Entertainment

Meera Chopra Issue: మీరా చోప్రా ఫిర్యాదుపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్, నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామి, ధన్యవాదాలు తెలిపిన టాలీవుడ్ నటి

Team Latestly

సినీ నటి మీరా చోప్రా ఫిర్యాదుపై తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. మీరా చోప్రా చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితులకు చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని...

Rohit Roy: ర‌జ‌నీకాంత్‌కి క‌రోనా పాజిటివ్‌ అంటూ రోహిత్ రాయ్ పోస్ట్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆడేసుకుంటున్న నెటిజన్లు, రోహిత్ పోస్ట్ మీద కామెంట్లతో దాడీ

Hazarath Reddy

దక్షిణాది సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కి (Rajinikanth) ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌లోనే కాక ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కొంద‌రు ఆయ‌న‌ని దేవుడిగా కూడా కొలుస్తారు. మ‌రికొంద‌రు ప్రాణ కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ర‌జ‌నీకాంత్ అనారోగ్యంకి సంబంధించి ఏదైన వార్త బ‌య‌ట‌కి వ‌స్తే కుటుంబ స‌భ్యుల క‌న్నా ఎక్కువ‌గా అభిమానులు ఆందోళ‌న చెందుతారు. మరి అలాంటి వ్యక్తి మీద ఏదైనా పోస్ట్ పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అయతే ఇవేమి ఆలోచించకుండా యాక్టర్ రోహిత్ రాయ్ (Rohit Roy) పోస్ట్ పెట్టేశారు.

Sonu Sood: నిసర్గ తుఫాన్ కల్లోలం, 28 వేల మందికి సాయం చేసిన సోనూసూద్‌, వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపేందుకు కోట్లు ఖర్చు పెట్టిన సోనూ భాయ్

Hazarath Reddy

సోనూసూద్‌..ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. వలస కార్మికుల దగ్గర నుంచి నిన్న నిసర్గ తుఫాన్ వరకు ఆయన (Sonu Sood) చేసిన సాయం ఎనలేనిది. లాక్‌డౌన్‌ (Lockdown) కాలంలో వలస కార్మికుల పట్ల నిజమైన హీరోగా నిలిచిన ఆయన.. తాజాగా తుపాను ప్రభావం నుంచి వేలాది మందిని కాపాడారు. నిసర్గ (Cyclone Nisarga) ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో దాదాపు 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వారికి ఆహారం పంపిణీ చేసి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.

N.T. Rama Rao Birth Anniversary: నందమూరి తారక రామారావు 97వ జయంతి, ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్న ప్రముఖులు, సినిమాల్లో,రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు

Hazarath Reddy

నేడు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామరావు 97వ జయంతి (NTR 97th Birth Anniversary) సందర్భంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. బాలకృష్ణతో పాటుగా ఆయన సతీమణి వసుంధర, నందమూరి రామకృష్ణ, సుహాసిని.. ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్‌ (Nandamuri Taraka Rama Rao) అని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్‌ నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని అన్నారు.

Advertisement

RGV Coronavirus Trailer: వర్మ 'కరోనా వైరస్‌' ట్రైలర్, జగన్,కేసీఆర్‌ పారాసిటామాల్, బ్లీచింగ్ పౌడర్ డైలాగ్స్ ట్రైలర్‌కి హైలైట్‌, యూట్యూబ్‌లో ట్రెండింగ్ ఇదే

Hazarath Reddy

ప్రముఖ దర్శకుడు‌, నిర్మాత రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) ట్రెండింగ్‌లో ఉన్న వాటిపై సినిమాలు తీసి ఇప్పటికే చాలాసార్లు సక్సెస్‌ అయ్యారు. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై ఫీచర్‌ ఫిల్మ్‌ చేసినట్లు వర్మ ఇది వరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం తన కొత్త సినిమా 'కరోనా వైరస్‌' ట్రైలర్‌ను (Coronavirus Trailer) యూట్యూబ్‌ చానెల్‌లో రిలీజ్‌ చేశారు. 4 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ను చూస్తున్నంత సేపు చాలా భయపెట్టేలా ఉంది.

