World
ICC World Cup 2023: దాయాది దేశపు ఆటగాళ్లు ఇండియాకు వస్తున్నారు, ప్రపంచకప్ ఆడేందుకు భారత్ పంపాలంటూ ప్రధానికి లేఖ రాసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు
Hazarath Reddyభారత్ లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ 2023 లో పాల్గొనేందుకు దాయాది దేశం పాకిస్థాన్ అంగీకరించింది. వేదికల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన పాకిస్తాన్ చివరికి మనసు మార్చుకుంది. టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీ కోసం భారత్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆ దేశ ప్రభుత్వానికి పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) విజ్ఞప్తి చేసింది.
308 Indian Prisoners in Pakistani Jails: పాకిస్థాన్ జైలులో 308 మంది భారతీయులు, ఇండియా జైలులో 417 మంది పాకిస్తానీయులు, వివరాలను పంచుకున్న ఇరుదేశాలు
Hazarath Reddyపాకిస్థాన్ దేశంలోని జైళ్లలో 308 మంది భారతీయులు మగ్గిపోతున్నారంటూ పాకిస్థాన్ ప్రభుత్వం భారత హైకమిషన్‌కు నివేదించింది. జైళ్లలో ఉన్నవారిలో 266 మంది మత్స్యకారులు కాగా, 42 మంది పౌరులు. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ వివరాలను భారత్‌తో పంచుకున్నట్టు పాక్‌ విదేశాంగ కార్యాలయం తెలిపింది.
Trip To Titanic Shipwreck: టైటానిక్ శిథిలాలను చూసేందుకు మరోసారి యాత్ర, ఐదు ప్రాణాలు పోయినా వెనక్కు తగ్గని ఓషన్ గేట్ సంస్థ, ఈ సారి ఏకంగా రెండు ట్రిప్‌లు ప్లాన్, ఒక్కో టికెట్ ధర ఎంతంటే?
VNSఘటన జరిగి పది రోజులు కూడా కాకముందే సంస్థ మరోసారి సాహస యాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ శకలాలను చూసేందుకు ఇదే మా ఆహ్వానం అంటూ ఓషియన్ గేట్ (Oceangate) సంస్థ తాజాగా ప్రకటన ఇచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
HC Dismisses Twitter Plea: 45 రోజుల్లోగా రూ. 50 లక్షలు చెల్లించాలని ట్విట్టర్‌కు కర్ణాటక హైకోర్టు ఆదేశాలు, ట్విట్ట‌ర్ దాఖ‌లు చేసిన పిటిషన్ తిరస్కరించిన ధర్మాసనం
Hazarath Reddyక‌ర్నాట‌క హైకోర్టు ట్విట్ట‌ర్ (Twitter) సంస్థ‌కు భారీ షాక్ ఇచ్చింది. కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఆదేశాల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ ట్విట్ట‌ర్ సంస్థ దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను కోర్టు తిర‌స్క‌రించింది. ఆ సంస్థ‌పై 50 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది.
Internet Shutdowns Cost in India: దేశంలో అల్లర్లతో ఇంటర్నెట్ షట్‌డౌన్‌‌, భారత ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.15,590 కోట్లు నష్టం
Hazarath Reddyఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధించిన ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు 1.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 15,590 కోట్లు) నష్టం వాటిల్లిందని ఒక తాజా నివేదిక పేర్కొంది.
France Riots: ఫ్రాన్స్‌లో మిన్నంటిన అల్లర్లు, మూడు బస్సులకు నిప్పుపెట్టిన నిరసనకారులు, టీనేజర్‌ మృతిపై భగ్గుమన్న యువత, పారిస్‌ శివారులో కర్ఫ్యూ
Hazarath Reddyఫ్రాన్స్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మరణించిన అనంతరం తలెత్తిన అల్లర్లు కొనసాగుతున్నాయి. ఘటన జరిగిన మంగళవారం నాటి రాత్రి పారిస్‌ శివారు ప్రాంతాల్లోనే చోటుచేసుకున్న ఈ అల్లర్లు గురువారం దేశమంతా పాకాయి.
