World
India Coronavirus: మాస్క్ ఉన్నా కరోనాతో డేంజరే, దేశంలో రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో 20,903 కొత్త కేసులు నమోదు, 6,25,439కు చేరిన మొత్తం కేసులు, ప్రపంచ వ్యాప్తంగా కోటి దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య
Hazarath Reddyదేశంలో మహమ్మారి కరోనా (coronavirus Pandemic) కల్లోలాన్ని రేపుతోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో వైరస్‌ విజృంభిస్తున్నది .తాజాగా రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో 20,903 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు (coronavirus cases) నమోదైనట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించింది. దేశంలో కోవిడ్‌ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో పాజిటివ్‌ కేసులు (India Coronavirus) నమోదవ్వడం ఇదే తొలిసారి. కొత్త పాజిటివ్‌ కేసులతో కలుపుకొని దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6,25,439కు చేరింది. అంతేకాకుండా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఈ మహమ్మారి కారణంగా 379 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 18,213కు చేరింది.
India to Buy 33 Fighter Jets: సరిహద్దులో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు, 33 యుద్ధ విమానాలు కొనుగోలుకు భారత్ పచ్చజెండా, హోంమంత్రి లద్దాఖ్ పర్యటన రద్దు
Hazarath Reddyచైనాతో సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో (India-China Face Off) భారత్ భారీ ఎత్తున ఆయుధ సమీకరణ చేపడుతోంది. తాజాగా డిఫెన్స్‌ ఎక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాన్స్ నుంచి అదనంగా రాఫెల్ యుద్ధ విమానాలు కోరుతున్న భారత్, తాజాగా రష్యా నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని (India To Buy 33 Fighter Jets) నిర్ణయించింది. ఇటు, దేశీయంగా తయారైన ఆయుధ వ్యవస్థలను కూడా అమ్ములపొదిలో చేర్చుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ (Defence Ministry) పచ్చ జెండా ఊపింది. రూ.38,900 కోట్ల విలువైన యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాలు, రక్షణ వ్యవస్థల కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది.
Ravi Shankar Prasad: చైనాపై భారత్ డిజిటల్ స్ట్రైక్, చైనీస్ యాప్స్ బ్యాన్‌ను డిజిటల్ స్ట్రైక్‌గా అభివర్ణించిన కేంద్ర ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్
Hazarath Reddyచైనా ఇండియా సరిహద్దు ప్రాంతం ల‌డ‌క్‌లో భారత్ సైనికుల‌పై చైనా క్రూరమైన దాడి చేసిన నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం (India Govt) దానికి ప్ర‌తీకారంగా డ్రాగ‌న్‌ దేశానికు చెందిన 59 యాప్‌ల‌ను నిషేధించిన విష‌యం తెలిసిందే. దీనిపై కేంద్ర ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ (Union Minister Ravi Shankar Prasad) స్పందించారు. చైనా యాప్‌ల నిషేధాన్ని ఆయ‌న డిజిటల్ స్ట్రయిక్‌గా (Banning Chinese apps a digital strike) అభివ‌ర్ణించారు. దేశ ప్ర‌జ‌ల డేటాను సుర‌క్షితంగా ఉంచేందుకే చైనా యాప్‌ల‌ను బ‌హిష్క‌రించామ‌ని, ఇది డిజిట‌ల్ దాడి అని ఆయ‌న అన్నారు. ప‌శ్చిమ బెంగాల్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.
PM Modi Quits Weibo: చైనా ట్విట్టర్‌ను మూసేసిన ప్రధాని మోదీ, వీబోలో పాత పోస్టులను డిలీట్ చేస్తున్న అధికారులు, అకౌంట్‌ డీయాక్టివేట్‌ కావడానికి సమయం పట్టే అవకాశం
Hazarath Reddyచెనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించి కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేపట్టిన∙నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా సామాజిక మాధ్యమమైన వీబోని వీడాలని (PM Modi Quits Weibo) నిర్ణయించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ బుధవారం మొదలైంది. చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌ వీబో (chinese social media website weibo) లో పీఎం మోడీ 2015 నుంచి కొనసాగుతున్నారు. అయితే చైనా ట్విట్టర్‌గా పిలిచే వీబోలో ఉండే వీఐపీలు అకౌంట్‌ మూసివేయడానికి జరిగే ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది.
