Condoms Free In France: 18-25 ఏండ్ల యువతకు కండోమ్స్ ఫ్రీ... ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సంచలన నిర్ణయం
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 18-25 ఏండ్ల మధ్య వయసున్న యువతీ, యువకులకు త్వరలో ఉచితంగా కండోమ్స్ ను అందుబాటులో ఉంచనున్నట్టు గురువారం ప్రకటించారు.
Paris, Dec 9: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ (French President Emmanuel Macron) సంచలన నిర్ణయం తీసుకున్నారు. 18-25 ఏండ్ల మధ్య వయసున్న యువతీ, యువకులకు త్వరలో ఉచితంగా (Free) కండోమ్స్ ను (Condoms) అందుబాటులో ఉంచనున్నట్టు గురువారం ప్రకటించారు. అవాంచిత గర్భాలు, లైంగిక సంక్రమిత వ్యాధులు (ఎస్టీడీ-STD) నుంచి యువతను రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
అధికారుల ఐడీలతో వేలాది నకిలీ రేషన్ కార్డుల జారీ.. జార్ఖండ్ లో సైబర్ నేరగాళ్ల హల్ చల్
యువతతో ఇక్కడ నిర్వహించిన ఆరోగ్యానికి సంబంధించిన ఓ సంవాదంలో ఆయన ఈ ప్రకటన చేశారు. గర్భనిరోధకానికి సంబంధించి ఇదో చిరు విప్లవం అని మెక్రాన్ తన నిర్ణయాన్ని అభివర్ణించారు. కాగా, వచ్చే ఏడాది నుంచే ఇది అమల్లోకి రానున్నట్టు సమాచారం.
France to soon make condoms free for people aged 18 to 25https://t.co/tun6dFFgIS#France
— WION (@WIONews) December 8, 2022
(The above story first appeared on LatestLY on Dec 09, 2022 09:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

