World
Plane Crashes in Russia: రష్యాలో ఘోర విమాన ప్రమాదం, 16 మంది మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు, ప్రమాద సమయంలో విమానంలో 23 మంది ప్రయాణికులు
Hazarath Reddyరష్యాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. తతర్‌స్తాన్‌లో ప్రావిన్సుల్లో జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 23 మంది ఉన్నట్లు సమాచారం.
Coronavirus in India: మరో కొత్త చిక్కు..ట్విండెమిక్‌గా మారుతున్న కరోనా, దేశంలో తాజాగా 18,166 మందికి కోవిడ్, కేరళలో కొనసాగుతున్న కరోనావైరస్ విజృంభణ
Hazarath Reddyదేశంలో కొత్త క‌రోనా కేసులు మ‌రోసారి 20 వేల‌కు దిగువ‌న న‌మోద‌య్యాయి. నిన్న‌ 18,166 క‌రోనా కేసులు (Coronavirus in India) న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,53,475కు పెరిగింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 23,624 మంది (23,624 recoveries) కోలుకున్నారు. 214 మంది ప్రాణాలు (214 deaths in the last 24 hours ) కోల్పోయారు.
French Catholic Church: చర్చిలో కామాంధులు, లక్షల మంది చిన్నారులను లైంగికంగా వేధించిన క్యాథ‌లిక్ చ‌ర్చి ఫాద‌ర్లు, ఫ్రాన్స్‌లో దారుణ ఘటన వెలుగులోకి, క్ష‌మాప‌ణ‌లు కోరిన ఫ్రెంచ్ చ‌ర్చి విభాగం
Hazarath Reddyఫ్రాన్స్‌కు చెందిన క్యాథ‌లిక్ క్రైస్త‌వ ఫాదర్లు కొన్ని ద‌శాబ్ధాల నుంచి చిన్నారుల‌పై లైంగిక వేధింపుల‌కు (French clergy sexually abused) పాల్ప‌డ్డారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 1950 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్రాన్స్ క్యాథ‌లిక్ పాస్టర్లు సుమారు 216000 మంది చిన్నారుల‌ను వేధించిన‌ట్లు (French Church abuse) ఓ నివేదిక ద్వారా వెల్ల‌డైంది.
Taliban Destroyed Somnath Idol: తాలిబన్ల మరో అరాచకం, ఆప్ఘాన్లో సోమ్‌నాథ్ ఆల‌యంలోని విగ్ర‌హం ధ్వంసం, ఆ స్థానంలో మ‌హ్మ‌ద్ ఘజినీ ద‌ర్గాను పున‌ర్నిర్మిస్తామ‌ని వెల్లడి
Hazarath Reddyఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల అరాచకం కొనసాగుతోంది. తాజాగా ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని ప్ర‌ముఖ హిందూ దేవాలయం సోమ్‌నాథ్ ఆల‌యంలో విగ్ర‌హాన్ని ధ్వంసం (Taliban Destroyed Somnath Idol) చేసిన‌ట్లు తాలిబ‌న్లు ప్ర‌క‌టించారు. ఆ స్థానంలో మ‌హ్మ‌ద్ ఘజినీ ద‌ర్గాను (Mahmud Ghazni shrine in Afghanistan) పున‌ర్నిర్మిస్తామ‌ని చెప్పారు.
Coronavirus in India: కరోనా ముప్పు పోయిందనేది అబద్దం, ముందు ముందు పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, దేశంలో తాజాగా 24,770 మందికి కరోనా
Hazarath Reddyదేశంలో కొత్తగా 18,833 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,38,71,881కి (Coronavirus in India) చేరింది. ఇందులో 3,31,75,656 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,49,538 మంది మృతిచెందారు. మరో 2,46,687 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, 203 రోజుల తర్వాత ఇంత తక్కువకు చేరుకున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది.
LAC: భారత్‌కు రెండు దేశాల నుంచి ముప్పు, మేము రెడీగా ఉన్నామని తెలిపిన ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌధరి, వాస్తవాధీన రేఖ వెంబడి చైనా మూడు స్థావారాల్లో వైమానిక బలగాలను మోహరించిందని వెల్లడి
Hazarath Reddyసరిహద్దులో దాయాదా దేశం పాకిస్తాన్, చైనాలను ధీటుగా ఎదుర్కునే సత్తా భారత్ కు ఉందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌధరి (Air Chief Marshal V.R. Chaudhari) అన్నారు. చైనా, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రేగుతున్న నేపథ్యంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి భారత వాయుసేన సిద్ధంగా ఉందని అన్నారు
Fumio Kishida: జపాన్ నూతన ప్రధానిగా పుమియో కిషిడా, పార్లమెంటు ఉభయ సభల్లో నిర్వహించిన ఓటింగ్‌లో మెజారిటీ ఓట్లు సాధించిన పుమియో
Hazarath Reddyజపాన్ 100వ ప్రధానిగా పుమియో కిషిడా అధికారికంగా ఎన్నికయ్యారు. సోమవారం జపాన్ పార్లమెంటు ఉభయ సభల్లో నిర్వహించిన ఓటింగ్‌లో పుమియో మెజారిటీ ఓట్లు సాధించారు. దీంతో ఈ మాజీ దౌత్యవేత్తను ప్రధానిగా ప్రకటించారు.