Lights! Camera! Action! : జూన్ నుంచి సినిమా షూటింగ్స్ జరుపుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్, విధివిధానాలు రూపొందించాలని ఆధికారులకు ఆదేశాలు, సినిమా హాళ్లను తిరిగి తెరవడంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడి

Team Latestly

షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు....

Tollywood News: లైట్స్- కెమెరా- యాక్షన్ ఎప్పుడు? 'సినిమా కష్టాలను' తెలంగాణ మంత్రికి వివరించిన టాలీవుడ్ పెద్దలు, చిరంజీవి ఇంట్లో ప్రత్యేక భేటీ, తలసాని ఇచ్చిన హామి ఇదే!

Team Latestly

తెలంగాణ ప్రభుత్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్ల ఎప్పుడూ సానుకూల ధోరణితో ఉంటుందని చెప్పారు. దేశంలోనే హైదరాబాద్ నగరం చిత్రరంగానికి హబ్ గా నిలిచిందని అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు అనుమతించే విధంగా ఇప్పటికే....

Nagababu Controversy Tweet: నాగబాబు గాడ్సే ట్వీట్ దుమారం, నన్ను అర్థం చేసుకోవాలంటూ మరో ట్వీట్, మహాత్మా గాంధీ గురించి ట్విట్ చేసి ఆవేదన వ్యక్తం చేసిన నటి విజయశాంతి

Hazarath Reddy

నాథూరాం గాడ్సే (Nathuram Godse) అసలు సిసలైన దేశభక్తుడంటూ సీనియర్ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్లు (Nagababu Controversy Tweet) పెను దుమారాన్ని రేపాయి.ఈ కామెంట్లపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. మీ అన్నాతమ్ముళ్లు అయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ పరువు ఎందుకు తీస్తున్నావంటూ మెగా అభిమానులు నాగబాబుపై మండిపడ్డారు. వివాదాస్పద అంశాలపై మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ నాగబాబు మీద ఆవేశం వెళ్లగక్కారు. దీనిపై నాగబాబు మళ్లీ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. అందరూ తనను అర్థం చేసుకోవాలని, తన మాటల్లో అర్థం ఇదేనని మరో ట్వీట్ చేశారు.

Advertisement

Chiranjeevi Dance Video: పాత హీరోయిన్లతో కొత్తగా స్టెప్పులేసిన చిరంజీవి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెగాస్టార్ లేటెస్ట్ డ్యాన్స్

Hazarath Reddy

ఉగాది పండగ సందర్భంగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన చిరంజీవి (Chiranjeevi) ఆ తర్వాత ఎంతో యాక్టివ్‌గా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఒకవైపు కరోనాపై అవగాహన కల్పిస్తూనే తన అభిమానులకు కావాల్సినంత ఫన్‌ అందిస్తున్నాడు. తాజాగా చిరంజీవి అలనాటి హీరోయిన్లు అయిన సుహాసిని, ఖుష్బూ, జయసుధ, రాధ, రాధక, లిజి ప్రియదర్శన్‌లతో కలసి స్టెప్పులేసిన వీడియోను (Chiranjeevi Dance Video) తన ట్వీటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

Rishi Kapoor Demise: బాలీవుడ్ ‘బాబీ’ హీరో రిషికపూర్ కన్నుమూత, . క్యాన్సర్‌తో పోరాడుతూ తిరిగిరాని లోకాలకు, సంతాపం వ్యక్తం చేసిన బాలీవుడ్ ప్రముఖులు

Hazarath Reddy

ఇర్ఫాన్ ఖాన్ విషాదం మరవక ముందే బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు రిషీకపూర్‌ (67) (Rishi Kapoor Demise) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషి కపూర్‌ను (Rishi Kapoor) కుటుంబ సభ్యులు ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన గురువారం మరణించారు.

RIP Irrfan Khan: ఇర్ఫాన్ ఖాన్ మరణం దేశానికి తీరని లోటు, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, తెలివైన నటుడిని కోల్పోయామన్న మహేష్ బాబు, ఇంకా ఎవరెవరు ఏమన్నారంటే..

