Hyd, January 5: కాంగ్రెస్ పార్టీ అంటే మోసం, దగా, నయవంచన అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ చేతిలో రైతులు మోసపోతున్నారు అన్నారు. రైతులకు,కౌలు రైతులకు 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పారు.. డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే గ్యారెంటీ అని రాహుల్ గాంధీ అన్నారు అని గుర్తు చేశారు.
రైతు భరోసా 12 వేలకు కుదించి సంబరాలు చేయాలని కాంగ్రెస్ అంటోంది..కాంగ్రెస్ అబద్దాలకు డిక్షనరీలో కొత్త పదాలు కనిపెట్టాలన్నారు. రైతు రుణమాఫీ,రైతు బంధుకు లక్ష కోట్లు కేసీఆర్ ఖర్చు పెట్టారు.. కేసీఆర్ రైతుబందుగా నిలిచారు... రేవంత్ రెడ్డి రాబందుగా మిగులుతారు అన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు తెలంగాణకు వచ్చే దమ్ము ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల పరిస్థితులు బాగుండేదని రేవంత్ రెడ్డి అన్నారు... సీఎం పదవిలో కూర్చొని రేవంత్ రెడ్డి తెలంగాణను కించపరిచారు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు పిఆర్సీ, డీఏ ఇచ్చింది బిఆర్ఎస్ కాదా.. రాష్ట్రం దివాళా తీసిందని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు..కాంగ్రెస్ నేతల మానసిక పరిస్థితి బాగలేదు అన్నారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని నాశనం చేసింది రేవంత్ రెడ్డి.. హైడ్రా,మూసీతో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. సంవత్సరంలో లక్షా 38 వేల కోట్ల అప్పు చేశారు.. కేసీఆర్ అప్పు చేస్తే ప్రజలకు పంచారు.. పైసలు ఢిల్లీకి మూటలు పంపుతున్నారా చెప్పాలన్నారు. దివాళా తీసింది రేవంత్ రెడ్డి మెదడు.. 5,943కోట్ల రెవిన్యూ మిగులుతో రాష్ట్రాన్ని అప్పగించాము.. రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు అబద్ధం మాట్లాడుతున్నారు అన్నారు. ఇది ఆర్ధిక సాయం కాదు…ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహం, సివిల్స్‌లో మనవాళ్లే రాణించాలన్న సీఎం రేవంత్ రెడ్డి
రైతు భరోసా ఎందుకు ఇవ్వరో రేవంత్ రెడ్డి చెప్పాలి.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు,మండల కేంద్రాలు,నియోజకవర్గ కేంద్రాల్లో రైతులకు మద్దతుగా నిరసనలు తెలుపుతాము...హార్టికల్చర్ రైతులకు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అనే దానిపై క్లారిటీ లేదు అన్నారు. ఉద్యోగులకు భూమితో సంబంధం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గండం దాటేందుకు రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రైతు బంధు పధకం ఉండాలా వద్దా అనేది రైతులు నిర్ణయం తీసుకోవాలి.. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోండన్నారు.