New Delhi, May 31: ప్రపంచవ్యాప్తంగా ఆర్ధికమాంద్యం ఎఫెక్ట్ కొనసాగుతోంది. రిసిషన్ ఎఫెక్ట్ తో ఇప్పటికే పలు కంపెనీలు భారీగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. టెక్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటూ...నియమాకాలను నిలిపివేశాయి. అయితే టెక్ కంపెనీలతో పాటూ ఇతర సంస్థలు కూడా ఉద్యోగాల కోతవైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఉద్యోగాల్లో కోత పెట్టిన ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్ మాన్ సాచెస్ (Goldman Sachs) మరోసారి లే ఆఫ్స్ కు (Lay Offs) సిద్ధమైంది. రానున్న రోజుల్లో 250 మంది ఎంప్లాయిస్ ను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్వెస్టింగ్, బ్యాంకింగ్ రంగంలో ఇంతమంది ఉద్యోగుల తొలగింపు కలకలం సృష్టిస్తోంది. గోల్డ్ మాన్ సాచెస్ (Goldman Sachs) కంపెనీలో ప్రస్తుతం 45,400 మంది ఉద్యోగులు ఉన్నారు.
Goldman Sachs plans to cut under 250 jobs in coming weeks-source https://t.co/oWaD5ihP3z pic.twitter.com/ypBMVTZqmB
— Reuters (@Reuters) May 30, 2023
ఇప్పటికే తొలి త్రైమాసికంలో 3200 మంది ఉద్యోగులను తొలగించింది ఆ కంపెనీ. గతేడాది 500 మందిని ఉద్యోగం నుంచి తీసేసింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంతో పాటూ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు వంటి ప్రతికూల అంశాలతో గోల్డ్ మాన్ సాచెస్ పై ప్రభావం పడుతోంది. వాటి నుంచి బయటపడేందుకు లే ఆఫ్స్ ప్రకటిస్తోంది. అంతేకాదు ఈ ఏడాది బడ్జెట్ ను కూడా తగ్గించిందని, ఖర్చులను అదుపులో పెట్టుకునేందుకు కావాల్సిన అన్ని మార్గాలను పరిశీలిస్తోంది కంపెనీ.