Hazarath Reddy

ప్రముఖ బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ కారణంగా మృతి (Irrfan Khan Dies at 53) చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి వార్తతో భారతీయ చిత్ర పరిశ్రమ (Indian Cinima) ఆవేదనకు గురైంది. ఇర్ఫాన్ (Irrfan Khan) మరణం పట్ల భారత ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah), రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ram Nath Kovind) ఇంకా ఇతరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Actor Irrfan Khan Passes Away: బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత, కన్నతల్లిని కడసారి కూడా చూడలేకపోయిన బాలీవుడ్ నటుడు, పాన్ సింగ్ తోమర్ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమనటుడి అవార్డు

Hazarath Reddy

ప్రముఖ్ బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌(54) (Irrfan Khan Passes Away) ఇకలేరు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బుధవారం ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రిలో (Mumbai’s Kokilaben Dhirubhai Ambani Hospital) తుది శ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో పోరాటం చేస్తున్న ఈ నటుడు కొన్నాళ్లు లండన్‌లో చికిత్స కూడా తీసుకున్నాడు. ఇందుకు ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అయితే క్యాన్సర్‌ నుంచి కోలుకున్న అనంతరం చివరిగా ఆంగ్రేజీ మీడియం (Angrezi Medium) సినిమాలో నటించారు.

Advertisement

Three Years of Baahubali 2: బాహుబలి 2కి మూడేళ్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆనందాన్ని పంచుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, చిత్ర బృందానికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన బాహుబలి

Hazarath Reddy

బాహుబలి-2 ది కన్‌క్లూజన్’‌ సినిమా (Three years of Baahubali 2) ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రోజుతో(మంగళవారం) సరిగ్గా మూడేళ్లు పూర్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ (Prabhas) బాహుబలి చిత్ర బృందానికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపుతూ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో ట్వీట్ చేశారు. తన జీవితంలో ఇది అతిపెద్ద సినిమా అని, ఎప్పటికీ గుర్తిండేపోయే మధుర జ్ఞాపకమని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Vijay Deverakonda : 'అకౌంట్లో సరిపోయే డబ్బుల్లేవు, అయినా నాకేం కొత్త కాదు'.. కరోనావైరస్ సంక్షోభంలో దెబ్బతిన్న వారికి రూ. 1.30 కోట్ల ఫండ్‌తో సహాయం ప్రకటించిన విజయ్ దేవరకొండ

Team Latestly

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా నష్టపోయారు. అందులో తానూ ఒకడినని, తనకు కూడా గట్టిగానే దెబ్బ తగిలిందని టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అన్నారు. తన అకౌంట్లో కూడా సరిపోయే డబ్బుల్లేవని......

Tamil Actors Fans War: ఇద్దరి అగ్ర హీరోల ఫ్యాన్స్ వివాదం, ఒకరిని హత్య చేసిన మరొకరు, నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించిన మరకనం పోలీసులు

Hazarath Reddy

అభిమానం నిజంగా కొన్ని సమయాల్లో ప్రాణాంతకమవుతుంది. ఇలాంటి అనేక సంఘటనలు గతంలో సాక్ష్యమిచ్చాయి. కోలీవుడ్ తారలు రజనీకాంత్, విజయ్ ల మతోన్మాదం కారణంగా తమిళనాడులో ఇలాంటి ఒక షాకింగ్ సంఘటన జరిగింది. కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్ మీ హీరో నే తక్కువ ఇచ్చాడు. లేదు మా హీరోనే ఎక్కువగా ఇచ్చారంటూ అభిమానులు ఒకరినొకరు తిట్టుకున్నారు. అది చివరికి చిలికి చిలికి గాలివానలా మారి హత్యకు దారితీసింది.