Coronavirus in India: ఏడు రోజుల్లో 8 లక్షల మంది కరోనాతో మృతి, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 5 నిమిషాలకు ఒకరు కరోనాతో మరణిస్తున్నారని చెబుతున్న అధ్యయనాలు, దేశంలో తాజాగా 22,842 కరోనా కేసులు నమోదు
Hazarath Reddyదేశంలో గత 24 గంటల్లో 22,842 కరోనా కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,38,13,903కు చేరింది. ఇందులో 3,30,94,529 మంది కోలుకోగా, 4,48,817 మంది బాధితులు మృతిచెందారు. మరో 2,70,557 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో యాక్టివ్‌ కేసులు 199 రోజుల కనిష్టానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Indo-China Border: సరిహద్దులో మళ్లీ బరితెగిస్తున్న చైనా, తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో భారీగా సైన్యం మోహరింపు, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్దమని తెలిపిన భారత సైనిక దళాధిపతి జనరల్‌ ఎంఎం నరవణె
Hazarath Reddyసరిహద్దులో చైనా మళ్లీ తన కార్యకలాపాలను యాక్టివ్ చేసింది. తన సైన్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనా తమ బలగాలను నానాటికీ పెంచుతోందని, మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపర్చుకుంటోందని (Increase in Chinese Deployment Matter of Concern) భారత సైనిక దళాధిపతి జనరల్‌ ఎంఎం నరవణె తెలిపారు.
Bizarre Viral Story: రైస్ కుక్కర్‌తో పెళ్లి, సెక్స్‌కు పనికిరాలేదని 4 రోజులకే విడాకులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వింత పెళ్లి, ఫన్నీ కోసమే ఇదంతా చేశానని బదులిచ్చిన వరుడు
Hazarath Reddyఇండోనేసియాలో వింత కథ చోటు చేసుకుంది .అది సోషల్ మీడియాలో వైరల్ (Bizarre Viral Story) అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని ప్రకారం.. ఓ యువకుడు వైట్‌ డ్రెస్సులో ధగధగ మెరిసిపోతూ కనిపిస్తాడు. పెళ్లి కూతురుకు తల మీద ఓ గుడ్డ కప్పి ఉంటుంది.
COVID-19 in US: అమెరికాపై మళ్లీ కరోనా పంజా, ఏడు ల‌క్ష‌లు దాటిన మృతుల సంఖ్య, గ‌డిచిన 108 రోజుల్లో లక్షకు పైగా మరణాలు, యుఎస్‌ని వణికిస్తున్న డెల్టా వేరియంట్
Hazarath Reddyఅమెరికాలో కోవిడ్ వ‌ల్ల మృతి చెందిన వారి సంఖ్య ఏడు ల‌క్ష‌లు (US surpasses 700,000 COVID-19 deaths) దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ డేటా ప్ర‌కారం గ‌డిచిన 108 రోజుల్లోనే ఆ దేశంలో కొత్త‌గా ల‌క్ష మందిపైగా మ‌ర‌ణించారు. ఇటీవ‌ల అమెరికాలో మ‌ళ్లీ వైర‌స్ ఇన్ఫెక్ష‌న్‌ కేసులు విప‌రీతంగా పెరిగాయి.
Afghanistan: మళ్లీ మొదలైన తాలిబన్లు వికృత క్రీడ, క్రేన్లకు నాలుగు శవాలను వేలాడదీసి బహిరంగ ప్రదర్శన, తాలిబన్ల విచ్ఛేదనం, నేరస్తులను ఉరితీయడాన్ని ఖండించిన అమెరికా
Hazarath Reddyఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకుని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు తమ పాత వికృత రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. హెరాట్ నగరం (Herat city,) ప్రధాన కూడలిలో శనివారం ఒక మృతదేహాన్ని క్రేన్‌కు వేలాడదీసి (Taliban hang dead body) బహిరంగంగా ప్రదర్శించారు. మరో మూడు మృతదేహాలను ఇతర కూడళ్లలో వేలాడ దీశారు.