Myanmar Jade Mine Tragedy: మ‌ట్టిచ‌రియ‌లు విరిగిపడి 50 మందికి పైగా సజీవ సమాధి, మయాన్మార్‌ రత్నాల గనిలో విషాద ఘటన, రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది
Hazarath Reddyమయాన్మార్‌ దేశంలోని పచ్చ రత్నాల గనిలో ఘోరం ప్రమాదం (Myanmar Jade Mine Tragedy) జరిగింది. మ‌య‌న్మార్‌లో మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో గనిలోకి ఒక్కసారిగా భారీగా బురద, రాళ్లు వచ్చి చేరడంతో కార్మికులు అక్కడే 50 మందికి పైగా సజీవ సమాధి(Myanmar Jade Mine Landslide) అయిపోయారు. కచీన్ రాష్ట్రంలోని పకాంత్ ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.
COVID-19 in India: వంద రోజులు, ఆరు లక్షలకు పైగా కేసులు, దేశంలో గత 24 గంటల్లో 17834 కోవిడ్-19 కేసులు, 434 మరణాలు, కరోనా కేసుల్లో రష్యాకు చేరువలో నిలిచిన భారత్
Hazarath Reddyదేశంలో కరోనా వ్యాప్తిని నిలువరించడానికి లాక్‌డౌన్‌ ( India Lockdown) విధించి నేటితో వంద రోజులు పూర్తయ్యింది. దేశంలో ఇప్పుడు కోవిడ్-19 కేసులు (COVID-19 in India) ఆరు లక్షల మార్కును దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 19,148 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 434 మంది మరణించారు, దీంతో దేశంలో కరోనా సోకినవారి సంఖ్య 6,04,641కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 17834కు (Coronavirus Deaths) పెరిగింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడినవారిలో 3,59,860 మంది బాధితులు కోలుకోగా, 2,26,947 మంది చికిత్స పొందుతున్నారు.
Coronavirus in India: కరోనా కేసుల్లో ఢిల్లీని దాటేసిన తమిళనాడు, దేశంలో తాజాగా రికార్డు స్థాయిలో 507 మంది మృతి, 5 లక్షల 85 వేలు దాటిన కోవిడ్-19 కేసులు
Hazarath Reddyకరోనావైరస్‌ విజృంభణ దేశంలో (Coronavirus in India) నానాటికీ పెరుగుతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు (India Coronavirus) నమోదవుతుండగా మరణాల సంఖ్య కూడా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 18,653 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, వైరస్‌ బారినపడి 507 మంది మృతి (Coronavirus Deaths) చెందారు. దేశంలో కోవిడ్‌ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో మరణాలు సంభంవించడం ఇదే తొలిసారి.
India Coronavirus: పెళ్లయిన 2 రోజులకే వరుడిని కరోనా కాటేసింది, బీహార్‌లో పెళ్లికి వచ్చిన వారిలో 95 మందికి కోవిడ్-19, దేశంలో తాజాగా 18,522 పాజిటివ్ కేసులు నమోదు
Hazarath Reddyఇండియాలో ఇవాళ అత్య‌ధికంగా క‌రోనా వైర‌స్ (Coronavirus) కేసులు పెరిగాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో 18522 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. ఒక్క రోజులోనే దేశంలో 418 మంది వైర‌స్ ( Coronavirus Deaths) బారిన‌ప‌డి మ‌ర‌ణించారు. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 5,668,40గా ఉన్న‌ది. దీంట్లో 2,15,125 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 3,34,822 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 16,893గా ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది.
Ban on Chinese Apps: భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం, టిక్‌టాక్ సహా మొత్తం 59 చైనీస్ యాప్‌లపై నిషేధం, రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
Team Latestlyభారత్ లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుని, మంచి మార్కెట్ ను ఏర్పర్చుకున్న టిక్‌టాక్, వీచాట్, యూసి బ్రౌజర్‌లతో సహా 59 చైనీస్ యాప్స్ ను కేంద్రం బ్యాన్ చేసింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.