Be The Real Man Challenge: తారక్ ఛాలెంజ్ పూర్తి చేసిన చిరు. కేటీఆర్‌,రజినీకాంత్‌ల‌ను నామినేట్ చేసిన మెగాస్టార్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న బి ది రియల్‌ మ్యాన్‌ ఛాలెంజ్

Hazarath Reddy

ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘బి ది రియల్‌ మ్యాన్‌’ (Be The Real Man Challenge) ట్రెండ్‌ కొనసాగుతుంది. ఇంటి పనులను మగవాళ్లు కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో దర్శకుడు సందీప్‌ వంగ స్టార్‌ చేసిన ‘బీ ది రియల్‌ మ్యాన్‌’ (Be The Real Man) ఛాలెంజ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌ అవుతోంది. తాజాగా హీరో ఎన్టీఆర్‌ (Jr NTR) నుంచి ఈ చాలెంజ్‌ను స్వీకరించిన మెగాస్టార్‌ చిరంజీవి (chiranjeevi) దానిని విజయవంతంగా పూర్తి చేశారు.

Advertisement

Vijay Devarkonda: పోలీసులకు బూస్ట్ ఇచ్చిన అర్జున్ రెడ్డి, ప్రాణాలకు తెగించి మా కోసం కష్టపడుతున్నారు, మీ అందరికీ వందనాలు

Hazarath Reddy

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు ప్రాణాలకు తెగించి తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) పోలీస్ అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చ‌టించారు. హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ లో సోమ‌వారం సాయంత్రం ఈ కార్య‌క్ర‌మాన్ని హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ (Police Commissioner Anjani Kumar) ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌మ విధుల‌ను నిర్వ‌ర్తిస్తూ నిజ‌మైన హీరోలుగా నిలుస్తున్న పోలీసుల అధికారుల‌ను, వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప‌ల‌క‌రించారు.

Chiranjeevi: ఆ మహిళ మా అమ్మకాదు, సమాజసేవలో మెగాస్టార్ తల్లి కథనంపై వివరణ ఇచ్చిన చిరంజీవి, కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మేనంటూ పొగడ్తలు

Hazarath Reddy

కరోనాపై పోరులో మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) తల్లి అంజనాదేవి త‌న వంతు సాయంగా 700 మాస్క్‌లు తయారు చేసిందని మీడియాలో ప‌లు వార్తలు వ‌చ్చాయి. తన వృద్దాప్యాన్ని కూడా లెక్కచేయకుండా స్నేహితురాళ్లతో కలిసి మాస్క్‌లు కుట్టిందని, అవసరమైన వారికి వాటిని పంచిందన్న‌ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ క‌థ‌నాల‌పై మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.

Mahesh Babu Salutes Police: సెల్యూట్ తెలంగాణ పోలీస్ అంటున్న సూపర్ స్టార్ మహేశ్, కఠిన సమయాల్లో దేశ ప్రజల కోసం అవిశ్రాంతంగా, నిస్వార్థంగా శ్రమిస్తున్న పోలీసులకు సెల్యూట్ అంటూ ట్వీట్

Vikas Manda

ఇంతటి కఠిన సమయాల్లో మా ప్రాణాలను, మా కుటుంబాల ఆరోగ్యాన్ని మా కాపాడుతున్న తెలంగాణ పోలీసులకు అపారమైన కృతజ్ఞతలు. ఈ దేశం పట్ల, దేశంలోని ప్రజల పట్ల మీరు ప్రదర్శిస్తున్న నిస్వార్థమైన అంకితభావానికి నా సెల్యూట్" #TelanganaPolice #StayHomeStaySafe అంటూ మహేశ్ ట్వీట్....

Pushpa First Look: మనసుల్ని దోచేసే స్మగ్లర్.. 'పుష్ప' ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా అదరగొట్టిన స్టైలిష్ స్టార్! అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా డబుల్ ఫ్యాన్స్‌కి దమాఖా గిఫ్ట్ ఇచ్చిన మూవీ మేకర్స్

Vikas Manda

ఈరోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లలో అల్లు అర్జున్ లుక్ చూపరుల మతులు పోగొడుతుంది. ఇదివరకు ఎప్పుడూ చూడని అవతారంలో స్టైలిష్ స్టార్ పూర్తిగా రఫ్ లుక్‌లో దర్శనమిస్తున్నాడు. అల్లు అర్జున్ మాసిన బట్టలతో, చెదిరిన జుట్టుతో ఒక మూలన కూర్చుని పదునైన కళ్లతో క్రూరంగా చూస్తూ ఉండగా అతడి చుట్టూ......

Advertisement
Advertisement