సినిమా
Dadas of Hyderabad: వర్మ మరో బాంబు, హైదరాబాద్ దాదాగిరిపై తదుపరి సినిమా,హీరోగా జార్జిరెడ్డి ఫేం సందీప్ మాధవ్, హైదరాబాద్‌లో 1980లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా సినిమా
Hazarath Reddyసంచలనాలకు కేంద్ర బిందువైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma) తన స్పీడ్ పెంచాడు. వరుసగా సినిమాలను పట్టాలు ఎక్కిస్తున్నాడు. ఇప్పటికే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ (Kamma Raajyam lo Kadapa Redlu) విడుదలకు సిద్ధమవుతుండ గానే ఈలోపు మరో సినిమాను ప్రకటించాడు. జార్జిరెడ్డి (George Reddy)సినిమాలో హీరోగా నటిస్తోన్న సందీప్ మాధవ్ (Sandeep Madhav) హీరోగా ఓ సంచలన చిత్రం చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
Arjun Suravaram Reporting: అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు నవంబర్ 29న డేట్ కుదిరింది, ఆ కేసు యొక్క పూర్తి సాక్ష్యాధారాలతో రిపోర్టింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న 'అర్జున్ లెనిన్ సురవరం' !
Vikas Mandaఈ సినిమా టైటిల్ పట్ల కూడా వివాదం నడిచింది. మొదట్లో ఈ సినిమాకు 'ముద్ర' అనే టైటిల్ పెట్టారు. అయితే టైటిల్, అవే లోగోలతో జగపతిబాబు సినిమా అప్పటికే విడుదలవడంతో ఈ సినిమాలో నిఖిల్ పాత్ర పేరు 'అర్జున్ లెనిన్ సురవరం' ....
Good Newwz: బెడ్ రూంలో సర్జికల్ స్ట్రైక్, పిల్లలు పుట్టకపోవడంపై దంపతుల బేజార్, రిపోర్టుల తారుమారుతో ఒకరి భార్యపై మరొకరి ప్రత్యేక కేర్, నవ్వుల్లో ముంచేస్తున్న 'గుడ్ న్యూస్' ట్రైలర్
Vikas Mandaరెండవ జంటకు చెందిన భర్త మొదటి జంట భార్యపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు. దీంతో ఆ భర్త కోపంతో నా భార్యపై నీకెందుకురా అంత ప్రేమ అంటే, నీ భార్య కడుపులో పెరిగేది నాకు పుట్టబోయే బిడ్డ. నా క్వాలిటీస్, నా నాణ్యత....
ANR National Awards 2018 - 2019: ఘనంగా ఏఎన్నార్ జాతీయ పురస్కార ప్రదానోత్సవం, దివంగత నటి శ్రీదేవి మరియు సీనియర్ నటి రేఖలకు పురస్కారాలు, ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి
Vikas Mandaఈ వేడుకకు అక్కినేని ఫ్యామిలీతో పాటు, టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ, అడవి శేష్, రాహుల్ రవీంద్రన్ అలాగే మంచు లక్ష్మీ, నిహారిక, తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు....
George Reddy Pre-release Event: బలమైన రాజకీయ కోణాలు, 'జార్జ్ రెడ్డి' ప్రీ- రిలీజ్ ఈవెంట్‌కు పోలీసుల అనుమతి నిరాకరణ, పవన్ కళ్యాణ్ హాజరయితే శాంతి భద్రతలు అదుపు తప్పే ప్రమాదం
Vikas Mandaఓయూ విద్యార్థి సంఘాలు గతంలో చాలా సార్లు పవన్ కళ్యాణ్ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించాయి. కెమెరామన్ గంగతో రాంబాబులో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని అప్పట్లో పెద్ద గొడవలే జరిగాయి. అలాగే పవన్ కళ్యాణ్ మరో సినిమా 'కొమరం పులి' లో....
