KIA Syros PIC@ X)

Mumbai, JAN 03: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) భారత్ మార్కెట్‌లో త్వరలో కంపాక్ట్‌ ఎస్‌యూవీ కియా సిరోస్‌ (Kia Syros) కారు ఆవిష్కరించనున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి కియా సిరోస్‌ (Kia Syros) కార్ల బుకింగ్స్‌ ప్రారంభం అయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు ఆన్‌లైన్‌లో గానీ, డీలర్‌షిప్‌ల వద్ద గానీ రూ.25,000 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. ఫిబ్రవరి ఒకటో తేదీన భారత్‌ మార్కెట్‌లో కియా సిరోస్‌ (Kia Syros) కారు ఆవిష్కరిస్తారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి డెలివరీ ప్రారంభం అవుతాయి. కియా కార్నివాల్‌ (Kia Carnival), కియా ఈవీ౩ (Kia EV3), కియా ఈవీ9 (Kia EV9) కార్ల నుంచి స్ఫూర్తిగా తీసుకుని కియా సిరోస్‌ (Kia Syros)కారును డిజైన్‌ చేశారు. బంపర్ ఎడ్జ్‌ మీద స్టాక్డ్‌ ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్స్‌, త్రీ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ యూనిట్లు, డిస్టినిక్టివ్‌ డ్రాప్ డౌన్‌ ఎల్‌ఈడీ డే టైమ్‌ రన్నింగ్ లైట్‌, సిల్వర్‌ అసెంటెడ్‌ బ్లాక్ ట్రిమ్‌ ఉంటాయి. ఏ-,సీ-, డీ పిల్లర్స్‌ విత్‌ బాడీ కలర్డ్ బీ-పిల్లర్స్‌, క్లీన్ విండో లైన్‌, ఫ్లష్‌ ఫిటింగ్‌ డోర్ హ్యాండిల్స్‌, వీల్‌ ఆర్చ్‌ క్లాడింగ్‌, 17- అంగుళాల 3- పెటల్‌ అల్లాయ్ వీల్స్‌, యునిక్‌ రేర్‌ విండో కింక్‌, రేర్‌లో హై మౌంటెడ్‌ ఎల్‌-షేప్డ్‌ టెయిల్‌ ల్యాంప్స్‌, టూ టోన్‌ రేర్ బంపర్ వంటి ఫీచర్లు ఉంటాయి.

Hyundai Creta Electric: త్వరలోనే మార్కెట్లోకి హ్యుండాయ్‌ నుంచి మరో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు, రెండు బ్యాటరీలు మరెన్నో ఫీచర్లు 

కియా సిరోస్‌ (Kia Syros)కారులో ఇన్‌ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌తోపాటు రీడిజైన్డ్‌ డాష్‌ బోర్డ్‌ విత్ డ్యయల్ 12.3 అంగుళాల డిస్‌ ప్లే, ఫోమింగ్‌ 30- అంగుళాల యూనిట్‌, టూ స్పోక్‌ స్టీరింగ్ వీల్‌, వైర్‌లెస్‌ చార్జింగ్ పాడ్‌, అంబియెంట్‌ లైటింగ్‌, ఫిజికల్‌ హెచ్‌వాక్ స్విచ్చెస్‌, ఏసీ వెంట్స్‌, హరిజొంటల్‌ డిజైన్‌ లైన్స్‌ తదితర ఫీచర్లు కూడా జత చేశారు. ఈ కారు ధర రూ.9.70 లక్షల (ఎక్స్ షోరూమ్‌) నుంచి రూ.16.70 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌) వరకూ పలుకుతుందని భావిస్తున్నారు. హ్యుండాయ్‌ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్‌ విటారా, సబ్‌ కంపాక్ట్ ఎస్‌యూవీలు టాటా నెక్సాన్‌, కియా సోనెట్‌, మారుతి బ్రెజా కార్లతో కియా సిరోస్‌ కారు పోటీ పడుతుంది.

KIA Syros Booking Starts

 

కియా సిరోస్‌ (Kia Syros)కారు రెండు ఇంజిన్‌ చాయిస్‌ల్లో లభిస్తుంది. ఒకటి 1.0 లీటర్ల 3-సిలిండర్ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తోంది. ఈ ఇంజిన్‌ గరిష్టంగా 120 హెచ్పీ విద్యుత్‌, 172 ఎన్‌ఎం టార్క్ వెలువరించడంతోపాటు 6-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ లేదా 7-స్పీడ్‌ డీసీటీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 1.5 లీటర్ల 4 సిలిండర్‌ టర్బో డీజిల్‌ ఇంజిన్‌తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 115హెచ్పీ విద్యుత్‌, 250ఎన్‌ఎం టార్క్ వెలువరిస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. వెన్యూ, క్రెటా, సొనెట్‌ తదితర మోడల్‌ కార్లలో ఈ ఇంజిన్లను హ్యుండాయ్‌, కియా వినియోగిస్తున్నాయి.