Washington, June 22: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. ప్రధానికి బైడెన్ దంపతులు నేడు విందు ఇవ్వనున్నారు. రేపు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ దంపతులు ఏర్పాటు చేసే విందుకు మోదీ హాజరుకానున్నారు. ఇవాళ అమెరికా కాంగ్రెస్‌లో మోదీ ప్రసంగించనున్నారు. శ్వేత సౌధానికి వెళ్లేందుకు మోదీ వాషింగ్టన్ డీసీకి చేరుకొనే సమయానికి వర్షం పడుతోంది. అయినా, ఇండో-అమెరికన్లు ఆయన కోసం వేచి ఉండి స్వాగతం పలికారు. దీనిపై మోదీ ట్విటర్‌లో స్పందించారు. ‘‘వాషింగ్టన్ డీసీ చేరుకొన్నాను. భారతీయుల ఆత్మీయ స్వాగతం.. ఇంద్రదేవత ఆశీర్వాదం దీనిని మరింత స్పెషల్‌గా చేశాయి’’ అని పేర్కొన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi met US President Joe Biden and First Lady Jill Biden at the White House in Washington DC and exchanged gifts with them. pic.twitter.com/kac0i1u9ZN
— ANI (@ANI) June 22, 2023
అనంతరం ప్రధాని మోదీ వైట్ హౌజ్ కు (Modi meets Joe Biden) చేరుకున్నారు. అక్కడ జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ (Jil Biden) స్వాగతం పలికారు. జో బైడెన్, ఆయన కుటుంబీకులను మోదీ ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు. ఈ భేటీలో ఇరు దేశాధినేతలు ఆత్మీయ బంధాన్ని, స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకున్నారన్నారు. ఈ సందర్భంగా భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన సంగీత కార్యక్రమాన్ని స్టూడియో ధూమ్ అనే సంస్థ నిర్వహించింది.
#WATCH | Prime Minister Narendra Modi meets President of the United States Joe Biden at The White House, in Washington, DC.
(Source: Reuters) pic.twitter.com/wEr57FS2NX
— ANI (@ANI) June 21, 2023
ఇక ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షడు బైడెన్ ప్రత్యేక కానుకలు ఇచ్చారు. 20వ శతాబ్ధం ప్రారంభంలో పూర్తిగా చేతితో తయారు చేసిన పుస్తకం గ్యాలీ’ని, ఒక పురాత కెమెరాను, తొలి కొడాక్ కెమెరా కోసం జార్జ్ ఈస్ట్‌మన్‌కు జారీ చేసిన పేటెంట్ ఆర్కైవల్ కాపీ, అమెరికా వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ హార్డ్‌బుక్‌ను బైడెన్ బహూకరించగా.. ప్రముఖ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ సేకరించిన కవితల సైన్డ్ కాపీని జిల్ అందించారు.