ఎంటర్టైన్మెంట్
Devara – Part 1: కొత్త షెడ్యూల్‌ కోసం గోవాకు బయలు దేరిన దేవర టీం, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ దేవరను కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
SSMB29 Update: మహేశ్‌ బాబు-రాజమౌళి సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన జక్కన్న, స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది ఇక పట్టాలెక్కడమే తరువాయి అని వెల్లడి
Hazarath Reddyతన తర్వాతి ప్రాజెక్ట్‌ అయిన SSMB29 గురించి ఆయన మాట్లాడారు.మహేశ్‌ బాబుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు.
Magadheera Re Release: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న మగధీర, మార్చి 26న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల, మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు
Hazarath Reddyగీతా ఆర్ట్స్ పతాకంపై రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మెగా బ్లాక్ బస్టర్ మగధీర చిత్రం మార్చి 26న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక రోజు ముందే పండగ రాబోతుంది
Arundhati Nair Hospitalized: ఐసీయూలో చావు బతుకుల మధ్య పోరాడుతున్న ప్రముఖ నటి, రోడ్డు ప్రమాదానికి గురైన మళయాళి హీరోయిన్‌ అరుంధతి నాయర్‌
Hazarath Reddyప్రముఖ మళయాళి హీరోయిన్‌ అరుంధతి నాయర్‌ రోడ్డు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాల పాలైన ఆమెను తిరువనంతపురంలోని ఆస్పత్రిలో చేర్పించగా ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని నటి గోపిక అనిల్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించింది.
Singer Mangli: గాయని మంగ్లీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. హైదరాబాద్-బెంగళూరు రహదారిపై మంగ్లీ కారును ఢీకొట్టిన డీసీఎం.. మంగ్లీతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
Rudraతెలంగాణ పాటలతో ప్రజాదరణ పొందిన ప్రముఖ గాయని మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును డీసీఎం వెనక నుంచి ఢీకొట్టగా ఆమెతో పాటు కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
Kalki 2898 AD release: ప్ర‌భాస్ సినిమాకు ఎన్నిక‌ల గండం, క‌ల్కి సినిమా అనుకున్న తేదీకి విడుద‌ల‌య్యే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌, మే 9న మూవీ రిలీజ్ క‌ష్ట‌మే అంటూ జోరుగా చ‌ర్చ‌
VNSపాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్న కల్కి చిత్రానికి ఎన్నికలు అడ్డుపడే అవకాశం ఉంది. దీంతో మే 9న విడుదల కానున్న కల్కి సినిమా దాదాపు వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్‌ మార్కెట్‌ ఎక్కువ.. అలాంటిది ఎన్నికలకు కేవలం నాలుగు రోజుల ముందు కల్కి సినిమాను విడుదల చేస్తే పలు ఇబ్బందులు ఎదురు కావచ్చు.
Rajinikanth Metro Rail: హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ను సందర్శించిన రజినీకాంత్‌.. ముగ్ధుడైన సూపర్ స్టార్
Rudraసూపర్ స్టార్ రజినీకాంత్‌ హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ను సందర్శించారు. ఉప్పల్‌ లోని ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైల్‌ ఆపరేషన్స్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఓసీసీ)లో పర్యటించారు.
Andhra Pradesh Elections 2024: పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తున్నానని తెలిపిన దర్శకుడు వర్మ, ట్విట్టర్ వేదికగా వెల్లడి
Hazarath Reddyదర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పిఠాపురం నుంచి పోటీ చేస్టున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికి ఆర్జీవీ కూడా పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్నట్లు వెల్లడించడం గమనార్హం. ‘ఇది ఆకస్మిక నిర్ణయం. నేను పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్నా.
Geethanjali Suicide Case: గీతాంజలి మృతిపై స్పందించిన నటి పూనమ్ కౌర్, ఆ పసి పిల్లలకు న్యాయం చేయండి అంటూ ట్వీట్
Hazarath Reddyగీతాంజలి ఆత్మహత్య ఘటనపై నటి పూనమ్‌ కౌర్‌ స్పందించింది.. గీతాంజలికి న్యాయం జరగాలని డిమాండ్‌ చేసింది. గీతాంజలికి న్యాయం జరగాలి. అసలు ఆమె విషయంలో ఏం జరిగింది? గీతాంజలి ఎందుకు సూసైడ్‌ చేసుకునే పరిస్థితి వచ్చింది? ఓ పార్టికి చెందిన ఆన్‌లైన్‌ ట్రోలర్స్‌ కారణంగానే ఆమె చనిపోయిందా? అమ్మాయిల మీద పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం వారికి బాగా అలవాటు.
