World

Wuhan Deaths Mystery: వుహాన్‌ కరోనా చావుల మిస్టరీ, కరోనా వల్ల వుహాన్‌లో 42 వేల మందికి పైగా మృతి, 3200 మంది చనిపోయారంటూ చైనా అధికారిక ప్రకటన, RFA కథనంలో నిజమెంత ?

Hazarath Reddy

చైనాలో 2019లో పుట్టిన కరోనావైరస్ (Coronavirus outbreak in China) ఆ దేశాన్ని 4 నెలల పాటు వణికించిన సంగతి విదితమే. కాగా ఈ వైరస్ దెబ్బకు చైనాలో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. అయితే వైరస్ తీవ్రత ఆ స్థాయిలో ఉన్నప్పటికీ చైనాలో కోవిడ్ 19 కారణంగా వుహాన్ లో (Wuhan) కేవలం 3200మంది మాత్రమే చనిపోయారని ఆ దేశం అధికారికంగా వెల్లడించింది. అయితే ఇది అంతా అవాస్తవమని ((Wuhan Deaths Mystery) RFA సంచలన కథనాన్ని వెలువరించింది.

COVID-19 Death Toll In India: ఇండియాలో 29కు చేరిన మృతులు, 24 గంటల్లో 106 కొత్త కేసులు, పాజిటివ్‌ కేసులు సంఖ్య 979, కోవిడ్‌-19పై హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

Hazarath Reddy

ఇండియాలో చాపకింద నీరులా కరోనా (Coronavirus) విస్తరిస్తోంది. రోజు రొజుకు దేశ వ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో (India) 979 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో కొత్తగా106 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా..ఆరుగురు మరణించారని వెల్లడించింది. దీంతో కోవిడ్‌-19 కారణంగాంఖ ఇప్పటి వరకు దేశంలో మృతిచెందిన వారిసంఖ్య 29కు (COVID-19 Death Toll In India) చేరింది. తాజాగా కోవిడ్‌-19పై (COVID-19) కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసింది.

Heartbreaking video: కన్నీళ్లు తెప్పిస్తున్న తండ్రీ కొడుకుల వీడియో, కరోనావైరస్ దెబ్బకు కొడుకును దగ్గరకు తీసుకోలేని నిస్సహాయ డాక్టర్ కథ ఇది, సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

తండ్రీ కొడుకుల బందాన్ని కరోనావైరస్ (coronavirus pandemic) ఛిన్నాభిన్నం చేస్తోందనే దానికి ఈ వీడియో (Heartbreaking video) ప్రత్యక్ష ఉదాహరణ. కోవిడ్ 19 (COVID19) పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్న ఓ డాక్టర్ (Saudi doctor) ఇంటికి వచ్చిన తరువాత తన కొడుకును చేతుల్లోకి తీసుకోలేక ఏడుస్తూ అలా ఉండిపోయాడు, కొడుకు నాన్నా అంటూ పరిగెత్తుకుంటూ వస్తే.. దగ్గరకు రావద్దు దూరంగా ఉంటూ అంటూ ఏడుస్తూ కూలబడిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కన్నీళ్లను తెప్పిస్తోంది.

Coronavirus in US: అమెరికాలో కరోనా మృత్యు ఘోష, నెలల పసికందును మింగేసిన కోవిడ్-19, లక్షా 21 వేలకు పైగా కరోనా కేసులు, రెండు వేలు దాటిన మృతులు సంఖ్య

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికా (America) కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఆ దేశంలో కరోనా (Coronavirus) విలయతాండవం చేస్తోంది. అమెరికాలో కోవిడ్ 19కు (COVID 19) ఓ ముక్కుపచ్చలరారని చిన్నారి బలైంది. చికాగోకు చెందిన నెలల పసికందు కోవిడ్‌-19 బారినపడి ప్రాణాలు విడిచిందని ఇల్లినాయిస్‌ ఆరోగ్యశాఖ (ఐడీపీహెచ్‌) శనివారం వెల్లడించింది.

Advertisement

COVID-19 in Spain: కరోనా కాటుకు బలైన స్పెయిన్‌ రాణి, పారిస్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మారియా థెరీసా, స్పెయిన్‌లో 73 వేలకు చేరిన కరోనా కేసులు

Hazarath Reddy

కరోనా మహమ్మారి కరోనాకు (COVID 19) స్పెయిన్‌ రాణి మారియా థెరీసా (Princess Maria Teresa) బలయ్యారు. ఆమె వయసు 86 ఏళ్లు. ప్రాణాంతక వైరస్‌ బారిన పడిన యువరాణి ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసిన మారియా స్పెయిన్‌ రాజు ఫెలిప్‌-6కు సోదరి. 1933 జులై 28 న ఆమె జన్మించారు. ఫ్రాన్స్‌లో చదువుకున్న మారియా సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించి ‘రెడ్‌ ప్రిన్సెస్‌’గా పేరు సంపాదించారు.

