New York, AUG 13: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై (Salman Rushdie) న్యూయార్క్ లో దాడి జరిగింది. చౌటాక్వా విద్యాసంస్థలో (Chautauqua Institution)ఆయన ప్రసంగించబోతుండగా, ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చిన ఆగంతుకుడు ఆయనపై దాడి చేశాడు. దాంతో సల్మాన్ రష్దీ (Salman Rushdie) కిందపడిపోయారు. వేదికపై ఉన్న వారు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. రష్దీని వెంటనే ఓ హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు. 1988లో సల్మాన్ రష్దీ రచించిన ‘ద శాటానిక్ వర్సెస్’ (The Satanic Verses) అనే పుస్తకం వివాదాస్పదమైంది. ఇస్లామిక్ ఛాందసవాదులను ఈ పుస్తకం తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. రష్దీ దైవదూషణకు పాల్పడ్డాడంటూ అతడిపై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో, రష్దీపై ఇరాన్ నేత అయతుల్లా ఖొమేనీ ఫత్వా కూడా విధించారు. రష్దీని చంపిన వారికి 3 మిలియన్ డాలర్ల నజరానా ప్రకటించింది ఇరాన్ (iran). సల్మాన్ రష్దీ ముస్లిం ఛాందసవాదుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న క్రమంలో ఆయనపై దాడి సంచలనం రేపింది.
Author Salman Rushdie stabbed on stage at a New York event , reports AP. #SalmanRushdie pic.twitter.com/6gGA4gyX1q
— TIMES NOW (@TimesNow) August 12, 2022
అమెరికాలో ఉంటున్న పాకిస్తాన్ కు (Pakisthan) చెందిన వ్యక్తి సల్మాన్ రష్దీపై దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ రష్దీపై దాడి ఘటన సంచలనం రేపింది. ఈ దాడి అక్కడున్న వారిని షాక్ కి గురి చేసింది. అసలేం జరుగుతుందో అర్థమయ్యే లోపే దుండగుడు దాడికి పాల్పడ్డాడు. 1947లో ముంబైలో జన్మించిన సల్మాన్ రష్దీ.. కొన్నాళ్ల తర్వాత బ్రిటన్‌కు తరలివెళ్లారు. 1981లో ఆయన తన రెండో నవల మిడ్ నైట్స్ చిల్డ్రన్ రచించారు. ఆ నవలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందాయి. ఆ నవలకు బ్రిటన్ ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ దక్కడంతో ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.
కాగా, ఆయన రచించిన పలు నవలలు వివాదాస్పదయ్యాయి. ముఖ్యంగా 1988లో రచించిన ‘ది సాతానిక్ వెర్సెస్’ (The Satanic Verses) నవల వివాదాలకు కేంద్రబిందువై.. ఆయనకు హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి. మతాన్ని కించపరుస్తోందని ఆరోపిస్తూ ఇరాన్‌లో ఈ నవలను నిషేధించారు. కాగా బెదిరింపుల నేపథ్యంలో దాదాపు పదేళ్ల పాటు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఎవరూ గుర్తు పట్టకుండా తరుచుగా ఇళ్లు మారారు. తాను ఎక్కడ నివాసం ఉంటున్నది తన పిల్లలకు కూడా చెప్పేవాడు కాదు సల్మాన్ రష్దీ.