Canada Election Result 2021: ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ఎన్నిక కానున్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో, కెన‌డా పార్ల‌మెంట్‌ ఎన్నిక‌ల్లో విజయం సాధించిన లిబరల్‌ పార్టీ
Hazarath Reddyకెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో మూడోసారి తన అధికారాన్ని చేపట్టబోతున్నారు. సెప్టెంబర్‌ 20న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో (Canada Election Result 2021) ఆయన పార్టీ విజయం ఖాయమైనట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే, సొంతంగా పూర్తి మెజారిటీ సాధించడంలో మాత్రం అధికార పార్టీ వెనుకబడింది.
T20 World Cup 2021: మన దేశాన్ని వ్యతిరేకిస్తారా..వారిని అస్సలు వదలొద్దు, వరల్డ్‌కప్‌ ఈవెంట్‌లో టీంఇండియా మ్యాచ్ తర్వాత న్యూజీలాండ్‌ని చావు దొబ్బ కొట్టాలన్న అక్తర్
Hazarath Reddyపాకిస్తాన్‌ దేశంలో క్రికెట్ ఆడేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపడం లేదు. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ దేశంలో పర్యటించడానికి అంగీకరించిన న్యూజిలాండ్‌ చివరి నిమిషంలో టూర్‌ రద్దు చేసుకున్న సంగతి విదితమే.
Russia Shooting: కాల్పులతో దద్దరిల్లిన యూనివర్సిటీ, 8 మంది మృతి, మరింత మందికి గాయాలు, నిందితుడిని పట్టుకున్న పోలీసులు, రష్యా పెర్మ్ స్టేట్ యూనివర్సిటీలో ఘటన
Hazarath Reddyర‌ష్యాలో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌ వేళ కాల్పుల మోతతో (Russia Shooting) దద్దరిల్లింది. రష్యా పెర్మ్ క్రాయ్ ప్రాంతంలోని పెర్మ్ స్టేట్ యూనివర్సిటీలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో 8 మంది (8 Killed After Gunman Opens Fire) చనిపోయారు. పలువురు గాయపడ్డారు.
Coronavirus in India: వ్యాక్సినేషన్‌లో చైనా రికార్డు బ్రేక్ చేసిన భారత్, దేశంలో తాజాగా 35,662 మందికి కోవిడ్, ప్రస్తుతం 3,40,639 కేసులు యాక్టివ్
Hazarath Reddyదేశంలో శుక్రవారం 34 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, తాజాగా అవి 35 వేలు (Coronavirus in India) దాటాయి. దీంతో ఇది నిన్నటికంటే 3.65 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 35,662 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,34,17,390కి చేరింది.
Telecom Sector: భారతీయ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకి గొప్ప ఉపశమనం, టెలికాం రంగంలో భారీ సంస్కరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం, వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు
Team Latestlyటెలికాం రంగానికి కేంద్రం ఊరటనిచ్చింది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపై మారటోరియం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం నిర్ణయం తీసుకుంది...
Delta Outbreak in China: చైనాలో మళ్లీ పుంజుకున్న కరోనా, విశ్వరూపం చూపిస్తున్న డెల్టా వేరియంట్, ఫుజియాన్‌ ప్రావిన్స్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమల్లోకి
Hazarath Reddyచైనాను మళ్లీ కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది.డ్రాగన్ కంట్రీలో ప్రమాదకర డెల్టా వేరియంట్‌ కేసులు (Delta Outbreak in China) రోజురోజుకీ పెరుగుతుండటంతో అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఫుజియాన్‌ ప్రావిన్స్‌లో (southeastern province of Fujian) ఒక్కరోజులోనే డెల్టా కేసులు రెట్టింపు స్థాయిలో నమోదవడంతో డ్రాగన్‌ అప్రమత్తమైంది.
Taliban-Afghanistan: మహిళలకు చోటిస్తే వ్యభిచారమే, వారు పిల్లల్ని కంటే చాలు, తాలిబన్ అధికార ప్రతినిధి సయ్యద్‌ జెక్రుల్లా హాషిమి సంచలన వ్యాఖ్యలు, తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణ స్వీకారం రద్దు
Hazarath Reddyఆప్ఘనిస్తాన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణ స్వీకారాన్ని తాలిబన్లు (Taliban-Afghanistan) రద్దు చేశారు. వనరులు, నిధుల వృథా నివారణకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అమెరికాపై దాడులు జరిగిన 11 సెప్టెంబర్‌ నాడే అట్టహాసంగా తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవం (Afghanistan Govt Inaugural Ceremony) నిర్వహించాలని తొలుత తాలిబన్లు భావించారు.