National Geographic Layoffs: మీడియా లేఆప్స్, రైటర్లందరినీ తొలగించిన నేషనల్‌ జియోగ్రాఫిక్‌, త్వరలో మ్యాగజైన్‌ మూతపడనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి పొందిన ప్రముఖ మ్యాగజైన్‌ (Magazine) నేషనల్ జియోగ్రాఫిక్‌ (National Geographic) త్వరలోనే మూతపడనుంది. ఈ సంస్థలో చివరి స్టాఫ్‌ రైటర్ల (Staff Writers)ను తాజాగా ఉద్యోగం నుంచి తొలగించారు
Earthquake in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతగా నమోదు, బయటకు పరుగులు పెట్టిన ప్రజలు
Hazarath Reddyఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్ ప్రాంతంలో గురువారం 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) నివేదించింది. భూకంపం యొక్క లోతు 150 కి.మీ. గా గుర్తించారు.
Madonna Hospitalised: తీవ్ర అనారోగ్యంతో ICUలో ప్రఖ్యాత సింగర్‌, బ్యాక్టీరియా వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు గురైన అమెరికన్ పాపులర్‌ సింగర్‌ మడోన్నా
Hazarath Reddyఅమెరికన్ పాపులర్‌ సింగర్‌ మడోన్నా అనారోగ్యానికి గురైయారు. ఆమెతో పాటు కుమార్తె లూర్డ్ లియోన్ కూడా జబ్బున పడ్డారు. దీంతో వారిద్దరూ న్యూయార్క్ నగరంలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్‌ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఇదే విషయాన్ని మడోన్నా మేనేజర్, గై ఓసీరీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటన చేశారు.
Human Remains From Titan: టైటాన్ శిథిలాల నుంచి బిలియనీర్లు మృతదేహాలు స్వాధీనం, సముద్రగర్భం నుంచి తీసుకువచ్చిన కోస్ట్ గార్డ్‌
VNSమరోవైపు టైటాన్ జలాంతర్గామి శిథిలాల నుండి బిలియనీర్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ వర్గాలు తెలియజేశాయి. యూఎస్ కోస్ట్ గార్డ్ టైటాన్ సబ్‌మెర్సిబుల్ శిథిలాలను (Titan Wreckage) బుధవారం భూమికి తీసుకువచ్చారు. సముద్రగర్భం నుంచి శిథిలాలు, ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.
EAM S Jaishankar on Canada: కెనడా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది, ఖలిస్తానీ సమస్యపై స్పందించిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్
Hazarath Reddyతమ గడ్డపై పెరుగుతున్న ఖలిస్తాన్ ఉద్యమంపై కెనడా మౌనంగా స్పందించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం విమర్శించారు. జస్టిన్ ట్రూడో-ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు . ఖలిస్తానీ సమస్యతో కెనడా ఎలా వ్యవహరిస్తుందనేది చాలా కాలంగా మాకు ఆందోళన కలిగిస్తోంది.
Payoneer Layoffs: ఆగని లేఆప్స్, 200 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న Payoneer
Hazarath Reddyఫిన్‌టెక్ కంపెనీ Payoneer కొత్త CEOని నియమించిన నాలుగు నెలల తర్వాత 200 మంది ఉద్యోగులను, దాదాపు 10 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మీడియా పేర్కొంది.
Indian-Origin Man in US Sentenced to Jail: ఉబర్ సాయంతో అమెరికాలోకి ఇండియన్లు అక్రమ రవాణా, భారత సంతతి వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష
Hazarath Reddyరైడ్-హెయిలింగ్ యాప్ ఉబర్‌ను ఉపయోగించి 800 మందికి పైగా భారతీయ పౌరులను అమెరికాలోకి అక్రమంగా తరలించినందుకు 49 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది.
