World

Kim Jong Un's Health: కిమ్ బతికే ఉన్నాడని వార్తలు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ, ఆయన ఆరోగ్య వదంతులను కొట్టివేసిన అమెరికా, దక్షిణ కొరియా దేశాలు

Hazarath Reddy

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) ఆరోగ్యంపై సోషల్ మీడియాలో అనేక రకాలైన వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్యం సరిగా లేదని కొందరు అంటే, ఆయన చనిపోయారని మరికొందరు వాదిస్తున్నారు. అయితే ఉత్తర కొరియా ప్రభుత్వం (North Korea Govt) నుంచి కిమ్ ఆరోగ్యంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన రాసినట్లుగా లేఖ బయటకు వచ్చింది.

COVID-19 in India: దేశంలో 29 వేలు దాటిన కరోనా కేసులు, మహారాష్ట్రలోనే 8 వేలకు పైగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు, ఢిల్లీలో 3 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

Hazarath Reddy

దేశంలో గడిచిన 24 గంటల్లో 62 మంది కరోనాతో (Coronavirus in India) చనిపోగా, కొత్తగా 1,543 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,435కి చేరింది. ఈ వైరస్‌ నుంచి ఇప్పటి వరకు 6,868 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 934కి చేరింది. గడిచిన 28 రోజుల నుంచి 16 జిల్లాల్లో ఒక్క కరోనా (Coronavirus) కేసు కూడా నమోదు కాలేదు. గడిచిన 14 రోజుల్లో 85 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. దేశంలో 21,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Schools Reopened in China: విద్యార్థులకు కొత్తగా డీఐవై టోపీలు, చైనాలో తిరిగి ప్రారంభమైన స్కూళ్లు, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విద్యార్థుల ఫోటోలు

Hazarath Reddy

కరోనావైరస్‌ సృష్టించిన విలయం నుంచి డ్రాగన్ కంట్రీ (China) మెల్లమెల్లగా కోలుకుంటోంది. కరోనావైరస్ పుట్టిన వుహాన్‌లో కూడా ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్కూళ్లు (Schools Reopened in China) తెరుచుకుంటున్నాయి. చైనాలోని ప్రాధమిక మరియు మాధ్యమిక పాఠశాల విద్యార్థుల చివరి సంవత్సరం సుదీర్ఘంగా మూసివేసిన తరువాత సోమవారం వారి తరగతి గదులకు తిరిగి హజరయ్యారు.

COVID-19 in India: ఇండియాలో 5 రాష్ట్రాల్లో కరోనా లేదు, భారత్‌లో 28 వేలు దాటిన కరోనా కేసులు, ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలకు చేరుకున్న కరోనావైరస్ కేసులు

Hazarath Reddy

ఇండియాలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి (Deadly COVID-19 in India) కొనసాగుతూనే ఉంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి కరోనా (Coronavirus) పాజిటివ్ కేసుల్లో భారత్ 28,000 మార్క్‌ను దాటింది. కొత్తగా 1463 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో సోమవారం సాయంత్రం వరకు మొత్తం కేసుల సంఖ్య 28,380కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో 60 మంది మరణించారు.

Advertisement

PM Modi Meeting with CMs: లాక్‌డౌన్ కొనసాగింపుకే ప్రధాని మొగ్గు చూపారా?, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్, తుది నిర్ణయం ఎప్పుడంటే...?

Hazarath Reddy

కరోనావైరస్ (Coronavirus) కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ( Lockdown) మే 3తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi Meeting with CMs) నిర్వహించిన ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ (Video Conference) సమావేశం దేశమంతా ఉత్కంఠ రేపుతోంది.కాగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, వారందరి అభిప్రాయాలనూ స్వీకరించిన తరువాత లాక్డౌన్ ను మే 3 తరువాత పొడిగింపునకే ( lockdown exit strategy) మొగ్గు చూపారని తెలుస్తోంది. రాష్ట్రాల సీఎంలతో కరోనావైరస్ మీద ఇది నాలుగవ సమావేశం.

