పిల్లలకు ఆఫీస్ కి వెళ్లే వారికి పొద్దున్నే లంచ్ బాక్స్ లోకి హడావిడిగా లేకుండా ఈజీగా తయారు చేసుకునే ఒక ఐటమ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది కుక్కర్లో ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే వెజిటేబుల్ బిర్యాని. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఉదయాన్నే చేసుకుంటే కాస్త టిఫిన్ గా కాస్త లంచ్ కూడా తీసుకెళ్లొచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు అయితే దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
బాస్మతి రైస్ రెండు కప్పులు.
నెయ్యి రెండు టేబుల్ స్పూన్స్
నూనె మూడు టేబుల్ స్పూన్స్
మరాఠీ మొగ్గ 2
లవంగాలు2
దాల్చిన చెక్క2
షాజీరా, యాలకులు, బిర్యానీ ఆకు .
ఉల్లిపాయ ఒకటి
పచ్చిమిర్చి రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు
పసుపు పావు టీ స్పూన్
ఉప్పు రుచికి సరిపడనంత
జీలకర్ర పొడి
కారం,
గరం మసాలా
ధనియాల పొడి
టమాటాలు ఒకటి
పెరుగు 1/2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్లు
బఠానీలు
క్యారెట్
Health Tips: ఖాళీ కడుపుతో లీచీ తింటే ప్రాణాపాయం..
తయారీ విధానం
ముందుగా బాస్మతి రైస్ ను కడిగి అరగంటసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బటానీల్లో కూడా అదే విధంగా నానబెట్టుకోవాలి. మనం తీసుకున్న కూరగాయ ముక్కలను కూడా అన్ని చిన్నచిన్న ముక్కలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చిని సన్నగా తురుముకోవాలి. కొత్తిమీర, పుదీనాను కూడా సన్నగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలి. అది వేడి అయ్యాక దానిలో కాస్త నూనె నెయ్యి రెండు కూడా వేసుకోవాలి. అవి వేడయ్యాక మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క లవంగాలు యాలకులు, షాజీరా వంటివి వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు వేయించాలి. తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకోవాలి. తర్వాత అవి వేగడానికి కొంత సమయం పడుతుంది. ఈలోపు దానిలో క్యారెట్ ముక్కలను వెయ్యాలి. కొంచెం సాల్ట్ జీలకర్ర పొడి గరం మసాలా ధనియాల పొడి అన్ని వేసి కలపాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలో పావు కప్పు పెరుగు పుదీనా ఆకులు కొత్తిమీర తురుమును కూడా వేసేసి రెండు నిమిషాల పాటు కలపాలి. ఇప్పుడు కాస్త ఉడికిన తర్వాత నూనె పైకి తేలుతుంది. ఈ సమయంలో నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేయాలి వీటితో పాటు బఠానీలు కూడా వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు మూడు కప్పుల నీటిని కుక్కర్లో పోసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. రెడీ ఎంతో టేస్టీ టేస్టీ ఈజీగా రెడీ అయ్యే వెజిటేబుల్ బిర్యాని పిల్లలకు ఇది చాలా బాగా నచ్చుతుంది. కూరగాయలు తినని పిల్లలకు ఇది చాలా నచ్చుతుంది. పిల్లలు కాదు పెద్దలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. దీన్ని రైతాతో కలిపి కాంబినేషన్ గా తీసుకుంటే చాలా బాగుంటుంది. లేదా వెజ్ కర్రీ అయినా లేదా నాన్ వెజ్ కర్రీ అయినా లేదా పన్నీర్ కర్రీ తో కూడా దీన్ని తీసుకోవడం వల్ల హెల్త్ కి హెల్తీ టేస్టీ టేస్టీ ఉన్న వెజిటేబుల్ బిర్యాని రెడీ మీరు కూడా ట్రై చేయండి.