World

COVID-19 Vaccine: కరోనాను ఖతం చేసే వ్యాక్సిన్ ఇదేనా?, శుభవార్త చెప్పిన ఇటలీ, ఎలుకలపై కరోనా వ్యాక్సీన్ ప్రయోగం విజయవంతమయిందని ప్రకటన, వేసవి తర్వాత క్లినికల్ ట్రయల్స్

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 (COVID-19) మరణ మృదంగం మోగుతున్న వేళ ఇటలీ ప్రభుత్వం (Italy Govt) శుభవార్త చెప్పింది. ప్రపంచంలోనే తొలిసారిగా మానవులపై పనిచేయగల కరోనా వైరస్ వ్యాక్సీన్‌ను (COVID-19 Vaccine) అభివృద్ధి చేసినట్టు ప్రకటించింది. కరోనా వైరస్‌కు తాము వ్యాక్సిన్ తయారు చేసినట్టు ఇటలీ చేసిన ప్రకటనతో ప్రపంచం మొత్తం అటువైపు దృష్టి సారించింది. ఇటలీ ఈ ప్రకటన చేయగానే కరోనా బాధిత దేశాల్లో ఆశలు రేకెత్తాయి. టకీస్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించగా అద్భుతమైన ఫలితాలు కనిపించినట్టు న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

Coronavirus In India: ఆరు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం, 50 వేలకు చేరువలో కరోనా కేసులు, దేశ వ్యాప్తంగా 1,694 మంది మృతి, 33,514 కరోనా యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

దేశంలో కరోనా(COVID-19 In India) కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 2,958 కరోనా కేసులు నమోదు కాగా, 126 మంది మృతిచెందారు. దీంతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,391కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 14,182 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1,694 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 33,514 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో కోలుకుంటున్న వారు 28.71 శాతం అని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Google Doodle Games: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 8, నేటి గూగుల్ డూడుల్ గేమ్ హాలోవీన్ 2016, ఈ గేమ్ గురించి ఓ సారి తెలుసుకుందాం

Hazarath Reddy

గతంలో జనాదరణ పొందిన Google డూడుల్‌లతో ఆడుతూ కాలక్షేపం చేయండి. హాలోవీన్ (2016) గేమ్‌ను ఈ రోజు డూడుల్‌ కింద గూగుల్ అందించింది. ఈ రోజు గూగుల్ డూడుల్ గేమ్ హాలోవీన్ (Halloween 2016), 2016లో వచ్చిన గేమ్ గురించి ఓ సారి తెలుసుకోండి. ఇప్పటిదాకా 8 గేమ్ లు వచ్చాయి. అవి వరసగా కోడింగ్, క్రికెట్, ఫిషింగర్, రాక్‌మోర్, గార్డెన్ గ్నోమ్స్, స్కోవిల్ లొటరియా, తాజాగా హాలోవీన్ . ఈ రోజు వచ్చిన హాలోవీన్ (Halloween) గేమ్ చరిత్ర గురించి ఓ సారి తెలుసుకుందాం.

COVID19 Vaccine: కోవిడ్-19కు వాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చు! ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల హెచ్చరిక, వైరస్‌తోనే ఎలా జీవించాలో సమాజం నేర్చుకోవాలని సూచన

Team Latestly

ప్రతిచోటా, ప్రతీ సమాజం కరోనావైరస్ ముప్పు నుండి నిరంతరం తమను తామే రక్షించుకోగలిగే పరిస్థితులకు అలవాటుపడాలి. వైరస్ తో సహజీవనం చేస్తూనే సామాజిక జీవనం గడపాలి, అదే సమయంలో ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ చేసుకోవాలి.....

Advertisement

Indian Nationals Stranded Abroad: విదేశాల్లో భారతీయులు విలవిల, మే 7 నుంచి దశల వారీగా విమానాలు,నౌకల ద్వారా స్వదేశానికి తరలింపు, 14 రోజులపాటు పేమెంట్‌ ప్రాతిపదికన క్వారంటైన్‌లోకి..

Hazarath Reddy

కోవిడ్‌-19 లాక్‌డౌన్‌లతో (Covid-19 Lockdown) విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను (Indian Nationals Stranded Abroad) మే 7 నుంచి దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) ఏర్పాట్లు చేస్తోంది. వీరందరినీ దశలవారీగా విమానాలు, నౌకల ద్వారా స్వదేశానికి రప్పిస్తామని ప్రభుత్వం పేర్కొంది. దీనికోసం నిర్థిష్ట విధివిధానాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆయా దేశాల భారత రాయబార కార్యాలయాలు దేశానికి తిరిగివచ్చే భారత పౌరుల జాబితాలను సిద్ధం చేస్తాయి. అయితే స్వదేశానికి వచ్చేందుకు అయ్యే చార్జీలను ప్రయాణీకులే భరించాల్సి ఉంటుంది.