Nicotine on COVID-19: పొగతాగే వారికి కరోనావైరస్ ముప్పు తక్కువా? నికోటిన్ పొర వైరస్ సోకకుండా అడ్డుకట్ట వేస్తుందని చెప్తున్న తాజా అధ్యయనం, ఇంకా నిర్ధారణ కాలేదని వెల్లడి

Team Latestly

ఫ్రాన్స్ జనాభాలో సుమారు 35 శాతం మంది పొగతాగే వారు కాగా, సుమారు 25.4 శాతం మంది రెగ్యులర్ లేదా చైన్ స్మోకర్లు. అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే ఇప్పటివరకు ఫ్రాన్స్ లో నమోదైన కోవిడ్-19 కేసుల్లో పొగతాగే వారి కంటే పొగ తాగని వారే భారీగా ఉన్నారని తేలింది......

China Antibody Test Kits: చైనా నాసిరకం కిట్లకు డబ్బులు చెల్లించలేదు, ఆ కిట్లను వెనక్కి పంపిస్తాం, ఇండియాలో కరోనా వ్యాప్తి చాలా తక్కువ, మీడియాతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ (Coronavirus) మీద వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌ (Union Health Minister Dr Harsh Vardhan) శుక్రవారం అన్ని రాష్ట్రాల వైద్యశాఖ మంత్రులతో కరోనా పై తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చైనా కిట్లు నాసిరకంగా (Faulty Antibody Test Kits) వున్నందున వాటికి డబ్బులు చెల్లించే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.

US Immigration Ban: వలసవాదులకు అమెరికా షాక్, 60 రోజుల పాటు అమెరికాలోకి ఎవరూ ఉద్యోగాల కోసం రాకుండా నిషేధం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు 484 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీ

Hazarath Reddy

కరోనా సంక్షోభంలో కూరుకుపోయిన అమెరికా (America) తమ దేశ పౌరుల కోసం కీలక నిర్ణయం (US Immigration Ban) తీసుకుంది. అమెరికాలోకి కొన్ని రకాలైన వలసలను రానున్న 60 రోజులపాటు నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement

Bronx Zoo Tigers Coronavirus: పులులు, సింహాలకు కరోనావైరస్‌, జూ టైగర్‌ మౌంటైన్‌లో 3 పులులకు, మూడు ఆఫ్రికన్‌ సింహాలకు కోవిడ్-19 పాజిటివ్

Hazarath Reddy

న్యూయార్క్ లోని ఓ జూలో నాలుగు పులులు, 3 సింహాలకు వైరస్ (Bronx Zoo Tigers Coronavirus) సోకింది. గత నెలలో ఇదే జూలోని నదియా అనే నాలుగు సంవత్సరాల ఆడ పులి కరోనా వైరస్‌ బారిన పడింది. ఆడ మలయన్ పులికి వైరస్ సోకినప్పుడు ఎలా ప్రవర్తించిందో వీటికి అవే లక్షణాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. వాటి ముక్కు, గొంతు, శ్వాస నాళం నుంచి శాంపుల్స్ తీసి వైద్య పరీక్షలకు పంపించామని తెలిపారు.

COVID-19 in India: కేరళలొ నెలల పసిపాపను చంపేసిన కరోనా, ఇండియాలో 23 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, 718కి చేరిన మృతుల సంఖ్య

Hazarath Reddy

ఇండియాలో కరోనా వైరస్‌ (Deadly COVID-19 in India) చాప కింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో (India) కొత్తగా 1,684 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,077కి చేరింది. ఇప్పటివరకు కరోనా (Coronavirus in India) నుంచి 4,749 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో 37 మంది మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 718కి చేరింది.