Coronavirus pandemic: కరోనా ఖేల్ ఖతం అంటున్న అమెరికా, కోవిడ్ 19పై యుద్ధం కోసం 64 దేశాలకు భారీ సహాయం, ఇండియాకు 2.9 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం

Hazarath Reddy

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌(COVID 19)పై పోరులో ప్రపంచ దేశాలకు అండగా ఉండేందుకు అగ్రరాజ్యం అమెరికా (America) ముందుకు వచ్చింది. కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంపై పోరాడేందుకు 64 దేశాలకు కలిపి మొత్తంగా 174 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఫిబ్రవరిలో ప్రకటించిన 100 మిలియన్‌ డాలర్ల సహాయానికి శుక్రవారం ప్రకటించిన ప్యాకేజీకి ఇది అదనం అని చెప్పవచ్చు.

Covid-19 Deaths in Italy: ఇటలీలో కరోనా చావు కేకలు, ఒక్క రోజే 1000 మంది మృతి, 9134కు చేరిన మృతుల సంఖ్య, 86 వేల మందికి కోవిడ్-19 పాజిటివ్

Hazarath Reddy

యూరప్‌ దేశం ఇటలీపై కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. కోవిడ్ 19 ధాటికి ఆ దేశం చిగురటాకులా వణికిపోతోంది. దీని దెబ్బకు శుక్రవారం ఒక్కరోజే దాదాపు 1000 కరోనా మరణాలు (COVID-19 Deaths in Italy) నమోదయ్యాయి. కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 9134కు చేరింది. అదే విధంగా దాదాపు 86 వేల మంది కరోనా పేషెంట్లుగా మారారు.

Covid-19 'Methanol Rumours': ఇది తాగితే కరోనావైరస్ చస్తుంది, ఇరాన్‌లో షికార్లు చేస్తున్న పుకార్లు, మెథనాల్‌ తాగి 400 మంది మృతి, 1000 మందికి పైగా అనారోగ్యం, వదంతులు నమ్మవద్దంటున్న వైద్యులు

Hazarath Reddy

ఇరాన్ లో కరోనావైరస్ కి విరుగుడు ఇదేనంటూ ఓ వార్త చక్కర్లు (Fake News Turns Fatal) కొడుతోంది. మెథనాల్‌ తాగితే (Drinking Methanol) కరోనాని అరికట్టవచ్చని అక్కడ ఫేక్ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కరోనాకు విరుగుడుగా ఇక్కడి ప్రజలు ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌ను సేవిస్తుండటంతో పరిస్థితి విషమిస్తోంది. మెథనాల్‌ ను తాగడంతో ఈనాటివరకు ఇరాన్‌లో 400 మంది మరణించారు.

Advertisement

Coronavirus in US: అమెరికా అల్లకల్లోలం, లక్ష దాటిన కరోనా కేసులు, న్యూయార్క్‌ను నాశనం చేస్తోన్న కరోనావైరస్, ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షలకు చేరువలో కోవిడ్ 19 కేసులు

Hazarath Reddy

చైనా.. ఇటలీ.. స్పెయిన్‌.. ఇలా ఒక్కో దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు అమెరికాపై (America) అనూహ్యస్థాయిలో విరుచుకుపడుతున్నది. అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ దెబ్బకు (Coronavirus Scare in US) విలవిలలాడుతోంది. అక్కడ కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య నిన్నటికి లక్ష (1,01,000) దాటేసింది. వారం రోజుల క్రితం ఈ సంఖ్య 8 వేలే ఉండగా ఇప్పుడు లక్షను దాటేసింది. గురువారం ఒక్క రోజే అమెరికాలో ఏకంగా 16,877 కొత్త కేసులు (COVID-19 Cases in US) నమోదయ్యాయి.

UK PM Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు సోకిన కరోనావైరస్, 'మీరొక ఫైటర్‌.. మీరు దీనిని జయిస్తారు' అంటూ ధైర్యాన్ని నూరిపోసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

Vikas Manda

యూకే ప్రధానికి కరోనావైరస్ సోకడం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోది స్పందించారు. బ్రిటన్ ప్రధానికి ధైర్యాన్ని నూరిపోశారు."మీరొక ఫైటర్, తొందరలోనే మీరు ఈ వైరస్ ను జయిస్తారు. మీ ఆరోగ్యం బాగుండాలని, మీ ద్వారా మీ దేశ ప్రజలు.....

