ప్రపంచం
Philippines Landslide: బంగారు గనిలో విరిగిపడిన కొండ చరియలు, 54కు పెరిగిన మృతుల సంఖ్య, కొండ చరియల కింద కూరుకుపోయిన ఇళ్లు, వాహనాలు
Hazarath Reddyపిలిప్పీన్స్‌లో ఘోర విషాదం చోటు చేసుకున్న సంగతి విదితమే. డావో ప్రావిన్సు మాకో టౌన్‌లో బంగారు గని సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 54కు చేరింది. మరో 32 మంది గాయపడ్డారు. కొండ చరియల కింద ఇళ్లు, వాహనాలు కూరుకుపోయాయి.
Alaskapox: మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వ్యాధి, అలస్కాపాక్స్‌తో ఒకరు మృతి, ఈ వైరస్ లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి
Hazarath Reddyప్రపంచాన్ని మరో కొత్త వైరస్ వణికించేందుకు రెడీ అయింది. మశూచికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన కొత్తగా కనుగొనబడిన వైరస్ అలస్కాలో కనుగొన్నారు. ఈ వ్యాధితో ఓ వ్యక్తి మరణించగా అతి వ్యాధి యొక్క తొలి మరణం అని వైద్యాధికారులు నిర్థారించారు.
Bird Flu Outbreak in Japan: ప్రమాదకరంగా మారుతున్న ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా, దాదాపు 14,000 పక్షులను చంపేసిన జపాన్
Hazarath Reddyదక్షిణ జపాన్‌లో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వ్యాప్తి చెందిందని నిర్ధారించిన తర్వాత దాదాపు 14,000 పక్షులను చంపినట్లు స్థానిక అధికారులు సోమవారం తెలిపారు. ప్రిఫెక్చురల్ ప్రభుత్వం ప్రకారం, కగోషిమాలోని మినామిసాత్సుమా నగరంలోని పౌల్ట్రీ ఫారమ్‌లో బర్డ్ ఫ్లూ నిర్ధారించబడింది.
Qatar Released 8 Indian Navy Veterans Jailed: వీడియో ఇదిగో, ఖతార్ జైలు నుంచి విడుదలైన ఎనిమిది మంది భారతీయులు, స్వదేశానికి తిరిగివచ్చిన ఏడు మంది
Hazarath Reddyఖతార్‌లో ఎనిమిదిమంది భారతీయుల మరణశిక్ష రద్దు అయింది. మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారతీయులు విడుదలయ్యారు. దీనిపై భారత ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ ఎనిమిది మంది భారతీయుల్లో ఏడుగురు భారత్‌కు తిరిగి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
UPI Payment Services in Sri Lanka: శ్రీలంక, మారిషస్‌లో యూపీఐ సేవలు, ఇకపై ఆ దేశాల్లో యూపీఐతో చెల్లింపులు జరపవచ్చని తెలిపిన భారత ప్రభుత్వం
Hazarath Reddyగత వారం ఫ్రాన్స్‌లో ప్రారంభమైన యూపీఐ సేవలను తాజాగా శ్రీలంక, మారిషస్‌కూ విస్తరించారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన వర్చువల్‌ సమావేశంలో మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌కుమార్‌ జగన్నాథ్‌, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘేతో కలిసి ప్రధానమంత్రి మోదీ పాల్గొన్నారు. మారిషస్‌లో రూపే కార్డులను సైతం ప్రారంభించారు.
Houston Firing: చ‌ర్చిలో ప్రార్ధ‌న‌లు జ‌రుగుతండ‌గా ఒక్కసారిగా కాల్పులు, ఐదేళ్ల బాలుడితో వ‌చ్చి గ‌న్ తో విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపిన మ‌హిళ‌
VNSఅగ్రరాజ్యం (Firing)లో మళ్లీ తుపాకుల మోత మోగింది. టెక్సాస్‌లోని హూస్టన్‌లో (Houston) ఉన్న మెగాచర్చిలో ఓ మహిళ కాల్పులకు పాల్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను కాల్చి చంపారు. ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడితో సహా మరో వ్యక్తి గాయపడ్డారు.
Pakistan Election Results 2024: ముగిసిన పాకిస్థాన్ ఎన్నిక‌ల కౌంటింగ్, ఇమ్రాన్ ఖాన్ కు మ‌ద్ద‌తిస్తున్న ఇండిపెండెంట్ల‌దే హ‌వా! 93 స్థానాల్లో గెలిచిన ఇమ్రాన్ మ‌ద్ద‌తుదారులు, అధికారికంగా ప్ర‌క‌టించ‌ని ఎన్నిక‌ల సంఘం
VNSఇమ్రాన్ ఖాన్‌కు (Imran Khan) మద్దతు ఇస్తున్న స్వతంత్ర అభ్యర్థులు 93 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. నవాజ్ ష‌రీఫ్ (Nawaz Sharif) సార‌ధ్యంలోని పాకిస్థాన్ ముస్లింలీగ్ – న‌వాజ్ (PMLN) పార్టీ 75 సీట్లతో రెండో స్థానంలో ఉంది. కానీ పాకిస్తాన్ ఎన్నికల సంఘం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Missouri Shocker: ఆరు నెల‌ల ప‌సికందును ఓవెన్ లో పెట్టిన త‌ల్లి, ఉయ్యాల‌కు బ‌దులు పొర‌పాటున ఓవెన్ లో పెట్టానంటూ పోలీసుల‌కు స‌మాధానం, అమెరికాలో ఘోరం
VNSతొట్టిలో పడుకోబెట్టాననుకుని పొరపాటున నాప్ పై పెట్టానని పసికందు తల్లి తెలిపింది. ఆ పసికందుకు వేసిన దుస్తులు, డైపర్ కాలిపోయాయని అరెస్ట్ వారంట్ లో తెలిపారు. ఇంట్లో పొగలు వస్తున్నాయని చూస్తే పసికందును పడుకోబెట్టిన బ్లాంకెంట్ తగలబడిపోయిందని తెలిపారు.
Pakistan Elections: పాకిస్థాన్ ఎన్నికల ఫలితాలపై ఇంకా కొనసాగుతున్న ఉత్కంఠ, రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలతో పలు బూత్‌ల్లో రీ పోలింగ్ కు ఆదేశం
VNSఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుండటంతో ఫలితాలు వెలువడలేదు. ఇప్పటికీ మరో ఏడు స్థానాలకు సంబంధించిన ఫలితాలు తేలాల్సి ఉంది. అయితే కౌంటింగ్‌ కొనసాగుతుండగా పలు కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Pakistan Elections: పాక్ ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్, సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ
VNSపాక్ ఆర్మీ రిగ్గింగ్ చేస్తున్న వీడియో ఆధారాలు మా వద్ద ఉన్నాయి’ అని అంటూ ఓ పీటీఐ (PTI) సభ్యుడు తెలిపారు. గురువారం రాత్రి నుంచి పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది.
Pakistan Election Results 2024: పాక్ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్‌కు షాక్, 55 స్థానాల్లో ఆధిక్యంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థులు, 43 స్థానాలతో రెండో స్థానంలో PMLN
Hazarath Reddyపొరుగు దేశం పాకిస్థాన్‌ (Pakistan)లో జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 265 స్థానాలకు గానూ ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. తాజా న్యూస్ (Pakistan Election Results 2024) ప్రకారం.. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థులు 55 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు, PMLN 43 స్థానాలు, PPP 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
Pakistan Election Results 2024: పాక్ ఎన్నికల్లో షెహబాజ్ షరీఫ్, నవాజ్ షరీఫ్ విక్టరీ, PML(N) మెజారిటీ స్థానాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన మాజీ ప్రధాని
Hazarath Reddyసార్వత్రిక ఎన్నికల్లో పీటీఐ మద్దతుగల అభ్యర్థులు అనేక స్థానాలను గెలుచుకున్నప్పటికీ, జాతీయ అసెంబ్లీలో తమకు మెజారిటీ ఉందని పీఎంఎల్(ఎన్) శుక్రవారం ప్రకటించింది. కొన్ని మీడియా ఛానెల్‌లు ప్రజలను "తప్పుదోవ పట్టిస్తున్నాయి" అని PML-N నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ఉద్ఘాటించారు
Genetic Compatibility Testing: పెళ్లి చేసుకోవాలంటే డీఎన్ఏ టెస్టు కంప‌ల్స‌రీ.. ఆ స‌ర్టిఫికేట్ ఉంటేనే మ్యారేజీని రిజిస్ట‌ర్ చేస్తారు.. ర‌ష్యాలో కొత్త నిబంధన.. ఎందుకంటే?