Chinese Citizen Journalist: మాయమైన చైనా జర్నలిస్ట్ మళ్లీ ప్రత్యక్షం, వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌ను సందర్శించిన తరువాత మాయం, క్వారంటైన్‌లోకి తీసుకువెళ్లారని వెల్లడించిన లీ జహువా

Hazarath Reddy

గతేడాది చైనాలోని వుహాన్‌ (Wuhan) పట్టణంలో కరోనా వైరస్‌ (Coronavirus) విజృంభిస్తున్న సమయంలో వాటికి సంబంధించిన వార్తలను కవర్‌ చేస్తోన్న చైనా జర్నలిస్ట్‌ లీ (Chinese Citizen Journalist) జహువా అదృశ్యమైన సంగతి విదితమే. దాదాపు రెండు నెలల అనంతరం అతను (Li Zehua) మళ్లీ వుహాన్‌ పట్టణంలో ప్రత్యక్షమయ్యారు. భయానక కరోనా వైరస్‌ వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌ నుంచి బయటకు వచ్చిదంటూ అంతర్జాతీయంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ల్యాబ్‌ను లీ సందర్శించడం ఆ తరువాత లీ అదృశ్యమవడంతో అనేక రకాల వార్తలు దర్శనమిచ్చాయి.

India Coronavirus: కరోనా కట్టడిలో ముందడుగు, 12 జిల్లాల్లో కొత్త కేసులు లేవు, 78 జిల్లాల్లో 14 రోజుల నుంచి తాజా కేసులు లేవు, దేశంలో 21 వేలు దాటిన కరోనా కేసులు, 4,324 మంది డిశ్చార్జ్

Hazarath Reddy

దేశంలో కరోనా వైరస్‌ (2020 Coronavirus Pandemic in India) పాజిటివ్‌ కేసుల సంఖ్య మెల్లిగా తగ్గుముఖం పడుతోంది. గురువారం నాటికి భారత్‌లో (Coronavirus Cases in India) మొత్తం 21,700 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 1229 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అలాగే 24 గంటల్లో 34 మంది మరణించారు.దేశంలో ఇప్పటివరకు 686 మంది మృతి (Coronavirus deaths in india) చెందగా.. 4,324 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Advertisement

Delhi Corona Deaths: దేశ రాజధానిలో కరోనా కల్లోలం, 45 రోజులు పసిపాప మృతి, 2248కి కరోనా చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య, 71 కంటైన్‌మెంట్ జోన్ల‌ను ఏర్పాటు చేసిన ఢిల్లీ సర్కారు

Hazarath Reddy

భారత్‌లో కరోనా (Coronavirus in India) శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 22వేలకు చేరువలో ఉంది. ఇటు దేశ రాజధానిలో కోరనా (Coronavirus in Delhi) కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలో 2248కి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది. ఇప్పటి వరకు 48 మంది ప్రాణాలు (Delhi Corona Deaths) కోల్పోయారు. తాజాగా 45 రోజుల పసిపాపకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

Coronavirus in India: గుజరాత్‌లో కరోనా కల్లోలం, రెండు వేలు దాటిన కేసులు, దేశంలో 20 వేలు దాటిన కరోనా కేసులు, 652 మంది మృతి

Hazarath Reddy

గత 24 గంటల్లో భారతదేశం 1486 కొత్త కరోనావైరస్ కేసులను (Coronavirus Pandemic) నివేదించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో మొత్తం సానుకూల కరోనావైరస్ కేసులు బుధవారం 20 వేలు (COVID-19 Tally Crosses 20000) దాటాయి. నయం చేయబడిన లేదా విడుదల చేయబడిన వారు 4000 మందిగా ఉన్నారు. 640 మంది (Coronavirus Deaths) మరణించారు. ఇదిలా ఉంటే భారత రాష్ట్రాల్లో కేవలం 4 రాష్ట్రాల్లో 1000 కి పైగా కరోనావైరస్ కేసులు ఉన్నాయి, వీటిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు మరియు ఉత్తర ప్రదేశ్ ఉన్నాయి.

Coronavirus Outbreak in India: 640మంది కరోనాతో మృతి, ఇండియాలో 19 వేలు దాటిన కరోనా కేసులు, ఒక్కరోజులోనే 1883 కేసులు నమోదు

Hazarath Reddy

భారత్‌లో కోవిడ్-19 వైరస్‌ (Coronavirus Outbreak in India) విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్‌ నియంత్రణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మరణాల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 50 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా 1883 కేసులు నమోదైనట్లు తెలిపింది. భారత్‌లో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,984కు చేరింది.