Singer Geeta Mali Dies: రోడ్డు ప్రమాదంలో సింగర్ గీతా మాలి మృతి, అమెరికా నుంచి ఇండియా తిరిగి వచ్చి మృత్యువాత, విచారం వ్యక్తం చేసిన పలువురు సినీ ప్రముఖులు
Vikas Mandaయునైటెడ్ స్టేట్స్ నుంచి తిరిగి వచ్చిన సింగర్ గీత మాలి, ఆమె భర్త భర్త విజయ్ తో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి వారి స్వస్థలమైన నాసిక్ కు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న హోండా సిటీ కారు, మధ్యాహ్నం 3 గంటల సమయంలో షాహాపూర్ సమీపంలో ....
Mardaani 2 Trailer: భయంకరమైన రేప్ సీన్లు, మర్దానీ 2 ట్రైలర్ విడుదల, ప్రధాన పాత్ర పోషించిన రాణీ ముఖర్జీ, డిసెంబర్ 13న సినిమా విడుదల
Hazarath Reddyరాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా.. ‘మర్దానీ 2’(Mardaani 2 Trailer)కు సంబంధించిన ట్రైలర్ విడుదలయింది. 2014లో వచ్చిన ‘మర్దానీ’కిది (Mardaani ) సీక్వెల్‌గా వస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీ పుత్రన్ దర్శకత్వంలో, యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. మహిళల అక్రమ రవాణా నేపథ్యంలో ‘మర్దానీ’ రూపొందగా, కిడ్నాపింగ్, రేప్ వంటి ఘటనలతో ‘మర్దానీ 2’ తెరకెక్కుతోంది.
John Legend: మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్‌‌గా జాన్ లెజెండ్, ప్రకటించిన పీపుల్ మ్యాగజన్, నాకు చాలా భయంగా ఉంది అంటున్న హాలీవుడ్‌ లెజెండ్ సింగర్‌
Hazarath Reddyప్రముఖ మ్యాగజైన్ ఈ ఏడాది మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్‌‌ ఎవరనే విషయాన్ని ప్రకటించింది. ప్రముఖ హాలీవుడ్‌ సింగర్‌ జాన్‌ లెజెండ్‌ (John Legend) ఈ ఏడాదికి గాను ‘మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్‌’(Sexiest Man Alive)గా నిలిచాడు. ఇప్పటికే తన పాటలతో జనాలను ఉర్రూతలూగించిన ఈ పాప్‌ సింగర్‌ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Lata Mangeshkar Health Update: ఐసీయూలో లతా మంగేష్కర్, న్యుమోనియాతో పాటు గుండె సమస్యలు,ఛాతీలో ఇన్ ఫెక్షన్, యాంటీ బయాటిక్స్ అందిస్తున్న డాక్టర్లు, త్వరగా కోలుకోవాలని లక్షలాది మంది ప్రార్థనలు
Hazarath Reddyముఖ బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ (Bollywood legend Lata Mangeshkar)ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. తన గాన మాధుర్యంతో కోట్లాది మంది అభిమానుల మనసుదోచుకున్న లతా మంగేష్కర్ గుండె సమస్యలు, ఛాతీలో ఇన్ ఫెక్షన్ తో గత కొంత కాలం నుంచి బాధపడుతున్నారు.
Actor Rajasekhar Car Crash: మూడు పల్టీలు కొట్టిన కారు, నటుడు రాజశేఖర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల నిర్ధారణ, కారులో లభ్యమైన మద్యం బాటిళ్లు స్వాధీనం
Vikas Mandaహైదరాబాద్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు, అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారణకు వచ్చారు. రాజశేఖర్ కారుపై పలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు....
