ప్రపంచం

Donald Trump 2.0: అమెరికాలో పుట్టిన విదేశీ పిల్లలకు యూఎస్ పౌరసత్వం రద్దు, లక్షలాది మంది భారతీయుల మెడపై వేలాడుతున్న బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ కత్తి, అసలైంటి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ?

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడిగా(47వ) బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్‌ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న అధ్యక్షుడయ్యాక ఇమ్మిగ్రేషన్‌పై వాగ్దానం చేసిన అణిచివేతలో భాగంగా జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేశారు.

Donald Trump-Melania's Dance Video: వీడియోలు ఇవిగో, భార్యతో కలిసి కత్తి పట్టుకుని డ్యాన్స్ వేసిన డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతల స్వీకరణ

Hazarath Reddy

ఈ ప్రమాణ స్వీకారోత్సం కార్యక్రమం జరిగిన స్టేజ్‌పై ట్రంప్‌ తన సతీమణి, అమెరికా ఫస్ట్‌ లేడీ మెలానియా ట్రంప్‌ (Melania Trump)తో కలిసి డ్యాన్స్‌ చేశారు.తన చేత్తో కత్తిపట్టుకుని డ్యాన్స్‌ (Dances With Military Sword) చేసి అలరించారు ట్రంప్‌

Trump Withdraws US from WHO: డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకుంటున్నాం, అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళనున్న ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ

Hazarath Reddy

రెండోసారి దేశాధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మ‌రో సంచలన నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు.

Trump 2.0 Begins: జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఆదేశాలు.. ఇంకా పలు కీలక నిర్ణయాలు.. అవేంటంటే??

Rudra

అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి అధిష్ఠించిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి తగినట్టుగానే జన్మతః పౌరసత్వంపై వేటు వేశారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు జన్మిస్తే స్వతహాగా లభించే పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేశారు.

Advertisement

Donald Trump Swearing In: వైట్‌హౌస్‌లోకి రీ ఎంట్రీ, అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారం, భారత్ నుంచి కార్యక్రమానికి హాజరైన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌

Hazarath Reddy

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌ రోటుండాలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు, పారిశ్రామిక, టెక్‌ దిగ్గజాలు, అతిరథ మహారథులు హాజరయ్యారు.

Donald Trump: అమెరికాలో ట్రాన్స్‌జెండర్లకు బిగ్ షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్, పాస్‌పోర్ట్‌తో సహా IDలలో మగ లేక ఆడ మాత్రమే ఉండాలంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ

Hazarath Reddy

47వ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ మొదటి రోజున " లింగ గుర్తింపు" విధానానికి సంబంధించి భారీ మార్పులను తీసుకురావడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేయనున్నారు. ఇందులో భాగంగా డోనాల్డ్ ట్రంప్ జనవరి 20 న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయబోతున్నారు

Donald Trump Dance Video: డొనాల్డ్‌ ట్రంప్‌ డ్యాన్స్ వీడియో ఇదిగో, ఐకానిక్‌ స్టెప్పులతో అదరగొట్టిన అమెరికా అధ్యక్షుడు, 78 ఏళ్ల వయసులో అగ్రరాజ్యాధినేతగా మరోసారి బాధ్యతలు

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ట్రంప్‌ విక్టరీ ర్యాలీ (Trump pre oath rally) నిర్వహించారు. వాషింగ్టన్‌ డీసీ (Washington DC)లో ఆదివారం ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’ పేరుతో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్‌ మద్దతుదారులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TikTok Back in US: అమెరికాలో టిక్‌టాక్‌ ఈజ్‌ బ్యాక్‌, నిషేధించిన 24 గంటల్లోనే తమ సేవలను పునరుద్ధరించిన బైట్‌డ్యాన్స్‌

Hazarath Reddy

చైనా కంపెనీ అయిన బైట్‌డ్యాన్స్‌కు చెందిన ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ను నిషేధించిన 24 గంటల్లోనే అమెరికాలో తమ సేవలను పునరుద్ధరించింది.టిక్‌టాక్‌ను నిషేధించేందుకు వీలుగా తీసుకొచ్చిన చట్టం ఆదివారం నుంచి అమలులోకి వస్తుండటంతో ఒక్కరోజు ముందుగానే తన సేవలను నిలిపివేసింది టిక్ టాక్

Advertisement

Hyderabad Student Ravi Teja Shot Dead in US: అమెరికాలో కాల్పుల ఘటనలో మరో తెలుగు విద్యార్థి బలి, హైదరాబాద్​ యువకుడు రవితేజపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగుడు

Hazarath Reddy

అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది.దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్​కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.మృతుడిని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్​ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు. అతడి మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Donald Trump Sand Art: ట్రంప్‌ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్న ప్రముఖ చిత్రకారుడు సుదర్శన్ పట్నాయక్.. ప్రమాణం నేపథ్యంలో ట్రంప్‌ సైకత శిల్పం

Rudra

నిరుడు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (78) నేడు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు.

Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్.. మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం.. తొలి రోజే వందకుపైగా ఆదేశాలపై ట్రంప్ సంతకాలు

Rudra

నిరుడు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (78) నేడు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు.

Mukesh and Nita Ambani Photo with Trump: డోనాల్డ్‌ ట్రంప్‌తో ముఖేష్‌ అంబానీ ఫ్యామిలీ ఫోటో, ప్రమాణస్వీకారం కోసం వాషింగ్టన్‌లో సందడి చేస్తున్న ప్రముఖులు

VNS

అమెరికా అధ్యక్షుడిగా సోమవారం డొనాల్డ్ ట్రంప్ (Trump Swearing-In Ceremony) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న పలువురు అతిథులు ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీకి (Mukesh and Nita Ambani) కూడా ఆహ్వానం అందడంతో వారు ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో ఉన్నారు.

Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో కీలక ఒప్పందం.. రూ.450 కోట్లతో క్యాపిటాల్యాండ్ హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్‌ పర్యటనలో మరో కీలక ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ కోసం రూ.450 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది క్యాపిటాల్యాండ్.

Deadly Explosion In Nigeria: నైజీరియాలో భారీ పేలుడు... 70 మంది మృతి, గ్యాసోలిన్ బదిలీ చేస్తుండగా ప్రమాదం, భారీగా ప్రాణ,ఆస్తి నష్టం

Arun Charagonda

ఉత్తర-మధ్య నైజీరియాలో జరిగిన భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 70 మంది మరణించారని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (NEMA) తెలిపింది.

First Death From HMPV: ప్రాణాంతకంగా మారుతున్న హెచ్‌ఎంపీవీ వైరస్‌, బంగ్లాదేశ్‌లో తొలి మరణం నమోదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న నిపుణులు

VNS

ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వైరస్ విజృంభిస్తోంది. భారత్ సహా పలు దేశాల్లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు (HMPV Virus Cases) నమోదు అయ్యాయి. బంగ్లాదేశ్‌లో కూడా హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో హెచ్ఎంపీవీ వైరస్ (HMPV Death) మొదటి మరణం సంభవించింది.

Telangana Skill University: సింగపూర్‌ ఐటీఈతో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం,గ్రీన్ ఎనర్జీపై ఫోకస్

Arun Charagonda

తెలంగాణ రైజింగ్ ప్రధాన ఎజెండగా సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. సింగపూర్ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో కలిసి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE)ని సందర్శించారు.

Advertisement

14 Years Sentence For Imran Khan: అవినీతి కేసు... ఇమ్రాన్‌ ఖాన్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష.. రూ.10 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం

Arun Charagonda

అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి షాక్ తగిలింది. ఆల్ ఖాదిర్ అనే ట్రస్ట్ పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోర్టులో న్యాయమూర్తి నాసిర్ జావేద్ రానా సంచలన తీర్పు ఇచ్చారు.

SpaceX Starship Destroyed: ఎలాన్ మస్క్‌కు గట్టి షాక్... పేలిన స్పెస్ ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్,సాంకేతికలోపం తలెత్తడంతో పేలిన రాకెట్..వీడియో

Arun Charagonda

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు బిగ్ షాక్. స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కారెట్ స్టార్‌షిప్‌ విఫలమైంది. సాంకేతిక లోపం తలెత్తడంతో పేలిపోయింది రాకెట్.

CM Revanth Reddy At Singapore: సింగపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి...గ్రీన్ ఎనర్జీ, టూరిజం, నదుల పునరుజ్జీవనంపై సింగపూర్ విదేశాంగ మంత్రితో చర్చలు

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఇవాళ సింగపూర్ ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రి, భారత సంస్కృతిపై ప్రత్యేక అభిరుచి కలిగిన వివియాన్ బాలతో చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి.

Hindenburg Shuts Down: హిండెన్ బర్గ్ రీసెర్చ్ షట్‌డౌన్...వెల్లడించిన వ్యవస్థాపకుడు అండర్సన్, తమ రీసెర్చ్‌ ఎలా సాగిందనేది వీడియోల ద్వారా వెల్లడిస్తామని ప్రకటన

Arun Charagonda

అదానీ గ్రూప్‌పై సంచలన నివేదికతో అందరి దృష్టిని ఆకర్షించింది హిండెన్ బర్గ్. అయితే అనూహ్యంగా తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది

Advertisement
Advertisement