Covid-19 'Black Day': వైద్యులపై దాడికి నిరసనగా 23న బ్లాక్ డే, 22 రాత్రి 9 గంటలకు ఆస్పత్రులలో కొవ్వొత్తులతో నిరసన, 23న నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరు, ఐఎంఏ కీలక నిర్ణయం

Hazarath Reddy

వైద్యుల‌పై ఉమ్మివేస్తూ, దుర్భాష‌లాడుతూ వారిపై భౌతిక దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ నేపథ్యంలో దీనికి నిర‌స‌న‌గా దేశవ్యాప్తంగా ఈనెల 23న బ్లాక్‌డే (IMA declares 23 April as Black Day) పాటించాల‌ని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) (Indian Medical Association) నిర్ణయించింది. వైద్యలుపై దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22 రాత్రి 9 గంటలకు ఆస్పత్రులలో క్యాండిల్స్‌ వెలిగించి నిరసన తెలపాలని డాక్టర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ రాజన్‌ శర్మ, గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్వీ అశోకన్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Advertisement

lockdown Extension: జూన్ 1 వరకు లాక్ డౌన్ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న సింగపూర్ ప్రభుత్వం, 9,125కు చేరిన కరోనా కేసుల సంఖ్య

Hazarath Reddy

కరోనావైరస్ రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ ఒకటి దాకా లాక్‌ డౌన్ (Coronavirus lockdown) పొడిగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని విద్యాసంస్థలు, పరిశ్రమలు మూసి ఉంచుతారు. మే నాలుగో తేదీకి లాక్‌డౌన్ (Singapore lockdown) పూర్తి కావాల్సి ఉన్నా మరో నాలుగువారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని లీ లూంగ్ (PM Lee Hsien Loong) ప్రకటించారు. సింగపూర్‌లో ఇప్పటివరకూ 9,125 కరోనా కేసులు నమోదయ్యాయి.

Tamil Nadu Doctor: సమాజం సిగ్గు పడే ఘటన, కరోనాతో డాక్టర్ మృతి, పాతి పెట్టేందుకు ఒప్పుకోని చెన్నై వాసులు, రహస్యంగా అంత్యక్రియలు చేసిన మరో డాక్టర్, ఇది మా దుస్థితి అంటూ ఆవేదన

Hazarath Reddy

తమిళనాడులో (Tamil Nadu) సమాజం సిగ్గు పడే విధంగా ఘటనలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న నెల్లూరు డాక్టర్ (Nellore Doctor) అంత్యక్రియలను అడ్డుకున్న గ్రామస్థులు నిన్న మరో డాక్టర్ అంత్యక్రియలను అడ్డుకున్నారు. కొవిడ్‌ బాధితులకు చికిత్స చేస్తూ మరణించిన, చెన్నైకు చెందిన ఓ డాక్టర్‌ (Tamil Nadu Doctor) అంత్యక్రియలకు స్థానికులు తీవ్ర అడ్డంకులు కల్పించడమే కాక... వచ్చిన మెడికల్‌ సిబ్బందిపై దాడి చేయడం చెన్నైలో కలకలం రేపింది.

Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ 'బ్రెయిన్ డెడ్' అయ్యారా? ఉత్తర కొరియా దేశాధినేత ఆరోగ్య పరిస్థితిపై వార్తలు, గత కొంతకాలంగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటోన్న కిమ్, ఆ దేశ రాజకీయ వ్యవస్థలో కీలక మార్పులు

Team Latestly

ఉత్తర కొరియాలో ఏది జరిగినా అది బయట ప్రపంచానికి తెలియదు. అయితే ఆ దేశానికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలలో నేతలు పాల్గొనని సందర్భంలో ఏదైనా విపత్తు జరిగి ఉండవచ్చు అనే సంకేతాలను ప్రపంచం గమనించింది. ఇలాగే 2008 లో ఒకసారి....

Coronavirus in India: రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదు, గడిచిన 24 గంటల్లో 47 మంది మృతి, దేశంలో 18 వేలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య

Hazarath Reddy

భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,336 కరోనా కేసులు (Coronavirus) నమోదు కాగా, 47 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (COVID 19 Positive Case) 18,601కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Advertisement
Advertisement