COVID -19 Global Report: ఇండియాలో 724కు పెరిగిన కోవిడ్-19 కేసులు, ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య, చైనాను మించి అత్యధిక కేసులు నమోదు చేసిన అమెరికా

Vikas Manda

కోవిడ్-19 తో దక్షిణ కొరియా (South Korea) ధీటుగా పోరాడుతుంది. స్వీయ నియంత్రణ, పాజిటివ్ కేసులను గుర్తించి వారికి చికిత్స చేయడం ద్వారా కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ విషయంలో ఇండియా ఎంతవరకు విజయవంతం అవుతుందో....

Hantavirus: చైనాను వెంటాడుతున్న మరో కొత్త వైరస్, హంటా వైరస్‌తో ఒకరు మృతి, ఎలుకలు ఉంటే హంటావైరస్ వ్యాపించే ప్రమాదం

Hazarath Reddy

తాజాగా మరో కొత్తరకం వైరస్ చైనా (China) దేశంలో బయటపడింది. చైనాలోని యునన్ ప్రావిన్సుల్లో ఓ వ్యక్తిలో హంటావైరస్ (Hantavirus) లక్షణాలతో సోమవారం మృతిచెందాడు. షాండాంగ్ ప్రావిన్సులకు వెళ్తున్న అతడు హంటావైరస్‌తో మృతిచెందినట్టు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది అతడు ప్రయాణించిన బస్సులోని మరో 32 మంది ప్రయాణికులకు కూడా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది.

Advertisement

Covid-19 In UK: బ్రిటన్ రాజ కుటుంబానికి కరోనా షాక్, ప్రిన్స్‌ చార్లెస్‌కు కరోనా పాజిటివ్‌, స్వీయ నిర్భందంలో చార్లెస్, బ్రిటన్‌లో కరోనా దెబ్బకు 422 మంది మృత్యువాత

Hazarath Reddy

కరోనా (Coronavirus) మహమ్మారి సెగ బ్రిటన్‌ రాజకుటుంబాన్ని తాకింది.బ్రిటన్ రాజవంశంలో తొలి కరోనా కేసు నమోదైంది. బ్రిటన్ రాణి తరువాత సింహాసనాన్ని అధిరోహించబోయే ప్రిన్స్‌ చార్లెస్‌(71)కు (Prince Charles) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ప్రిన్స్‌ చార్లెస్‌ (Prince Charles Tests Positive for Coronavirus) ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన స్కాట్‌ల్యాండ్‌లోని తన నివాసంలో స్వీయ నిర్భందంలో ఉన్నారని క్లారెన్స్‌ హౌస్‌ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, చార్లెస్‌ భార్య కమిల్లాకు కరోనా నెగటివ్‌ వచ్చిందన్నారు.

Coronavirus in US: అమెరికాలో కరోనా కల్లోలం, ఒక్కరోజులోనే 10 వేల కొత్త కేసులు, 622కి పెరిగిన మృతుల సంఖ్య, దక్షిణ కొరియా సాయం కోరిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

Hazarath Reddy

అగ్రరాజ్యాన్ని కరోనావైరస్ (Coronavirus) ముప్పతిప్పలు పెడుతోంది. ఆ దేశంలో 24 గంటల వ్యవధిలోనే పదివేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఆ దేశంలో కోవిడ్‌ (Covid-19) బాధితుల సంఖ్య 49,594కు చేరుకుంది. ఒకే రోజులోనే 130 మంది మరణించారు. దీంతో అమెరికాలో (America) మృతుల సంఖ్య 622కి పెరిగింది. కోవిడ్‌ కల్లోలానికి ప్రపంచ వ్యాప్తంగా 16,961 మంది ప్రాణాలు కోల్పోగా, 4 లక్షల మందికిపైగా వ్యాధి బారిన పడ్డారు. ప్రపంచం మొత్తమ్మీద సుమారు 175 దేశాలు, ప్రాంతాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి.

Coronavirus: కరోనావైరస్‌ను ఇండియా తరిమేస్తుంది, ఆ సత్తా భారత్‌కు ఉంది, డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్‌ డెరైక్టర్‌ మైకేల్‌ ర్యాన్‌ వెల్లడి, పాకిస్తాన్‌లో 959 కరోనా కేసులు

Hazarath Reddy

కరోనా వైరస్‌ను (Deadly Coronavirus) ఎదుర్కోవడంలో భారత్‌ (India) చేపడుతున్న అసాధారణ, కఠిన చర్యలను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. గతంలో పోలియో, మశూచి (స్మాల్‌పాక్స్‌) వంటి పెద్ద మహమ్మారులను జయించిన భారత్‌ ప్రపంచానికే మార్గం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కితాబిచ్చింది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలన్నీ భారత్‌కు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైకేల్‌ ర్యాన్‌ (WHO Executive Director Michael J Ryan) తెలిపారు.

