World

India Coronavirus: ఒక్కడు 119 మందికి కరోనాని అంటించాడు, దేశంలో 8 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, కరోనా నుంచి కోలుకున్న 96 ఏళ్ల బామ్మ, 21,604కు చేరిన మరణాల సంఖ్య

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26,506 కరోనా పాజిటివ్‌ కేసులు (India Coronavirus) నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,802కు చేరింది. ప్రస్తుతం దేశంలో 2,76,685 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వైరస్‌ బారినవారిలో 4,95,513 మంది కోలుకున్నారు. ఈ వైరస్‌ వల్ల గత 24 గంటల్లో 475 మంది మృతి (Coronavirus Deaths) చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 21,604కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

Global Coronavirus Cases: ఈ దేశాల్లో కరోనా లేనే లేదు, ప్ర‌పంచ వ్యాప్తంగా 12 మిలియ‌న్ల‌కు చేరుకున్న కోవిడ్ కేసులు, కరోనాతో విలవిలలాడుతున్న అమెరికా, రష్యా, బ్రెజిల్, భారత్

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలాన్ని (Global Coronavirus) రేపుతోంది, ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు (Global Coronavirus Cases) 12 మిలియ‌న్ల‌కు పైగా న‌మోదు కాగా, 5,46,000 మంది (Global Coronavirus Deaths) మ‌ర‌ణించారు. ఈ కేసుల్లో యునైటెడ్ స్టేట్స్, లాటిన్ అమెరికాలో సగానికి పైగా ఉన్నాయి. వైరస్ బారిన పడిన వారిలో సగం మంది కోలుకున్నారు. 3,055,101 కేసులు మరియు 132,309 మరణాలతో, యునైటెడ్ స్టేట్స్ అత్యంత నష్టపోయిన దేశంగా నిలిచింది. 1,713,160 కేసులు మరియు 67,964 మరణాలతో బ్రెజిల్ రెండవ స్థానంలో నిలిచింది.

India Global Week 2020: పెట్టుబడులకు తలుపులు తెరిచాం, భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోంది, ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఇండియా గ్లోబల్ వీక్-2020లో పిలుపునిచ్చిన ప్రధాని మోదీ

Hazarath Reddy

భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఇండియా గ్లోబల్ వీక్-2020 (India Global Week 2020) ఈవెంట్లో ప్రధాని మోదీ (PM Narendra Modi) పిలుపునిచ్చారు. ఇండియా గ్లోబల్‌ వీక్‌-2020 (Global Week India) సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచానికే ఆస్తి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ధరకు మందులు సమకూర్చుస్తున్న ఘనత భారత్‌దేనని అన్నారు.

Coronavirus in India: భారత్‌లో రోజుకు 2.87లక్షల కొత్తకేసులు నమోదవుతాయంటున్న అధ్యయనం, మహారాష్ట్రలో మొత్తం 5,713 మంది పోలీసులకు కరోనా, దేశంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 24,879 కోవిడ్-19 కేసులు

Hazarath Reddy

ఇండియాలో గ‌త 24 గంట‌ల్లో అత్య‌ధికంగా 24,879 మందికి క‌రోనా వైర‌స్ (Coronavirus in India) సంక్ర‌మించింది. 487 మంది మ‌ర‌ణించారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల 7,67,296కు చేరుకున్న‌ది. మొత్తం యాక్టివ్ కేసులు 269789 ఉన్నాయి. వైర‌స్ నుంచి 476378 మంది కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా వైర‌స్ (India Coronavirus) వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 21129గా (coronavirus deaths) ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

Advertisement

Kulbhushan Jadhav Case: మరణశిక్షను పున:పరిశీలించాలనే పిటిషన్‌ను తిరస్కరించిన కుల్భూషణ్ జాదవ్, క్షమాభిక్ష దరఖాస్తు పైనే తదుపరి చర్యలు తీసుకోవాలని కోరిన జాదవ్

Hazarath Reddy

కుల్భూషణ్ జాదవ్ తన మరణశిక్ష మరియు శిక్షను సమీక్షించి, పున పరిశీలించమని పిటిషన్ దాఖలు చేయడానికి నిరాకరించారని పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్ అదనపు అటార్నీ జనరల్ సమీక్ష కోసం పిటిషన్ దాఖలు చేయడానికి జాదవ్ను (Kulbhushan Jadhav Case) ఆహ్వానించారని, అయితే అతను నిరాకరించాడు మరియు బదులుగా తన పెండింగ్ లో ఉన్న ప్లీతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడని పాక్ (Pakistan) తెలిపింది.

