Sai Varshith Kandula (PIC@ Twitter)

Washington, May 24: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు (To Kill US President) కుట్రపన్నిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు వైట్ హౌజ్ (White House) భద్రతా సిబ్బంది. ట్రక్కుతో వైట్ హౌజ్ లోకి దూసుకెళ్లేందుకు యత్నించాడు భారత సంతతికి చెందిన కందుల సాయివర్షిత్ (Sai Varshith). బారికేడ్లను ఢీకొడుతూ దూసుకెళ్లేందుకు యత్నించడంతో... అతన్ని అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు సేకరించారు. వైట్ హౌజ్ లోకి దూసుకెళ్లి...దాడి చేసేందుకు ఆరు నెలలుగా సాయివర్షిత్ ప్లాన్ చేస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో అతనిపై ర్యాష్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసంతో పాటూ, అమెరికా అధ్యక్షుడిపై హత్యాయత్నం కేసులను నమోదు చేశారు.

కందుల సాయివర్షిత్ (Sai Varshith Kandula) మిస్సోరి స్టేట్ చెస్ట్ ఫీల్డ్లో ఉంటున్నాడని, మిస్సోరి నుంచి వాషింగ్టన్ డీసీకి ఫ్లైట్ లో వచ్చినట్లు గుర్తించారు. అక్కడ ఒక ట్రక్కును తీసుకొని నేరుగా వైట్ హౌజ్ లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ట్రక్కుపై నాజీ జెండా ఉండటంతో....సాయివర్షిత్ ఎందుకు ఇలా చేశాడు. అతని వెనుక ఇంకా ఎవరున్నారనే అంశాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. అయితే సాయివర్షిత్ మానసిక స్థితి బాగోలేదని అతని సన్నిహితులు చెప్తున్నారు.