George Reddy: పవన్ కళ్యాణ్‌తో ఈ సినిమా తీయాలనుకున్నాను.., ముఖ్యమంత్రి అయ్యేవాడు! పవన్ కళ్యాణ్‌ను జార్జ్ రెడ్డితో పోల్చిన నాగబాబు, సినిమా కథపై ప్రశసంలు
Vikas Mandaజార్జ్ రెడ్డి కథ వినా, ఆయన గురించి మాట్లాడినా ఎంతో ప్రేరణ, ఉత్తేజం, స్పూర్థి కలుగుతాయి. అతణ్ని చూస్తే నాకు తమ్ముడు పవన్ కళ్యాణే గుర్తుకు వస్తాడని నాగబాబు అన్నారు. జార్జ్ రెడ్డి వ్యక్తిత్వం, అతడి పోరాడే తత్వం, అతడి ఎమోషన్స్ అన్నీ పవన్ కళ్యాణ్....
PAPPU LAANTI ABBAYI In KRKR: ఎవరీ పప్పు లాంటి అబ్బాయి, కెఆర్‌కెర్‌లో మరో పాటను విడుదల కాంట్రవర్సీ డైరక్టర్ వర్మ, ఇప్పటికే పాల్ మీద సాంగ్ విడుదల, పాత్రలను యాదృచ్చికంగానే చూడాలంటున్న వర్మ
Hazarath Reddyకాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తూ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి అందిరీ తెలిసిందే. ఇప్పటికే దానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలయింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో మారో పాటను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. పప్పులాంటి అబ్బాయి..శుద్ధ పప్పు చిన్నారి..బాధ నేను పడుతున్నా..చెప్పుకోలేకున్నా..అంటూ సాగే ఈ పాటను పరమ బ్రహ్మ ముహూర్తం..2019, నవంబర్ 10వ తేదీ ఆదివారం 9.36 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Panipat: ఇంకోసారి భారతదేశం వైపు ఎవరూ కన్నెత్తి చూసే సహాసం చేయాలన్నా భయపడే విధంగా జరిగిన మహా 'పానిపట్' యుద్ధం మరోసారి వీక్షించడానికి సిద్ధం కండి!
Vikas Mandaభారత దేశాన్ని దురాక్రమించాలని ఒకరు, దేశాన్ని కాపాడాలని ఒకరు ఇలా రెండు సామ్రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాన్ని ఆవిష్కరించబోతున్నారు. పానిపట్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు....
Rahul Sipligunj Chart-busters: మాస్ కా బాస్ రాహుల్ చిచ్చా! తెలుగు బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ కంపోజన్‌లో వచ్చిన కొన్ని టాప్ మ్యూజికల్ హిట్ సాంగ్స్
Vikas Mandaఅతడెప్పుడు అవకాశాల కోసం ఎదురు చూడలేదు, అవకాశాలే తనను వెతుక్కుంటూ వచ్చేలా తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. తన 25 ఏళ్ల అనుభవాన్ని ఈ ఒక్క పాటతో రాహుల్ అందుకున్నాడని టాలీవుడ్ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి అన్నారంటే అర్థం చేసుకోవచ్చు...
Bigg Boss Telugu 3 Winner: రూ.50 లక్షలతో ఏం చేస్తావన్న నాగార్జున, నా తల్లిదండ్రులకు మంచి ఇల్లు కొనిపెడతానన్న రాహుల్, ముగిసిన బిగ్‌బాస్ తెలుగు 3, టైటిల్ విన్నర్‌గా రాహుల్, రన్నర్‌గా శ్రీముఖి
Hazarath Reddyతెలుగు రియాలిటీ షో ముగిసింది.బిగ్‌బాస్‌’ సీజన్‌ 3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. రూ.50 లక్షల ప్రైజ్‌ మనీని గెలుచుకున్నాడు. ఫైనల్స్‌లో శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. ఎన్నో అంచనాలతో జూలై 22న 17 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ రియాల్టీ షో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అనేక మలుపులు, టాస్క్‌లతో వంద రోజులకు పైగా సాగిన ‘బిగ్‌’ రియాల్టీ షో లో 17 మంది సభ్యుల్లో అంతా ఎలిమినేట్‌ అవగా చివరికి ఇద్దరు మిగిలారు. ఈ ఇద్దరిలో రాహుల్ రూ. 50 లక్షలు గెలుకున్నాడు. యాంకర్, నటి శ్రీముఖి చివరి వరకూ రాహుల్ కు గట్టి పోటీనిచ్చారు.