France Riots Videos: టీనేజ్ డ్రైవర్‌ను కాల్చి చంపిన పోలీసు అధికారి, నిరసనగా పారిస్‌లో భారీగా అల్లర్లు, చెత్త డబ్బాలు, నిర్మాణాలకు నిప్పు పెట్టిన యువకులు
Hazarath Reddyఒక పోలీసు అధికారి టీనేజ్ డ్రైవర్‌ను కాల్చి చంపిన తరువాత, పారిస్‌లో అల్లర్లు చెలరేగాయి. అల్జీరియన్ సంతతికి చెందిన మృతుడు, పారిస్‌కు పశ్చిమాన ఉన్న నాంటెర్రేలో మంగళవారం కాల్చి చంపబడటానికి ముందు ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించినట్లు తెలిసింది
COVID Origin Mystery Solved? క‌రోనా వైర‌స్‌ను మనుషులపై బయో వెపన్‌గా వాడిన చైనా, షాకింగ్ విషయాలను వెల్లడించిన వుహాన్ ల్యాబ్ ప‌రిశోధ‌కుడు
Hazarath Reddyవుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఒక పరిశోధకుడు కరోనావైరస్ గురించి ఆశ్చర్యకరమైన వాదనలు చేశాడు, ఈ వైరస్‌ను చైనా “బయో ఆయుధం” గా రూపొందించిందని మరియు ఏది బాగా వ్యాప్తి చెందుతుందో తెలుసుకోవడానికి తన సహచరులకు వైరస్ యొక్క నాలుగు జాతులు ఇచ్చామని చెప్పారు
Sabrina Siddiqui: అమెరికాలో ప్రధాని మోదీని తన ప్రశ్నతో ఇరుకున పెట్టిన మహిళా జర్నలిస్టుపై వరుస దాడులు...తీవ్రంగా ఖండించిన వైట్ హౌస్..
kanhaఅధ్యక్షుడు జో బిడెన్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించినందుకు సోషల్ మీడియాలో అమెరికన్ జర్నలిస్టుపై జరిగిన దాడులను వైట్‌హౌస్ ఖండించింది. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని తెలిపింది.
Russia: వెనక్కు తగ్గిన పుతిన్, తిరుగుబాటు నేత వాగ్నర్ దళపతి ప్రిగోజిన్ పై జరుపుతున్న విచారణ రద్దు..అయినప్పటికీ కోపంతో రగిలిపోతున్న పుతిన్..
kanhaప్రైవేట్ సైన్యం 'వాగ్నర్' అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్ నేతృత్వంలోని సాయుధ తిరుగుబాటుకు సంబంధించిన నేర విచారణను రష్యా అధికారులు మంగళవారం ముగించారు. ప్రిగోజిన్ తో పాటు తిరుగుబాటులో పాల్గొన్న ఇతర యోధులపై ఉన్న అన్ని అభియోగాలను కూడా తొలగించినట్లు అధికారులు తెలిపారు.
Diwali Holiday In New York: న్యూయార్క్‌లో దీపావళి నాడు స్కూళ్లకు సెలవు, గర్వంగా ఉందంటూ ఆనందాన్ని వ్యక్తం చేసిన నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్
Hazarath Reddyహిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు న్యూయార్క్ (New York) ప్రాధాన్యత కల్పించింది. దీపావళి పర్వదినాన న్యూయార్క్‌లో పాఠశాలలకు సెలవుదినంగా (School Holiday) ప్రకటించింది.ఈ మేరకు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ( Eric Adams) సోమవారం ప్రకటన విడుదల చేశారు. దీపావళి రోజున స్కూళ్లకు సెలవు ప్రకటించే చట్టంలో భాగమైనందుకు గర్విస్తున్నట్లు చెప్పారు
Dr BR Ambedkar Way: వీడియో ఇదిగో, న్యూయార్క్‌లోని రోడ్ల కూడలికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు, భారతీయ-అమెరికన్లు అనుబంధం ఉండేలా నేమ్
Hazarath Reddyఅమెరికాలోని న్యూయార్క్‌లోని రోడ్ల కూడలికి భారతీయ-అమెరికన్లు అనుబంధం ఉండేలా పేరు మార్చారు. 61వ వీధి, బ్రాడ్‌వే కూడలికి ఇప్పుడు భారత రాజ్యాంగ పితామహుడిగా పేరుగాంచిన డాక్టర్ BR అంబేద్కర్ గౌరవార్థం పేరు పెట్టారు. ఈ చిన్న కూడలిని ఇప్పుడు 'డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వే'గా పిలుస్తున్నారు.
ICC Cricket World Cup 2023: అక్టోబర్ 15న పాకిస్తాన్‌ వర్సెస్ భారత్ మ్యాచ్, ప్రపంచకప్ 2023 షెడ్యూల్ ఇదిగో, ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న తొలి మ్యాచ్ ఆడనున్న టీం ఇండియా
Hazarath ReddyICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ప్రకటించింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్..అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్ vs పాకిస్థాన్ తలపడనున్నాయి. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్‌తో ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది.