ర‌ష్యా మ‌ధ్య యుద్ధం, పుతిన్‌తో మాట్లాడనున్న భారత ప్రధాని మోదీ, ఉక్రెయిన్ విష‌యంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని ర‌ష్యా అధ్య‌క్షుడు ఆదేశాలు
Hazarath Reddyభారత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గురువారం రాత్రి ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో ఫోన్లో సంభాషించ‌నున్న‌ట్లు స‌మాచారం. ర‌ష్యా ఉక్రెయిన్‌పై బాంబుల‌తో (Russia-Ukraine Crisis) విరుచుకుప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ పుతిన్‌తో మాట్లాడ‌టం (PM Narendra Modi Likely To Speak to Russian President) ప్రాధాన్యాన్ని సంత‌రించుకుంది.
Russia-Ukraine Conflict: బిక్కు బిక్కుమంటున్న భారతీయులు, ఉక్రెయిన్‌లో గడ్డకట్టే చలిలో భారతీయుల నిస్సహాయత, వెంట‌నే బాంబు షెల్ట‌ర్ల‌లోకి వెళ్లిపోవాల‌ని కోరిన భార‌త రాయ‌బార కార్యాల‌యం
Hazarath Reddyరష్యా ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో అక్కడ భారతీయులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఉక్రెయిన్‌లో గంట గంట‌కూ ప‌రిస్థితులు (Russia-Ukraine Conflict) మారిపోతున్న నేప‌థ్యంలో అక్క‌డి భార‌త రాయ‌బార కార్యాల‌యం కూడా అప్ర‌మ‌త్త‌మ‌వుతోంది.
Russia-Ukraine Crisis: ఎక్కడివారు అక్కడే ఉండండి, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌‌కు ఎవరూ రావొద్దు, ఉక్రెయిన్‌లోని భారతీయులకు సూచించిన ఇండియన్‌ ఎంబసీ
Hazarath Reddyఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడి చేస్తున్న నేపథ్యంలో కీవ్‌లో పరిస్థితులు క్షీణిస్తున్నాయని, ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, ఎట్టి పరిస్థిస్తుల్లో రాజధాని కీవ్‌కు రావద్దని అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయం సూచించింది
Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా బాంబులు వర్షం కురిపిస్తున్న వీడియో బయటకు, కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద పెద్దఎత్తున పేలుళ్లు
Hazarath Reddyరష్యా అన్నంత పని చేసింది. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నది. రాజధాని కీవ్‌ సహా ప్రధాన నగరాలపై పెద్దఎత్తున బాంబులతో దాడులు చేస్తున్నది. కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద, ఖార్కివ్‌లలో పెద్దఎత్తున పేలుళ్లు సంభవించాయని బీఎన్‌ఓ న్యూస్‌ తెలిపింది. అదేవిధంగా డెనెట్స్క్‌ ప్రావిన్స్‌లోని యరియుపోల్‌పై శక్తివంతమైన బాంబులతో దాడి చేసింది.
Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం, రష్యాను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ వినతి
Hazarath Reddyఉక్రెయిన్‌పై దాడుల నేప‌థ్యంలో ఆ దేశ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ స్పందించారు. ర‌ష్యాను నిలువ‌రించేందుకు ప్ర‌పంచ దేశాలు ముందుకు రావాల‌ని జెలెన్‌స్కీ విజ్ఞ‌ప్తి చేశారు. ర‌ష్యాకు వ్య‌తిరేకంగా తాము ప‌లు దేశాల‌తో మ‌ద్ద‌తు కూడ‌గడుతున్నామ‌ని ఆయ‌న తెలిపారు.
Russia-Ukraine Crisis: రష్యాకు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చివేసిన ఉక్రెయిన్‌, ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా
Hazarath Reddyఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. అయితే రష్యా దాడిని ఉక్రెయిన్‌ సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు. లుహాన్స్‌ రీజియన్‌లో రష్యాకు చెందిన ఐదు యుద్ధ విమానాలు, ఓ హెలికాప్టర్‌ను కూల్చివేశామని ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది.
Floods in Brazil: బ్రెజిల్ దేశాన్ని వణికిస్తున్న వరదలు, 204 మంది మృతి, మరో 51 మంది గల్లంతు, అతి భారీవర్షాల వల్ల మెరుపు వరదలు
Hazarath Reddyబ్రెజిల్ దేశంలో వరదలు పోటెత్తాయి. వరద విపత్తు వల్ల మృతుల సంఖ్య 204కు పెరిగింది. బ్రెజిల్ దేశంలోని ఆగ్నేయ రియో డి జనీరో రాష్ట్రంలోని పెట్రోపోలిస్ నగరంలో భారీ వరదల కారణంగా 204 మంది మరణించినట్లు బ్రెజిల్ అధికారులు చెప్పారు.
Ukraine Closes Airspace: ఉక్రెయిన్ వెళ్లకుండానే వెనక్కు వచ్చేసిన ఎయిరిండియా విమానం, యుద్ధం కారణంగా గగనతలం మూసివేత, విద్యార్ధుల పరిస్థితి ఏంటని ఆందోళన
Naresh. VNSఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్‌ (military operations) ప్రారంభించింది. దీంతో దేశంలోని విమానాశ్రయాలు, గగనతలాన్ని ఉక్రెయిన్‌ మూసింది (Closes Airspace). దీంతో ఆ దేశంలో ఉన్న భారత విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు కీవ్‌కు బయల్దేరిన ఎయిర్‌ ఇండియా విమానం (Air India Flight) వెనక్కి వచ్చేసింది.
Russia Declares War On Ukraine: యుద్ధం మొదలైంది, ఇక సమరమే అని ప్రకటించి పుతిన్, ఉక్రెయిన్ రాజధానిపై బాంబుల వర్షం, మరోసారి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం
Naresh. VNSఅనుకున్నదంతా అయింది. ఉక్రెయిన్ (Ukraine)తో రష్యా(Russia) యుద్ధం (War) మొదలైంది. ఉక్రెయిన్ పై సైనిక చర్యకు ఆదేశించారు అధ్యక్షుడు పుతిన్(Putin). ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్‌ మొదలైందని ప్రకటించారు. ఈ సందర్భంగా డోన్భాస్‌లో ఉక్రెయిన్‌ బలగాలు వెనక్కి వెళ్లాలని పుతిన్‌ వార్నింగ్‌ (Putin Warning) ఇచ్చారు.
Viral: రెండేళ్లకే పైలట్ సీటులో కూర్చున్న బుడతడు, విమానాన్ని ఎలా న‌డ‌పాలో ఆసక్తిగా వింటూ...సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్న వీడియో
Hazarath Reddyపిల్లాడికి విమానాలంటే పిచ్చి కావడంతో విమాన సిబ్బంది ఈ సాహసానికి పూనుకొన్నారు. చిన్న‌ప్ప‌టి నుంచి విమానాలంటే క్రేజీగా ఉన్న ఆ పిల్లాడిని విమానం సిబ్బంది కాక్‌పీట్‌లోకి తీసుకెళ్లి పైలెట్ సీటులో కూర్చోబెట్టారు. ఆ త‌ర్వాత ప‌క్క‌నే కూర్చున్న పైలెట్.. ఆ బుడ్డోడికి క్యాప్ పెట్టి.. విమానాన్ని ఎలా న‌డ‌పాలో.. ఇన్‌స్ట్ర‌క్ష‌న్స్ ఇచ్చాడు.
Blast at Gold Mining: బంగారు గనిలో అకస్మాత్తుగా భారీ పేలుడు, చెల్లాచెదురైన మృతదేహాు, 59 మంది మృతి, వందల మందికి గాయాలు, పశ్చిమ ఆఫ్రికాలో నైరుతి బుర్కినా ఫాసోలో విషాద ఘటన
Hazarath Reddyపశ్చిమ ఆఫ్రికాలోని నైరుతి బుర్కినా ఫాసోలోని బంగారు గనిలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Viral: సైక్లిల్‌ రైడర్ల‌పై అనూహ్యంగా ఎద్దు దాడి, ముగ్గురికి గాయాలు, మిగతా వాళ్ల పై కూడా దాడి చేసేందుకు ప్రయత్నం
Hazarath Reddyఅమెరికాలోని కాలిఫోర్నియాలో రేస్‌లో పాల్గొంటున్న సైక్లిల్‌ రైడర్ల పై ఎద్దు దాడి చేసింది. ముగ్గురు వ్యక్తులు సైకిల్‌ రేసింగ్‌ చేస్తుండగా ఒక ఎద్దు అనుహ్యంగా ఒక సైకిల్‌ రైడర్‌ పై దారుణంగా దాడి చేసింది. ఆ వ్యక్తిని అమాత్తంగా గాల్లోకి ఎత్తిపడేసింది. అక్కడ ఉన్న మిగతా వాళ్ల పై కూడా దాడి చేసేందుకు కూడా యత్నించింది.
Russia-Ukraine Crisis: ఎవ్వరి మాట వినని పుతిన్, ఆక్రమిత ప్రాంతాల్లోకి గత 12 గంటల్లో 10 వేల మంది సైన్యం తరలింపు, ర‌ష్యా బ్యాంకుల‌పై ఆంక్ష‌లు విధిస్తున్నామని తెలిపిన బ్రిట‌న్
Hazarath Reddyర‌ష్యా- ఉక్రెయిన్ మ‌ధ్య ప‌రిస్థితులు రోజు రొజుకు మ‌రింతగా క్షీణిస్తున్నాయి.తాజాగా రష్యా గత 12 గంటల్లో 10,000 మంది సైనికులను వివాదాస్పద ప్రాంతాలకు తరలించిందని ఉక్రెయిన్ సైనిక వర్గాలు పేర్కొన్నాయి. వేలాది మంది రష్యన్ దళాలు ఇప్పటికే ఉక్రెయిన్‌లో (Russia-Ukraine Crisis) ఉన్నాయిని ఉక్రెయిన్ సైనిక వర్గాలు మంగళవారం హెచ్చరించాయి,
Ukraine-Russia Tensions: ఉక్రెయిన్ సంక్షోభం, అక్కడి విద్యార్థులు వెంటనే భారత్‌కు తిరిగిరండి, హెచ్చరించిన విదేశాంగ శాఖ, చిక్కుకుపోయిన 20 వేల మంది కోసం బయల్దేరిన ప్రత్యేక విమానం
Hazarath Reddyఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు ప‍్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా సైనిక బలగాలు (Ukraine-Russia Tensions) యుద్ధ వినాస్యాలను ప్రదర్శించడం యుద్ద వాతావరణాన్ని తలపిస్తోంది. ఉక్రెయిన్‌ వివాదం యుద్ధం చివరి అంచులకు చేరుకోవడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
Florida Horror: దారుణం.. భర్తను 140 సార్లు కత్తితో పొడిచి చంపిన భార్య, అంతటితో ఆగక అతని పుర్రెను ముక్కలు ముక్కలు చేసింది, కొడుకు ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు, అమెరికాలోని ఫ్లోరిడాలో భయానక ఘటన
Hazarath Reddyఅమెరికాలోని ఫ్లోరిడాలో భయానక ఘటన చోటు చేసుకుంది. దివ్యాంగుడైన భర్తను భార్య 140 సార్లు కత్తితో పొడిచి (Wife stabs disabled Husband 140 times) చంపింది. అంతే కాకుండా అతని పుర్రెను ముక్కలు ముక్కలు (fractures skull in Florida) చేసింది.
R Praggnanandhaa: ప్రపంచ నంబర్ వన్‌కు షాకిచ్చిన భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానానంద, ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఎనిమిదో రౌండ్‌లో ఘన విజయం
Hazarath Reddyఆన్‌లైన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఎనిమిదో రౌండ్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ R ప్రజ్ఞానానంద ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌కు షాకిచ్చాడు. కార్ల్‌సెన్ యొక్క మూడు వరుస విజయాల రికార్డును ఆపేశాడు. ప్రగ్నానంద 39 ఎత్తుగడలతో నల్ల పావులతో గెలిచాడు.