COVID-19: విదేశాల్లోని భారతీయుల కోసం బయలు దేరిన మూడు యుద్ధ నౌకలు, యుఎఈ, మాల్దీవుల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలింపు, వెల్లడించిన కేంద్ర రక్షణ శాఖ

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ (COVID-19 pandemic) విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో విదేశాల్లో చాలామంది భారతీయులు చిక్కుకుపోయారు. వీరంతా స్వదేశానికి వచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఇండియాకు (India) తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందులో భాగంగా ముందుగా మాల్దీవులు (Maldives), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో (UAE) చిక్కుకున్న భారతపౌరులను స్వదేశానికి తరలించడానికి భారత నావికాదళం మూడు నౌకలను (Three Ships Sent to Evacuate Indians) పంపించినట్లు కేంద్ర రక్షణ శాఖ ప్రతినిధి మంగళవారం వెల్లడించారు.

COVID-19 Pandemic: 24 గంటల్లో 195 మంది మృతి, దేశంలో 46 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య, దడపుట్టిస్తున్న మహారాష్ట్ర, ముంబైలో మే 17 వరకు 144 సెక్షన్

Hazarath Reddy

ఇండియాలో కరోనా మహమ్మారి (2020 Coronavirus Pandemic in India) తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3,900 కేసులు నమోదయ్యాయి. అలాగే 195 మరణాలు సంభవించాయి. భారతదేశంలో మొత్తం కొరోనావైరస్ కేసుల సంఖ్య 46,433 కు చేరుకుందని, ఇప్పటివరకు 1,568 మంది (Coronavirus deaths in india) మరణించారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల భారీన పడిన వారి సంఖ్య 3,645,342గా ఉంది.

African Swine Flu: కరోనాకు తోడయిన మరో వైరస్, ‘ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ’ ధాటికి 2500 పందులు మృతి, మ‌నుషుల‌కు పెద్ద‌గా ప్ర‌మాదం లేద‌ంటున్న ఎన్ఐహెచ్ఎస్ఎడి

Hazarath Reddy

దేశంలో కరోనా వైర‌స్ (Coronavirus) కల్లోలం మరచిపోకముందే మరో వైరస్ దేశంలోకి ఎంటరయింది. అస్సాంలో (Assam) తాజాగా మ‌రో వైర‌స్ వెలుగుచూసింది. ఆఫ్రిక‌న్ స్వైన్ ఫ్లూగా (African Swine Flu) పిలి‌చే ఈ వైర‌స్ తొలిసారిగా అస్సాంలో బ‌య‌ట‌ప‌డిందని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. భోపాల్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ( NIHSAD) ఈ వైర‌స్‌ను ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ (ఎఎస్ఎఫ్) అని ధృవీకరించిన‌ట్లు తెలిపింది. అయితే ఈ వైరస్ వల్ల మ‌నుషుల‌కు పెద్ద‌గా ప్ర‌మాదం లేద‌ని, దీనికి కోవిడ్‌తో ఎటువంటి సంబంధం లేద‌ని పేర్కొంది.

Advertisement

Coronavirus in India: దేశ వ్యాప్తంగా 11 వేల మందికి పైగా డిశ్చార్జ్, 42 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య, 1300 దాటిన మరణాలు, నేటి నుంచి అమల్లోకి లాక్‌డౌన్‌ 3.0

Hazarath Reddy

దేశంలో కరోనా మహమ్మారి (Coronavirus in India) ఉద్ధృతి కొనసాగుతున్నది. కేసుల సంఖ్య 42 వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 40,263కు చేరింది. మరోవైపు దేశంలో ఒక్కరోజే 83 మంది (Coronavirus Deaths) వైరస్‌ కారణంగా మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,373కుకు చేరినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. ఇప్పటి వరకు 11,706 మంది (coronavirus cases) కొవిడ్‌-19 బారి నుంచి కోలుకున్నారని, 29,453 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. మిగతా దేశాలతో పోల్చితే కొవిడ్‌-19 మరణాల రేటు భారత్‌లోనే తక్కువగా ఉన్నదని వెల్లడించింది.

Cops Test Corona Positive: పోలీస్ శాఖలో కరోనా కల్లోలం, ముంబై పోలీసుల్లో 100 మందికి పైగా కోవిడ్-19 పాజిటివ్, దేశ వ్యాప్తంగా 35 వేలు దాటిన కరోనావైరస్ కేసులు

Hazarath Reddy

ముంబై పోలీసు శాఖ‌లో (Mumbai Police) క‌రోనావైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే 100కి పైగా పోలీసులు కోవిడ్-19 వైర‌స్ భారిన ప‌డ్డారు. తాజాగా వ‌డాలా పోలీసు స్టేష‌న్ (Wadala police statio) ప‌రిధిలోని 9 మంది కానిస్టేబుల్స్‌కు కోవిడ్ (Cops Test Corona Positive) సోకిందని అధికార వర్గాలు వెల్లడించాయి. గురువారం నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో క‌రోనా పాజిటివ్ (Coronavirus) అని తేలడంతో వీరంతా ముంబైలోని గురునాన‌క్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు.వీరితో పాటు కుటుంస‌భ్యుల‌ను కూడా క్వారంటైన్‌లో ఉంచామ‌ని అధికారులు తెలిపారు.

Frist Plasma Therapy Die: ప్లాస్మా చికిత్స ఫెయిల్, మహారాష్ట్రలో తొలి మరణం నమోదు, ఐసీఎంఆర్ అనుమ‌తి ప్ర‌కార‌మే ప్లాస్మా చికిత్స చేశామన్న హారాష్ట్ర ఆరోగ్య‌శాఖ

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా కరోనావైరస్ పేషంట్ల కోసం ప్లాస్మా చికిత్సను ప్రయోగిస్తున్న సంగతి విదితమే. అయితే మ‌హారాష్ట్రలో ( Maharashtra) తొలిసారిగా ప్లాస్మా చికిత్స ప్ర‌యోగించిన 53 ఏళ్ల వ్య‌క్తి బుధ‌వారం అర్థ‌రాత్రి మ‌ర‌ణించారు. ఈ చికిత్స ఫెయిల్ కావడంతో మరణించారని (Frist Plasma Therapy Die) ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Coronavirus Outbreak in India: 35 వేలు దాటిన కరోనా కేసులు, కొత్తగా రెడ్, ఆరెంజ్ జోన్లను ప్రకటించిన కేంద్రం, దేశ వ్యాప్తంగా తగ్గిన రెడ్ జోన్ల సంఖ్య

Hazarath Reddy

భారత్‌లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య (Coronavirus Outbreak in India) పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,993 కరోనా కేసులు (Coronavirus cases in India) నమోదయ్యాయి. భారత్‌లో ఒక రోజు వ్యవధిలో నమోదైన కరోనా కేసుల్లో ఇదే అధికం. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,043కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) శుక్రవారం ఉదయం కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement

Coronavirus in Telangana: 45 రోజులు శిశువు కరోనాని జయించింది, దేశ చరిత్రలోనే ఇది తొలికేసు, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ 19 నుంచి కోలుకుని డిశ్చార్జి

Hazarath Reddy

తెలంగాణలో అద్భుతం జరిగింది. కరోనా నుంచి 45 రోజుల శిశువు (45-day old infant) కోలుకుని వైద్యలను ఆశ్చర్యపరిచింది. డాక్టర్లను సైతం కాటికి పంపిన కరోనావైరస్ ని 40 రోజుల శిశువు తరిమికొట్టడం దేశ చరిత్రలోనే ప్రధమంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అతి పిన్న వయస్కుడైన ఈ COVID-19 పేషెంట్ తెలంగాణ రాష్ట్రంలోని గాంధీ ఆస్పత్రి (Gandhi hospital in Hyderabad) నుండి కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

Karnataka Coronavirus: కరోనా ఎఫెక్ట్, నలుగురు మంత్రులు క్వారంటైన్‌లోకి , కర్ణాటకలో జర్నలిస్టుకి కోవిడ్-19, ఇప్పటికే స్వీయ నిర్భంధంలో గుజరాత్ సీఎం విజయ్ రూపాని

Hazarath Reddy

కర్ణాటకలో కరోనావైరస్ (Karnataka Coronavirus) చాపకింద నీరులా విస్తరిస్తోంది. అక్కడ తాజాగా ఒక జ‌ర్న‌లిస్టుకు (Journalist) క‌రోనా పాజిటివ్‌గా తేలడంతో ఇటీవ‌ల ఆ జ‌ర్న‌లిస్టు ఎవ‌రెవ‌రిని క‌లిశారో వారంద‌రినీ క్వారెంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు. జ‌ర్న‌లిస్టు క‌లిసిన‌ వారిలో ఆ రాష్ట్రానికి చెందిన న‌లుగురు మంత్రులు (Karnataka Ministers) కూడా ఉండ‌టంతో వారంతా ఇప్పుడు సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లారు. వీరిలో ఆ రాష్ర్ట ఉప ముఖ్య‌మంత్రి కూడా ఉన్నారు.