Pakistan Stock Exchange Attack: పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై గ్రేనేడ్ దాడి, ఇద్ద‌రు మృతి, ముగ్గురికి గాయాలు, నలుగురు ఉగ్రవాదులు హతం, మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం
Hazarath Reddyపాకిస్తాన్‌లో ఉగ్రమూకలు (Terror attack) మరోసారి రెచ్చిపోయాయి. దాయాది దేశంలోని క‌రాచీలో ఉన్న స్టాక్ మార్కెట్ బిల్డింగ్ వ‌ద్ద ఈ రోజు గ్రేనేడ్ దాడి (Pakistan Stock Exchange Attack) జరిగింది. ఇవాళ ఉదయం నలుగురు ఉగ్రవాదులు కరాచీలోని స్టాక్ ఎక్ఛేంజ్ భవనంలో చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు (Terror attack in Karachi) జరిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతిచెంద‌గా మ‌రో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. కాల్పులకు తెగబడిన అనంతరం ఉగ్రవాదులు పాకిస్తాన్ స్టాక్ ఎక్ఛేంజ్ భవనంలోనే నక్కారు.
COVID19 Update: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో సుమారు 20 వేల పాజిటివ్ కేసులు నమోదు, భారత్‌లో 5,28,859కు చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి పైగా సోకిన వైరస్
Team Latestlyఇక ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య గత రాత్రే కోటి దాటిందని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. గత ఏడాది డిసెంబర్‌లో చైనా దేశంలోని వుహాన్‌ నగరంలో పుట్టిన ఈ భయంకర వైరస్, సుమారు ఏడు నెలల్లోనే ప్రపంచమంతా విస్తరించి ఎవరూ ఊహించని భయంకరమైన మైలురాయిని చేరుకుంది...
COVID19 in India: భారత్‌లో 5 లక్షలు దాటిన కోవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో అత్యధికంగా 18,552 కేసులు నమోదు, ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి చేరువైన కోవిడ్ బాధితుల సంఖ్య
Team Latestlyప్రపంచవ్యాప్తంగా 9.9 మిలియన్లకు పైగా కరోనా బారిన పడ్డారు. మరొక్కరోజులోనే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య ఒక కోటికి చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ సోకిన వారిలో 5.3 మిలియన్లకు పైగా కోలుకున్నారని, 496,800 మందికి పైగా మరణించారని...
International Flights Suspended: అంతర్జాతీయ విమాన సర్వీసులపై మరోసారి నిషేధం, జూలై 15 అర్ధరాత్రి వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు, ఉత్తర్వులు జారీ చేసిన డీజీసీఏ
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై మరోసారి నిషేధాన్ని (International Flights Suspended) పొడిగించింది. జూలై 15 అర్ధరాత్రి వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను ( International Commercial Passenger Services) రద్దు చేస్తున్నట్టు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌( DGCA) ప్రకటించింది. ఈ మేరకు డీజీసీఏ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే కార్గో సర్వీసులు మాత్రం యథావిథిగా కొనసాగుతాయని డీజీసీఏ స్పష్టం చేసింది. ప్యాసింజర్ సర్వీసులు రద్దవుతాయని తెలిపింది.
COVID-19 in India: కరోనా కల్లోలానికి తిరునల్వేలి హల్వా యజమాని ఆత్మహత్య, దేశంలో రికార్డు స్థాయిలో 17,296 కేసులు నమోదు, 5 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు
Hazarath Reddyదేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య (COVID-19 in India) అంతకంతకూ పెరుగుతూ పోతోంది. గడిచిన 24 గంటలలో అత్యధికంగా 17,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా 407 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల (Coronavirus Pandemic) సంఖ్య 4,90,401కు చేరుకోగా, మొత్తం 15,301 మంది (Coronavirus Death Toll) మరణించారు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసుల సంఖ్య 1,89,463గా ఉంది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 2,85,636 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.
India Coronavirus: ఒక్కరోజే రికార్డు స్థాయిలో 16,922 కేసులు, దేశంలో 4,73,105కు చేరిన కోవిడ్-19 కేసులు సంఖ్య, నెల రోజుల్లోనే మూడు లక్షల యాభైవేల కేసులు నమోదు
Hazarath Reddyభారత్‌లో కరోనా కేసులు (Coronavirus) రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,922 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూడగా.. 418 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,07,871 మందికి పరీక్షలు చేశామని, అందులో 16922 మంది కరోనా పాజిటివ్‌లుగా (COVID-19 Cases) నిర్ధారణ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ఒక్కరోజులోనే దాదాపు 17వేలకు చేరువలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.