India Coronavirus Report: ఇరవై వేలు దాటిన కరోనా మరణాలు, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 22,752 కోవిడ్-19 కేసులు నమోదు, దేశంలో 7,42,417కి చేరిన మొత్తం కరోనా కేసుల సంఖ్య

Hazarath Reddy

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 22,752 తాజా పాజిటివ్‌ కేసులు (India Coronavirus Report) వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,42,417కి ఎగబాకింది. మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో 482 మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 20,642కి పెరిగింది. కరోనా వైరస్‌ నుంచి కోలుకుని 4,56,830 మంది డిశ్చార్జి అయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 2,64,944 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది. కోవిడ్‌-19 విజృంభణ కొనసాగుతుండటంతో అధికారులు కరోనా నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేశారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,62,679 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. ఇప్పటివరకూ దేశంలో 1,04,73,771 కరోనా టెస్టులు నిర్వహించారు

US ICE: విదేశీ విద్యార్థులకు దిమ్మతిరిగే షాకిచ్చిన అమెరికా, ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించే స్కూళ్లలో ప్రవేశం పొందే విద్యార్థలకు నో వీసా, స్పష్టం చేసిన యుఎస్ ఐసీఈ

Hazarath Reddy

అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు (Students In US) భారీషాక్ లాంటి వార్తే ఇది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు విద్యాసంస్థలు మొగ్గు చూపినట్లయితే విదేశీ విద్యార్థులు అమెరికా (America) విడిచి వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అదే విధంగా కొత్తగా విద్యార్థి వీసాలు (US Study Visa) జారీ చేయబోమని పేర్కొంది. వచ్చే విద్యా సంవత్సరానికి గానూ పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు నిర్ణయించిన స్కూళ్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వీసా జారీచేయబోమని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) (US Immigration and Custom Enforcement) స్పష్టం చేసింది.

Draft Expat Quota Bill: ఎడారి దేశంలో భారతీయుల ఘోష, కువైట్‌లో 8 లక్షల మంది ఇండియన్ల పాలిట శాపం కానున్న ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లు, ఆమోదం పొందితే దేశం వదలాల్సిందే

Hazarath Reddy

ఎడారి దేశం కువైట్‌లోని భారతీయులకు (Indians) పెద్ద ముప్పు వచ్చిపడింది. దేశ జనాభాలో పెరిగిపోతున్న విదేశీయులను తగ్గించుకునేందుకు ఆ దేశ పార్లమెంటరీ కమిటీ ఓ ముసాయిదా చట్టాన్ని తీసుకువచ్చింది. కువైట్‌లో బయటి దేశాల వ్యక్తుల సంఖ్యలను తగ్గించుకునేందుకు తీసుకొచ్చిన ‘ప్రవాసీ కోటా’ ముసాయిదా బిల్లుకు (Draft Expat Quota Bill) కువైట్‌ జాతీయ శాసనసభ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో మన దేశానికి చెందిన దాదాపు 8లక్షల మంది పనులు లేక వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Coronavirus Outbreak: కరోనావైరస్‌పై కొత్త ట్విస్టు, ఈ వైరస్ గాలి ద్వారా సోకుతుందని నిర్ధారించిన సైంటిస్టులు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాసిన 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు

Hazarath Reddy

కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందనే (Coronavirus Outbrea) వాదనలు వైరస్ పుట్టినప్పటి నుండి వస్తూనే ఉన్నాయి. అయితే అలాంటిదేమీ లేదంటూ డబ్ల్యూహెచ్‌వో (WHO) ఆ వార్తలను కొట్టిపారేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు కరోనా వైరస్‌ గాలి ద్వారా (Coronavirus can be transmitted through air) ఇతరులకు సోకుతుందనేందుకు ఆధారాలున్నాయని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక లేఖ రాశారు.