India Coronavirus Bulletin: ఇండియాలో ఆగని కరోనా ఘోష, 33 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదు, తమిళనాడులో 121మంది పిల్లలకు కరోనా పాజిటివ్

Hazarath Reddy

భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు (India Coronavirus Bulletin)పెరుగుతున్నాయో కాని తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో కరోనాతో 67 మంది ప్రాణాలు కోల్పోగా, 1,718 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) 33,050కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,074 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 8,325 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Coronavirus in Maharashtra: ఐసోలేషన్ నుండి పరార్, కరోనాతో 17 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరిన వృద్ధుడు, ఫ్యామిలీ అంతా క్వారంటైన్‌లోకి, పుణేలో ఘటన

Hazarath Reddy

డెభ్బై ఏళ్ల COVID-19 రోగి పూణేలోని బాలేవాడి ప్రాంతంలోని ఒక ఐసోలేషన్ సౌకర్యం నుండి పారిపోయాడు. యార్వాడాలోని తన ఇంటికి చేరుకోవడానికి దాదాపు 17 కిలోమీటర్లు నడిచాడు. రోగులకు ఆహారాన్ని అందించకపోవడం,వాష్‌రూమ్‌ల క్లీన్ వంటి మౌలిక సదుపాయాలు లేనందున తాను అక్కడి నుంచి పారిపోయిన (Flees Isolation Facility) వచ్చానని కరోనా వృద్ధుడు (COVID-19 Patient) తెలిపారు. ఈ ఘటన ఫుణేలో జరిగింది.

Advertisement

COVID-19 in India: వణికిస్తున్న ముంబై మురికివాడ ధారావి, కొత్తగా 42 పాజిటివ్ కేసులు, ఇండియాలో 31 వేలకు పైగా కోవిడ్-19 కేసులు, ఇండోనేషియాకు ప్రధాని మోడీ భరోసా

Hazarath Reddy

భారత్‌లో కరోనావైరస్ కేసులు (COVID-19 in India) పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 73 మంది కరోనాతో (COVID-19 Deaths in India) మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1007కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు భారత్‌లో 31,332 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది.

India COVID-19: కరోనాతో మరో డాక్టర్ మృతి, ఇండియాలో 30 వేలకు చేరువలో కోవిడ్-19 కేసులు, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు క‌రోనా వైర‌స్, లాలూ ప్రసాద్ యాదవ్‌కు పట్టుకున్న క‌రోనా భ‌యం

Hazarath Reddy

ఇండియాలో 24 గంటల వ్యవధిలో కరోనావైరస్‌తో (Coronavirus Deaths) 51 మంది మరణించారు. కొత్తగా 1594 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మంగళవారం సాయంత్రానికి దేశంలో కరోనా (India COVID-19 Bulletin) సోకిన వారి సంఖ్య 29,974కి చేరింది. దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 7027కు పెరగగా..ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 937కు చేరింది. దేశవ్యాప్తంగా 22010 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా మహారాష్ట్ర(8590), గుజరాత్‌(3548), ఢిల్లీ(3108), మధ్యప్రదేశ్‌(2368), రాజస్థాన్‌(2262) రాష్ట్రాల్లో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి.

Plasma Therapy in India: ప్లాస్మా థెరఫీ జాగ్రత్తగా చేయకుంటే ప్రాణాలకే ముప్పు, ప్లాస్మా థెరఫీని ఐసీఎంఆర్‌ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి

Hazarath Reddy

కరోనా సోకిన వారికి వ్యాధిని నయం చేసే నిమిత్తం పలు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్న ప్లాస్మా థెరపీపై (Plasma Therapy in India) కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ప్లాస్మా థెరపీ నిర్ధారిత చికిత్స విధానం కాదని, ఇది కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) ప్లాస్మా థెరపీపై పరిశోధన జరుపుతోందని కేంద్రం ప్రకటించింది.

China Response on ICMR’s Decision: చైనా ర్యాపిడ్ కిట్ల వ్యవహారం, ఒక్క రూపాయి చెల్లించబోమన్న ఇండియా, మా గుడ్‌విల్‌ను భారత్ గౌరవిస్తుందని తెలిపిన చైనా

Hazarath Reddy

ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టుల కచ్చితత్వంపై రాష్ట్రాలు సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో చైనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను (China Rapid Test Kits) ఇక నుంచీ వాడరాదని రాష్ట్రాలను ఐసీఎంఆర్‌ ( ICMR) ఆదేశించిన సంగతి విదితమే. కాగా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) సూచనలపై చైనా (China Response on ICMR’s Decision) స్పందించింది. వైద్య పరికరాల నాణ్యత విషయంలో పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Advertisement
Advertisement