Hyderabad, Jan 5: నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) సినిమా టికెట్ల ధర (Ticket Price)) పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ చిత్రానికి బెనిఫిట్ షోతో పాటు 2 వారాల పాటు రోజుకు ఐదు షోల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ శనివారం ఉత్తర్వు లు జారీచేసింది. బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా ఈనెల 12న రానుంది. 12న ఉదయం 4 గంటలకు బెనిఫిట్ షో టికెట్ కు రూ.500 వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 2వారాల పాటు మల్టీప్లెక్స్ లో టికెట్ పై అదనంగా రూ.135, సింగిల్ స్ర్కీన్ లో రూ.110 పెంచేందుకు సమ్మతి తెలిపింది.
డాకు మహారాజ్ స్పెషల్ షో, టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి..
ఈ నెల 12న ఉదయం 4 గంటలకు బెనిఫిట్ షో
టికెట్ ధర రూ.500, మల్టీప్లెక్స్‌ల్లో రూ.135, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.110
రోజుకు ఐదు ఆటలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం pic.twitter.com/NJ1QH5beFm
— BIG TV Breaking News (@bigtvtelugu) January 5, 2025