India’s Coronavirus: ఆమెను రేప్ చేశాడు, 60 మంది పోలీసులను క్వారంటైన్‌కి పంపాడు, దేశంలో 7 లక్షలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య, దేశంలో కోటి దాటిన నిర్థారణ పరీక్షలు

Hazarath Reddy

భార‌త్‌లో కోవిడ్-19 వైర‌స్ పాజిటివ్ కేసుల (India’s Coronavirus) సంఖ్య ఏడు ల‌క్ష‌లు దాటింది. దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 22,252 కేసులు న‌మోదు అయ్యాయి. 24 గంట‌ల్లోనే దేశ‌వ్యాప్తంగా 467 మంది మ‌ర‌ణించారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య (India's Coronavirus Tally) 7,19,665కి చేరుకున్న‌ది. దీంట్లో 2,59,557 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 4,39,948 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు.

India China Standoff: చైనా భయపడిందా? రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్లిన చైనా బలగాలు, చైనా విదేశాంగ మంత్రితో అజిత్ ధోవ‌ల్ చర్చలు

Hazarath Reddy

భారత్, చైనా దేశాలకు వ్యూహాత్మక పాయింట్ కు అత్యంత కీలకమైన గల్వాన్‌ లోయ నుంచి చైనా బలగాలు (China Begins De-Escalation) వెనక్కి వెళ్లాయి. గల్వాన్‌ లోయ (Galwan Valley), సహా హాట్‌స్ప్రింగ్స్‌, లద్దాఖ్‌ ప్రాంతాల నుంచి నుంచి చైనా బలగాలు దాదాపు కిలోమీటరున్నర మేర వెనక్కి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే విధంగా అక్కడ చేపట్టిన నిర్మాణాలను కూడా తొలగిస్తున్నట్ల పేర్కొన్నాయి. ఇందుకు ప్రతిగా భారత బలగాలు కూడా వెనక్కి మళ్లాయని.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా ‘బఫర్‌ జోన్‌’ ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి.

Bubonic Plague: చైనాలో మళ్లీ కొత్తగా బుబోనిక్‌ ప్లేగు, ఈ వైరస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? మంగోలియాపై అప్పుడే పంజా విసురుతున్న బుబోనిక్‌ ప్లేగు వైరస్

Hazarath Reddy

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో (China Virus) వరుసగా వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. ప్రపంచానికి కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. మొన్న కరోనా వైరస్ కల్లోలం (Coronavirus Pandemic) ఇంకా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. ఆ కల్లోలంలో ఈ మధ్య కొత్తగా G-4 అనే వైరస్ తమ దేశంలో ఉన్నట్లు చైనా పరిశోధకులు తేల్చి చెప్పారు. ఈ రెండు మరచిపోకముందే మళ్లీ బుబోనిక్‌ ప్లేగు (Bubonic Plague) కేసులు చైనాతో పాటు ప్రపంచానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

Advertisement

India Coronavirus Update: ఏడు లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, ర‌ష్యాను వెన‌క్కు నె‌ట్టేసిన‌ భార‌త్‌, కొత్తగా దేశాన్ని కలవరపెడుతున్న రాజస్థాన్, ప్రపంచవ్యాప్తంగా కోటి 15 లక్షలు దాటిన కరోనా కేసులు

Hazarath Reddy

దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో సుమారు 25 వేల‌ పాజిటివ్‌ కేసులు (India Coronavirus Update) న‌మోద‌వ‌గా 613 మంది మ‌ర‌ణించార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,73,165కి చేరింది. అయితే అదేరోజు సాయంత్రం నాటికి మ‌రిన్ని కేసులు వెలుగు చూడ‌టంతో మొత్తం కేసుల సంఖ్య 6.9 ల‌క్ష‌లుగా (India Coronavirus Report) న‌మోదైంది. దీంతో 6.8 ల‌క్ష‌ల కేసులున్న‌ ‌ర‌ష్యాను (Russia) వెన‌క్కునెట్టి ప్ర‌పంచంలో క‌రోనా ప్ర‌భావిత‌ జాబితాలో భార‌త్ (India) మూడో స్థానానికి ఎగ‌బాకింద‌ని అమెరికాలోని (America) జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ వెల్ల‌డించింది.అమెరికా(28 ల‌క్ష‌లు), బ్రెజిల్(15 ల‌క్ష‌లు) త‌ర్వాత స్థానంలో భార‌త్ నిలిచింది.