Rudraపెళ్లి చేసుకోవాలంటే డీఎన్ఏ టెస్టు తప్పనిసరి. ఆ స‌ర్టిఫికేట్ ఉంటేనే మ్యారేజీని రిజిస్ట‌ర్ చేస్తారు. ర‌ష్యాలోని రిప‌బ్లిక్ ఆఫ్ బ‌ష్కోర్టోస్ట‌న్‌ లో డాక్ట‌ర్లు ఈ కొత్త ప్ర‌తిపాద‌న‌లు చేస్తున్నారు.
World's Tallest Man Video: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తి ఇతనే, 8 అడుగుల 2.8 అంగుళాల ఎత్తులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyటర్కీకి చెందిన సుల్తాన్ కోసెన్ అనే వ్యక్తి 2009లో 8 అడుగుల 1 అంగుళం ఎత్తుతో ఆకట్టుకునేలా నిలబడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుండి 'టాలెస్ట్ లివింగ్ మ్యాన్' బిరుదును సంపాదించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, అతని అసాధారణమైన ఎత్తు అప్పుడు 8.1 గా నమోదు అయింది. 20 సంవత్సరాలలో అది కాస్తా 8 అడుగుల 2.8 అంగుళాల ఎత్తుకు చేరింది.
Pakistan General Elections 2024: ఓటు హక్కును వినియోగించుకున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyమాజీ ప్రధాని షరీఫ్ లాహోర్‌లోని మోడల్ టౌన్ నియోజకవర్గంలో ఓటు వేశారు.గత ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఇమ్రాన్ ఖాన్‌తో పాటు జైలులో ఉన్న ఇతర రాజకీయ ప్రముఖులు జైలు నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు.
Pakistan General Elections 2024: జైలు నుంచి ఓటు హక్కును వినియోగించుకున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
Hazarath Reddyపాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఇతర రాజకీయ నేతలు అడియాలా జైలు నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పాకిస్థాన్‌కు చెందిన డాన్ పత్రిక వర్గాలు పేర్కొన్నాయి.
Pakistan General Elections 2024: ఎన్నికల వేళ పాకిస్తాన్‌లో మ‌రో ఉగ్ర‌దాడి.. నలుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి, పోలింగ్‌కు ముందే బయటకు వచ్చిన ఫలితాలు
Hazarath Reddyపాకిస్తాన్‌లో ఎన్నికలు జ‌రుగుతున్న వేళ మ‌రో ఉగ్ర‌దాడికి టెర్రరిస్టులు పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఉగ్ర‌వాదులు డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో బాంబు దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు
Houthi Rebels Attack 2 More Ships: ఎర్ర సముద్రంలో మళ్లీ రెచ్చిపోయిన హౌతీ రెబల్స్, భారత్‌కు వస్తున్న నౌకపై డ్రోన్ల దాడి, బ్రిటన్‌ కంపెనీకి చెందిన నౌకపై కూడా దాడి
Hazarath Reddyఎర్ర సముద్రం మధ్యప్రాచ్య జలాల్లో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై మంగళవారం తెల్లవారుజామున అనుమానిత యెమెన్ హౌతీ తిరుగుబాటు డ్రోన్‌లు దాడి చేశాయని అధికారులు తెలిపారు.
Balochistan Blast: బలూచిస్థాన్‌లో రెండు చోట్ల భారీ పేలుళ్లు, 25 మంది మృతి..40 మందికి తీవ్ర గాయాలు, రేపు పాకిస్తాన్ జాతీయ ఎన్నికలు
Hazarath Reddyపాకిస్తాన్ ఎన్నికల వేళ భారీ పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. పాకిస్థాన్‌లో గురువారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రోజు రెండు చోట్ల పేలుడు సంఘటనలు జరిగాయి. నైరుతి ప్రావిన్స్‌ బలూచిస్థాన్‌లో పాకిస్థాన్‌ అభ్యర్థుల ఎన్నికల కార్యాలయాల సమీపంలో జరిగిన ఈ పేలుళ్లలో 25 మంది మరణించారు.