Director Varma Slams Nara Lokesh: నువ్వు మూర్ఖుడివే అనుకున్నా.. మూగవాడివి అని ఇప్పుడు తెలిసింది, లోకేష్‌ గ్రాఫిక్స్‌ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన వర్మ
Hazarath Reddyముఖ్యమంత్రి జగన్‌ సభలో జనాలే లేరంటూ. అదంతా గ్రాఫిక్స్‌ అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ మీద డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ తనదైన స్టైల్లో పంచులు విసిరారు. లోకేష్‌ను ఉద్దేశిస్తూ..'మీ అజ్ఞానానికి అవధులు లేవు.. మీకు సినిమా పరిశ్రమలో చాలా మంది స్నేహితులు ఉన్నారు.
Thalapathy Vijay Denounces CAA: సీఏఏని వ్యతిరేకించిన తమిళ హీరో దళపతి విజయ్, స్టాలిన్ సర్కారు అమలుచేయబోమని ప్రజలకు హామీ ఇవ్వాలంటూ ప్రకటన
Hazarath Reddyవివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) చీఫ్ దళపతి విజయ్ స్పందించారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని ఈ చట్టాన్ని అమలు చేయవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రజలకు నేతలు హామీ ఇవ్వాలని Thalapathy Vijay డిమాండ్ చేశారు.
Director Surya Kiran Dies: పచ్చ కామెర్లకు చికిత్స పొందుతూ టాలీవుడ్‌ దర్శకుడు సూర్య కిరణ్‌ మృతి, సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు
Hazarath Reddyటాలీవుడ్‌లో సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు సూర్య కిరణ్‌ (51) కన్నుమూశారు. పచ్చ కామెర్ల కారణంగా చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారని తెలుస్తోంది
Adult Film Star Emily Willis: ప్రముఖ పోర్న్ తార ఎమిలీ విల్లీస్‌కు గుండెపోటు, ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్న అడల్ట్ ఫిల్మ్ స్టార్
Hazarath Reddyఅడల్ట్ ఫిల్మ్ స్టార్ ఎమిలీ విల్లీస్ యుఎస్‌లోని గుండెపోటుకు గురైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో కార్డియాక్ అరెస్టుతో పోరాడుతోందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 20 లక్షలకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న ఎమిలీ విల్లీస్ కాలిఫోర్నియాలోని ఒక ప్రముఖ పునరావాస కేంద్రంలో గత నెలలో గుండెపోటుకు గురై ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.
Prabhas, Allu Arjun Fans: ప్రభాస్ అభిమానిని రక్తం వచ్చేలా కొట్టిన అల్లు అర్జున్ ఫ్యాన్స్.. బెంగుళూరులో ఘటన.. వీడియో వైరల్
Rudraబెంగళూరులో అల్లు అర్జున్ అభిమానులు హల్ చల్ సృష్టించారు. ఓ పది మంది బన్నీ ఫ్యాన్స్ కలిసి ప్రభాస్ అభిమానిని రక్తం వచ్చేలా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Oscar Awards 2024: అట్టహాసంగా ఆస్కార్‌ వేడుకలు.. పురస్కారాల్లో ఓపెన్‌ హైమర్‌ సినిమా సందడి.. ఉత్తమ చిత్రంగా ఎంపిక, ఉత్తమ నటుడుగా కిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌ హైమర్‌), ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్), ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఓపెన్‌ హైమర్‌).. విజేతల పూర్తి వివరాలు ఇవిగో..
Rudraసినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ఆస్కార్‌ అవార్డుల వేడుక అట్టహాసంగా సాగుతున్నది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం కొనసాగుతోంది.
Oscars 2024 Winners: బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న ది బాయ్ అండ్ ది హెరాన్
Rudraఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘ది బాయ్ అండ్ ది హెరాన్’ అకాడమీ పురస్కారాన్ని సొంతం చేసుకుంది.
Oscars 2024 Winners Full List (LIVE): కన్నులపండుగగా జరుగుతున్న ఆస్కార్ అవార్డు వేడుకలు.. పోటీలో సత్తాచాటుతున్న సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు (లైవ్ లో)
Rudraప్రపంచ సినీలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా కొనసాగుతున్నది. ప్రతిష్ఠాత్మక 96వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవానికి లాస్ ఏంజిల్స్‌ వేదికైంది.
Sophia Leone Passedaway: శృంగార తార సోఫియా లియోన్ ఆకస్మిక మరణం.. సొంత అపార్ట్ మెంట్ లో విగాతజీవిగా కనిపించిన పోర్న్ స్టార్
Rudraపోర్న్ స్టార్ సోఫియా లియోన్ (26) మరణించారు. మార్చి 1న ఆమె అపార్ట్ మెంట్ లో విగతజీవిగా కనిపించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.