Ashu Reddy: డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆషూ రెడ్డి స్పందన.. అనవసరంగా ఈ విషయంలోకి లాగుతున్నారని గరం

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి కాల్ లిస్ట్ లో పలువురు సినీ ప్రముఖుల పేర్లలో బిగ్ బాస్ ఫేమ్, నటి ఆషూ రెడ్డి పేరు ఉండడం తో మరోసారి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై తాజాగా ఆమె స్పందించారు.

Ashu Reddy: డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆషూ రెడ్డి స్పందన.. అనవసరంగా ఈ విషయంలోకి లాగుతున్నారని గరం
Ashureddy (Credits: Twitter)

Hyderabad, June 24: టాలీవుడ్ (Tollywood) చిత్రసీమలో మరోసారి డ్రగ్స్ (Drugs) వ్యవహారం సంచలనం రేపుతోంది. ఆ మధ్య టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్స్ , నటీనటులు , టెక్నీషన్ల పేర్లు ఈ డ్రగ్స్ కేసులో వినిపించడం..ఆ తర్వాత వారికీ క్లీన్ చిట్ (Clean Chit) రావడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి కాల్ లిస్ట్ లో పలువురు సినీ ప్రముఖుల పేర్లలో బిగ్ బాస్ ఫేమ్, నటి ఆషూ రెడ్డి  పేరు ఉండడం తో మరోసారి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై తాజాగా ఆమె స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆమె సోషల్ మీడియా వేదికగా ఖండించారు.

Hyderabad Shocker: ఇంటిముందు చెత్త వేసినందుకు మహిళపై హైకోర్టు అడ్వొకేట్ దాడి.. మలక్‌పేట్‌లో వెలుగు చూసిన ఘటన.. వీడియో వైరల్

Mary Milliben Touches PM Modi's Feet: ప్రధాని మోదీకి పాదాభివందనం చేసిన ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్లీ బెన్.. వీడియో ఇదిగో

వార్తలన్నీ తప్పని స్పష్టం

తనకు డ్రగ్స్‌ కు సంబంధించి ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవని, తనపై వచ్చిన వార్తలన్నీ తప్పని స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తుల గురించి అన్ని విషయాలు చెబుతానని అన్నారు. అనుమతి లేకుండా తన ఫోన్ నెంబర్ ప్రచురిస్తే అస్సలు ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలు తనపై ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

(The above story first appeared on LatestLY on Jun 24, 2023 10:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).