Coronavirus Deaths in India: ముంబైలో మరో కరోనా మరణం, మృత్యువాత పడిన పిలిఫ్పిన్స్‌ దేశస్తుడు, దేశంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, పాజిటివ్ కేసులు 415, ఆందోళనకరంగా మహారాష్ట్ర

Hazarath Reddy

భారతదేశంలో కరోనావైరస్ (Coronavirus Spreads) చాపకింద నీరులా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు (Coronavirus Cases in India), మరణాలు పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 64 కొత్త కేసులు బయటపడ్డాయి. సోమవారం ఉదయం నాటికి కరోనా కేసుల సంఖ్య 415కు చేరినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ తెలిపింది. ప్రస్తుతం కరోనా మృతుల సంఖ్య (COVID-19 Deaths in India) ఎనిమిదికి చేరింది. మహారాష్ట్రలో (Maharashtra) పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. అక్కడ మూడో మరణం నమోదైంది.

Advertisement

Indian Markets Crash: భారీ పతనంతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, 2900 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 8వేల దిగువకు పడిపోయిన నిఫ్టీ, 45 నిమిషాలు ట్రేడింగ్ నిలిపివేత

Vikas Manda

ట్రేడింగ్ 45 నిమిషాల పాటు నిలిపివేశారు. ఇలా ట్రేడింగ్ ను నిలిపివేయడం గత 10 రోజుల్లో ఇది రెండోసారి. చాలా సెక్టార్లలో అమ్మకాలు జరుగుతున్నప్పటికీ బ్యాంకింగ్ మరియు ఆటో స్టాక్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Italy Coronavirus Deaths: ఇటలీ మృత్యు ఘోష, కరోనా మరణాలు 5,476, పాజిటివ్ కేసులు 60 వేలకు దగ్గరలో, ప్రపంచవ్యాప్తంగా 13 వేలకు పైగా కోవిడ్-19 మరణాలు

Hazarath Reddy

కరోనావైరస్ ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌ దేశాల్లో విలయతాండవం చేస్తున్నది. ఇటలీలో ఇప్పటివరకు 5,476 మం ది మృత్యువాత (Italy Coronavirus Deaths) పడ్డారు. శనివారం ఒక్కరోజే 793 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ (Coronavirus) వెలుగులోకి వచ్చాక ఒక దేశంలో ఇంతమంది మృతి చెందడం ఇదే తొలిసారి. ఇటలీలో (Italy) జనవరి 31న తొలికేసు నమోదుకాగా, నెలలోపే వైరస్‌ దేశమంతా వ్యాపించింది. పరిస్థితి చేయిదాటుతుండడంతో ఆలస్యంగా మేల్కొన్న సర్కారు (Italy Govt) ఈ నెల 10న దేశవ్యాప్త దిగ్బంధం ప్రకటించింది. అయినప్పటికీ గత రెండు రోజుల్లోనే దాదాపు 1,420 మంది మరణించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

COVID-19 Deaths in India: కరోనా మృత్యు ఘోష, తాజాగా బీహార్‌లో కరోనాతో వ్యక్తి మృతి, ఇండియాలో 6కు చేరిన మృతుల సంఖ్య, 341కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు, 74 కేసులతో మహారాష్ట్ర టాప్

Hazarath Reddy

దేశాన్ని కరోనా (Coronavirus) కకావికలం చేస్తోంది. బీహార్‌లోని పాట్నాలో 38 ఏళ్ల వ్యక్తి మరణించడంతో కొరోనావైరస్ కారణంగా భారతదేశంలో (Coronavirus in India) మరణించిన వారి సంఖ్య ఆదివారం ఆరుకు పెరిగింది. ఈ వ్యక్తి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) లో చేరాడు, అక్కడ అతను ఈ ఉదయం మరణించాడు.

Janata Curfew: జనతా కర్ఫ్యూ, నేడు దేశ వ్యాప్తంగా రైళ్లు, బస్సులు అన్నీ బంద్, సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో మారుమోగాలి, రాత్రి 9 వరకు ఇళ్లలోనే ఉండాలని ప్రధాని పిలుపు

Hazarath Reddy

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్ (COVID-19) రాజ్యమేలుతోంది. దీని వల్ల వేల మంది మరణించగా.. లక్షలాది మంది బాధితులుగా మారుతున్నారు. దీంతో దీన్ని నివారించేందుకు ప్రధాని మోదీ (PM Modi) దేశవ్యాప్తంగా నేడు జనతా కర్ఫ్యూ (PM Modi Janata Curfew) పాటించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రజలు జనతా కర్ఫ్యూకి (Janata Curfew) సిద్ధమయ్యారు.

Advertisement
Advertisement