Poonam Kaur Again targets Trivikram Srinivas, MAA Responds(X)

Hyd, January 5:  పూనమ్ కౌర్ ట్వీట్ పై మా అసోసియేషన్ స్పందించింది. పూనమ్ కౌర్ ట్వీట్ పై క్లారిటీ ఇచ్చారు మా కోశాధికారి శివబాలాజీ. పూనమ్ కౌర్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదు అందలేదన్నారు.

మా టర్మ్ కంటే ముందు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా రికార్డులలో లేదు అన్నారు. పూనమ్ కౌర్ ట్విట్టర్ లో పెట్టడం వల్ల ఉపయోగం లేదు... మా అసోసియేషన్ ను కానీ, న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు.  సినీనటి మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆవేశంతోనే మాధవిలతపై ఆ పదం వాడానని వెల్లడి... వీడియో

త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేసినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పట్టించుకోవడం లేదంటూ ఆరోపించింది పూనమ్ కౌర్. నా జీవితాన్ని త్రివిక్రమ్ నాశనం చేశాడని ఎన్ని సార్లు మా అసోసియేషన్ కు కంప్లైంట్ ఇచ్చిన కనీసం ప్రశ్నించారా అంటూ మా అసోసియేషన్ ప్రశ్నిస్తూ పూనమ్ ట్వీట్ చేయగా మా అసోసియేషన్ స్పందించింది.

Poonam Kaur Again targets Trivikram Srinivas, MAA Responds