India's Coronavirus Report: ఉగ్రరూపం దాల్చిన కరోనా, దేశంలో ఒక్కరోజే 465 మంది మృతి, ఇండియాలో నాలుగు లక్షల యాభై వేలు దాటిన కోవిడ్-19 కేసులు
Hazarath Reddyదేశంలో మహమ్మారి కరోనా వైరస్‌ ( Coronavirus Outbreak) ఉగ్రరూపం దాల్చుతోంది. ఇండియాలో రోజురోజుకూ భారీగా పాజిటివ్‌ కేసులు (India's Coronavirus Report), మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు (New Cases in India) నమోదయ్యాయి. బుధవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 15968 పాజిటివ్‌ కేసులు నిర్దారణ కాగా.. 465 మంది మృత్యువాతపడ్డారు.
Haj 2020 Update: ఈ సారి హ‌జ్ యాత్ర‌కు అనుమతి లేదు, వారి డ‌బ్బును తిరిగి చెల్లించ‌నున్న‌ట్లు తెలిపిన కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ న‌ఖ్వీ
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్(Global Coronavirus) కల్లోలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో (India Coronavirus) అయితే ఇది విశ్వరూపం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భార‌త్ నుంచి హ‌జ్ యాత్ర‌కు (Haj 2020 Update) వెళ్లే వారికి అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ న‌ఖ్వీ తెలిపారు.
US Suspends H1B&US Work Visas: అమెరికా కీలక నిర్ణయం, విదేశీ వ‌ర్క‌ర్ల‌కు ఇచ్చే వీసాల‌ు రద్దు, అమెరికా ఎన్నికలపై కొనసాగుతున్న సస్పెన్స్
Hazarath Reddyఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌ 1బీ వీసాను (H1B Visa) తాత్కాలికంగా రద్దు చేయాలని ఆదేశించారు. విదేశీ వ‌ర్క‌ర్ల‌కు ఇచ్చే వీసాల‌ను అమెరికా ప్ర‌భుత్వం (US Govt) ర‌ద్దు చేయడంతో ఈ వీసాల ర‌ద్దు ప్ర‌భావం సుమారు 5,25000 మందిపై ప‌డ‌నున్న‌ది. వీసాలు కోల్పోతున్న‌వారిలో ఎక్కువ‌ శాతం హై స్కిల్డ్ టెక్నిక‌ల్ వ‌ర్క‌ర్లు, నాన్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ సీజ‌న‌ల్ హెల్ప‌ర్లు, టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు.
India Coronavirus: దేశంలో రికార్డు స్థాయిలో 24 గంటల్లో 14,933 పాజిటివ్ కేసులు నమోదు, దేశ వ్యాప్తంగా 4,40,215కి చేరిన కేసులు సంఖ్య, ప్రపంచ వ్యాప్తంగా 91 లక్షలు దాటిన కేసులు
Hazarath Reddyదేశంలో కరోనా పాజిటివ్ కేసుల (India Coronavirus) సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,933 పాజిటివ్ కేసులు (coronavirus cases) నమోదు కాగా.. వైరస్‌ బారినపడి 312 మంది మృతి చెందారు. దేశంలో కరోనా వైరస్‌ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,40,215కి చేరింది. మరణాల సంఖ్య 14 వేలు దాటింది.
Maharashtra Police: మహారాష్ట్రలో 4,103 మంది పోలీసులకు కరోనా, 24 గంటల్లో 55 మంది పోలీసులకు కోవిడ్-19 పాజిటివ్, మొత్తం 48 మంది కరోనాతో మృతి
Hazarath Reddyమహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు(2020 Coronavirus Pandemic in India) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ అక్కడ పోలీసుల్ని (Maharashtra Police) హడలెత్తిస్తోంది. గడిచిని 24 గంటల్లో 55 మందికి (New COVID-19 Cases) కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో కొవిడ్‌-19తో బాధపడుతున్న పోలీసుల సంఖ్య 4,103కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 48 మంది పోలీసులు చనిపోయారు.