Jakkanna Reaction on Varma Tweet: కెకెఆర్‌ఆర్‌లోకి రాజమౌళిని లాగిన రాంగోపాల్ వర్మ, నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటున్న జక్కన్న, నవ్వులు పూయిస్తున్న కెఎ పాల్ పాట
Hazarath Reddyకాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్, వివాదాలకు మారు పేరుగా నిలిచిన రాంగోపాల్ వర్మ ఈ మధ్య కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో సంచలనంగా మారిన సంగతి అందిరకీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన విడుదల చేసిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్ వివాదాలకు మరింతగా ఆజ్యం పోస్తోంది. ఇప్పటికే వివాదంలోకి సినీ ప్రముఖులను లాగిన వర్మ తాజాగా రాజమౌళిని కూడా ఈ వివాదంలోకి లాగే ప్రయత్నం చేశాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలోని కేఏ పాల్‌ సాంగ్‌ను రిలీజ్ చేసిన వర్మ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు.
Priya Prakash Wink Again: మళ్లీ కన్నుకొట్టిన మలయాళీ ముద్దుగుమ్మ, వైరల్ అవుతున్న వీడియో, విష్ణుప్రియ సినిమాతో కన్నడకు పరిచయం, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్
Hazarath Reddyమళయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఒరు అదార్ లవ్ సినిమాలో కన్ను కొట్టిన సీన్ యువకులను, పెద్దలను పిచ్చివాళ్లను చేసింది.కొంటెగా కన్నుగీటి కుర్రకారుని మైకంలో ముంచేసింది. ఇప్పుడు ఆమె ప్రస్తావన ఎందుకంటారా..మళ్లీ ఆ ముద్దుగుమ్మ కన్నుకొట్టింది.
Case Filed Against Varma KRKR: కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా టైటిల్‌‌పై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు, కులాల మధ్య గొడవలు, చిచ్చు పెట్టేలా సినిమా, వర్మపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగరాజు
Hazarath Reddyకాంట్రవర్సీ కింగ్, వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' (kamma rajyamlo kadapa redlu)అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ పై ఇప్పటికే వివాదాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యాక ఈ వివాదం మరింత ముదిరింది.
Bigg Boss 3 Final Stage: ముగింపుకు వచ్చిన బిగ్‌బాస్ 3, ఫైనల్‌కు చేరుకున్న రాహుల్, బాబా భాస్కర్, శ్రీముఖి, మరొకరు ఎవరనేది సస్పెన్స్, వచ్చే ఆదివారం ఫైనల్ విజేత ఎవరనేది తెలుస్తుంది
Hazarath Reddyతెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 3 ముగింపు ద‌శ‌కు చేరుకుంది. నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో వ‌చ్చే ఆదివారంతో పూర్తిగా ముగియ‌నుంది. వ‌చ్చే ఆదివారం ఫైన‌ల్ విజేత ఎవ‌రో తెలుతుంది. ఇప్ప‌టికే ఫైనల్స్‌కు రాహుల్ సిప్లిగంజ్‌, కొరియోగ్రాఫ‌ర్ బాబా భాస్క‌ర్ రీచ్ అయ్యారు. కాగా శ‌నివారం శ్రీముఖి ఫైన‌ల్స్‌కు వెళుతున్న‌ట్లు నాగార్జున తెలియ‌జేశారు.
Varma KRKR Target: కాంట్రవర్సీ కింగ్ వర్మ మరో సంచలనం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, ఏపీ రాజకీయాల్లోని ప్రముఖ నేతలందరిపై గురి, ఆ దేవుడే నన్ను వెన్నుపోటు పొడిచాడంటున్న ట్రైలర్
Hazarath Reddyకాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలను మరోసారి తెరమీదకు తీసుకువస్తున్నారు. ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబించేలా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో తీస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను వర్మ దీపావళి బాణసంచాకు జతగా ఈ రోజు విడుదల చేశారు.