PM Modi Speech in Ladakh: భారత్ బలమేంటో ప్రపంచానికి తెలుసు, లడఖ్‌ భారత్‌లో అంతర్భాగమే, సైనికులను చూసి దేశం గర్వపడుతోంది, బార్డర్లో సైనికుల్లో ఉత్తేజాన్ని నింపిన ప్రధాని నరేంద్ర మోదీ

Hazarath Reddy

భారత్‌-చైనాల మధ్య సరిహద్దు వివాదం (India-China border tensions) నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అనూహ్యంగా లడఖ్‌లో పర్యటించి సైనికుల్లో ఉత్తేజం నింపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ (PM Modi Speech in Ladakh) పరోక్షంగా చైనాపై విరుచుకుపడ్డారు. బ‌ల‌హీనంగా ఉన్నవారెప్పుడూ శాంతిని కాంక్షించ‌ర‌ని, శాంతి కావాలంటే ధైర్యం చాలా ముఖ్య‌మైంద‌ని ప్ర‌ధాని అన్నారు. ప్ర‌పంచ యుద్ధాల స‌మ‌యంలోనైనా, శాంతి స‌మ‌యంలోనైనా (Peace And Humanity), అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మ‌న సైనికుల ధైర్యాన్ని ప్ర‌పంచం చూసింద‌ని, శాంతి కోసం కూడా మ‌న సైనికులు ( Indian soldiers) ప‌నిచేశార‌ని మోదీ అన్నారు. ఉత్త‌మ‌మైన మా‌నవ విలువ‌ల కోసం మ‌నం ప‌నిచేశామ‌ని ప్ర‌ధాని తెలిపారు.

COVID-19 in US: అమెరికాలో ఒక్కరోజే 50 వేలకు పైగా కొత్త కేసులు, బ్రెజిల్‌లో 60 వేలు దాటిన కోవిడ్-19 మృతుల సంఖ్య, ప్రపంచవ్యాప్తంగా కోటి దాటిన కరోనా కేసులు

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికాకు కరోనా విశ్వరూపం (COVID-19 in US) చూపిస్తోంది. బుధవారం ఒక్కరోజే 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో(గురువారం) రికార్డు స్థాయిలో కొత్తగా 55 వేల కోవిడ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు (coronavirus Cases) ఏ దేశంలో కూడా నమోదు కాలేదని రాయిటర్స్‌ సంస్థ పేర్కొంది. అంతేగాక గత రెండు వారాల నుంచి అమెరికాలో రోజుకు 22 వేల కొత్త కేసులు నమోదవ్వగా 3 రోజుల నుంచి రెట్టింపుతో 40 వేలకుపైగా కొత్త కేసులు రికార్డు అవుతున్నాయి.

COVID-19 Vaccine Update: హైదరాబాద్ నుంచే కరోనాకు తొలి విరుగుడు మందు, ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి.., భార‌త్ బ‌యోటెక్ వ్యాక్సిన్ మీద క్లినికల్‌ టెస్టులు వేగవంతం చేసిన ఐసీఎంఆర్‌

Hazarath Reddy

ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న కరోనావైరస్ కు విరుగుడు మందు హైదరాబాద్ ( Hyderabad) నుంచే రానుందా..అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఔషధ కంపెనీలన్నీ వైరస్‌ విరుగుడును కనిపెట్టే ప్రకియలో నిమగ్నమయ్యాయి. అయితే అవేమి ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆగస్ట్‌ 15 కల్లా వ్యాక్సిన్‌ను (COVID-19 Vaccine Update) విడుదల చేస్తామని చల్లని కబురు చెప్పింది.

Advertisement

PM Narendra Modi in Leh: భారత సైనికుల మధ్య అనూహ్యంగా ప్రధాని మోదీ, సరిహద్దులో ఉద్రిక్తతల సమయంలో లడఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన, ప్రధాని వెంట బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవణే

Hazarath Reddy

భారత్‌-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడఖ్‌లో ఆకస్మికంగా పర్యటించారు. శుక్రవారం ఉదయం సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి లేహ్‌కు (PM Narendra Modi in Leh) చేరుకున్నారు. సైనిక బలగాల నైతిక స్థైర్యం పెంచేందుకు ఆయనే స్వయంగా లడక్‌లో పర్యటిస్తున్నారు. త్రిదళాధిపతి బిపిన్ రావత్ (CDS General Bipin Rawat), ఆర్మీ చీఫ్ నరవణేతో (Naravane) కలిసి ఆయన లడక్ వెళ్లారు.

India Coronavirus: మాస్క్ ఉన్నా కరోనాతో డేంజరే, దేశంలో రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో 20,903 కొత్త కేసులు నమోదు, 6,25,439కు చేరిన మొత్తం కేసులు, ప్రపంచ వ్యాప్తంగా కోటి దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య

Hazarath Reddy

దేశంలో మహమ్మారి కరోనా (coronavirus Pandemic) కల్లోలాన్ని రేపుతోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో వైరస్‌ విజృంభిస్తున్నది .తాజాగా రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో 20,903 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు (coronavirus cases) నమోదైనట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించింది. దేశంలో కోవిడ్‌ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో పాజిటివ్‌ కేసులు (India Coronavirus) నమోదవ్వడం ఇదే తొలిసారి. కొత్త పాజిటివ్‌ కేసులతో కలుపుకొని దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6,25,439కు చేరింది. అంతేకాకుండా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఈ మహమ్మారి కారణంగా 379 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 18,213కు చేరింది.

India to Buy 33 Fighter Jets: సరిహద్దులో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు, 33 యుద్ధ విమానాలు కొనుగోలుకు భారత్ పచ్చజెండా, హోంమంత్రి లద్దాఖ్ పర్యటన రద్దు

Hazarath Reddy

చైనాతో సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో (India-China Face Off) భారత్ భారీ ఎత్తున ఆయుధ సమీకరణ చేపడుతోంది. తాజాగా డిఫెన్స్‌ ఎక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాన్స్ నుంచి అదనంగా రాఫెల్ యుద్ధ విమానాలు కోరుతున్న భారత్, తాజాగా రష్యా నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని (India To Buy 33 Fighter Jets) నిర్ణయించింది. ఇటు, దేశీయంగా తయారైన ఆయుధ వ్యవస్థలను కూడా అమ్ములపొదిలో చేర్చుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ (Defence Ministry) పచ్చ జెండా ఊపింది. రూ.38,900 కోట్ల విలువైన యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాలు, రక్షణ వ్యవస్థల కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది.

Ravi Shankar Prasad: చైనాపై భారత్ డిజిటల్ స్ట్రైక్, చైనీస్ యాప్స్ బ్యాన్‌ను డిజిటల్ స్ట్రైక్‌గా అభివర్ణించిన కేంద్ర ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్

Hazarath Reddy

చైనా ఇండియా సరిహద్దు ప్రాంతం ల‌డ‌క్‌లో భారత్ సైనికుల‌పై చైనా క్రూరమైన దాడి చేసిన నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం (India Govt) దానికి ప్ర‌తీకారంగా డ్రాగ‌న్‌ దేశానికు చెందిన 59 యాప్‌ల‌ను నిషేధించిన విష‌యం తెలిసిందే. దీనిపై కేంద్ర ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ (Union Minister Ravi Shankar Prasad) స్పందించారు. చైనా యాప్‌ల నిషేధాన్ని ఆయ‌న డిజిటల్ స్ట్రయిక్‌గా (Banning Chinese apps a digital strike) అభివ‌ర్ణించారు. దేశ ప్ర‌జ‌ల డేటాను సుర‌క్షితంగా ఉంచేందుకే చైనా యాప్‌ల‌ను బ‌హిష్క‌రించామ‌ని, ఇది డిజిట‌ల్ దాడి అని ఆయ‌న అన్నారు. ప‌శ్చిమ బెంగాల్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement
Advertisement